Visakhapatnam: విశాఖలో రోడ్డు ప్రమాదం.. ఇద్దరు దుర్మరణం.. మరొకరికి..
Road Accident: ఏపీలోని విశాఖపట్నం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఎలమంచిలి పెట్రోల్ బంక్ సమీపంలో ఆదివారం తెల్లవారుజామున జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో
Road Accident: ఏపీలోని విశాఖపట్నం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఎలమంచిలి పెట్రోల్ బంక్ సమీపంలో ఆదివారం తెల్లవారుజామున జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు దుర్మరణం చెందారు. మరొకరికి తీవ్రగాయాలయ్యాయి. (Visakhapatnam) జాతీయ రహదారిపై బొలెరో వాహనాన్ని అటుగా వెళ్తున్న లారీ ఢీకొంది. ఈ ఘటనలో ఇద్దరు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా.. మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా ప్రదేశానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వ్యక్తిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పూర్తి సమాచారం అందవలసి ఉంది. మృతి చెందిన వారు పాయకరావుపేట మండలం గోపాలపట్నం గ్రామానికి చెందిన నానీ, సూరిబాబు గా పోలీసులు గుర్తించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.
విజయవాడలో..
ఇదిలాఉంటే.. విజయవాడలో కారు బీభత్సం సృష్టించింది. మాచవరం దాసాంజనేయ స్వామి ఆలయం వద్ద ఈ ఘటన జరిగింది. పూజ కోసం వచ్చిన కొత్త కారు.. దూసుకెళ్లిన ఘటనలో ఇద్దరికి గాయాలయ్యాయి. కారుకి పూజ చేస్తున్న క్రమంలో యజమాని బ్రేక్ బదులు ఎక్సలేటర్ తొక్కడంతో ఒక్కసారిగా దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. పార్కింగ్ లోని బైక్ లు ధ్వంసం అయ్యాయి.
Also Read: