AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

AP Crime News: జాకెట్లల్లో బంగారం బిస్కెట్లు.. బస్సు సీటు కింద డబ్బు.. కర్నూలు చెక్‌పోస్ట్‌లో పోలీసులకు షాక్..

Panchalingala Check Post: అక్రమంగా రవాణా చేస్తున్న కోట్ల విలువైన బంగారం.. నగదును చూసి కర్నూలు జిల్లా స్పెషల్ బ్రాంచ్ పోలీసులు (SEB) పోలీసులు షాకయ్యారు. తనిఖీల్లో రూ. 5 కోట్లకు పైగా విలువచేసే

AP Crime News: జాకెట్లల్లో బంగారం బిస్కెట్లు.. బస్సు సీటు కింద డబ్బు.. కర్నూలు చెక్‌పోస్ట్‌లో పోలీసులకు షాక్..
Crime News
Shaik Madar Saheb
|

Updated on: Mar 06, 2022 | 11:34 AM

Share

Panchalingala Check Post: అక్రమంగా రవాణా చేస్తున్న కోట్ల విలువైన బంగారం.. నగదును చూసి కర్నూలు జిల్లా స్పెషల్ బ్రాంచ్ పోలీసులు (SEB) పోలీసులు షాకయ్యారు. తనిఖీల్లో రూ. 5 కోట్లకు పైగా విలువచేసే బంగారు, వెండి బిస్కెట్లు, గోల్డ్ జ్యువెలర్స్ తో పాటు 90 లక్షల నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అక్రమ రవాణా చేస్తున్న వ్యక్తులను ఏపీ కర్నూలు జిల్లాలోని (kurnool district) పంచలింగాల చెక్ పోస్ట్ వద్ద అదుపులోకి తీసుకొని వారి వద్ద ఉన్న బంగారం, నగదును సీజ్ చేసినట్లు పోలీసులు తెలిపారు. హైదరాబాద్ నుంచి కోయం బత్తూరు వెళ్తున్న NL01 B 1149 నెంబరు గల స్వామి అయ్యప్ప ప్రైవేటు ట్రావెల్ బస్సును పంచాలింగాల అంతరాష్ట్ర సరిహద్దు వద్ద పోలీసులు తనిఖీ చేశారు. ప్రయాణికులను చెక్ చేస్తుండంగా ఐదుగురు అనుమానాస్పదంగా కనిపించాడు. వ్యక్తుల బ్యాగుల్లో సుమారు 28.5 కేజీల వెండి బిస్కెట్లు, మరో వ్యక్తి జాకెట్ లో 8.250 కేజీల బంగారం బిస్కెట్లు.. వారందరి స్లీపర్ సీట్ల కింద 90 లక్షల పైగా నొట్ల కట్టలను గుర్తించారు SEB పోలీసులు.

బంగారాన్ని అక్రమ రవాణా చేస్తున్న వ్యక్తులు తమిళనాడు, సేలం పట్టణానికి చెందిన దేవరాజు, సెల్వ రాజు, కుమార వేలు, మేయలాగ మురుగేశన్, కొయంబత్తురుకు చెందిన వెంకటేశ్‌లుగా గుర్తించారు. హైదరాబాద్‌లోని వివిధ బంగారపు షాపుల్లో ముడి బంగారం, వెండిని సేకరించి.. తమిళనాడులో ఆభరణాలుగా తయారుచేసి.. తిరిగి హైదరాబాద్ లోని జ్యువెలరీ షాపుల్లో ఆప్పగిస్తామన్నారు. అయితే పట్టుబడ్డ బంగారం, నగదుకు సంబంధించిన డాక్యుమెంట్స్ లేకపోవడంతో వాటిని స్వాధీనం చేసుకొని ఐదుగురిని అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.

Also Read:

Hyderabad: స్కూల్‌కు వెళ్లి మళ్లీ తిరిగిరాలేదు.. నగరంలో ఇద్దరు బాలికల అదృశ్యం.. అసలేం జరిగింది?

Tirupati: సెల్‌ఫోన్ చూడొద్దంటూ మందలించిన తల్లి.. కూతురు ఏం చేసిందంటే..?

Follow Us
సింగరేణి‌ శివంగులు..భూగర్బ గనుల్లో దూసుకెళుతున్న మహిళా కార్మికులు
సింగరేణి‌ శివంగులు..భూగర్బ గనుల్లో దూసుకెళుతున్న మహిళా కార్మికులు
కొత్త ఫోన్ కొనుగోలు చేసేటప్పుడు ఈ చిన్న తప్పు చేస్తే జైలుకే..
కొత్త ఫోన్ కొనుగోలు చేసేటప్పుడు ఈ చిన్న తప్పు చేస్తే జైలుకే..
ఇరుముడి సినిమాలో అయ్యప్ప భక్తలకు ఇష్టమైన పాట.. అసలు నిజమిదే..
ఇరుముడి సినిమాలో అయ్యప్ప భక్తలకు ఇష్టమైన పాట.. అసలు నిజమిదే..
గొరిల్లా పవర్ ఎంతుంటుందో తెల్సా.!
గొరిల్లా పవర్ ఎంతుంటుందో తెల్సా.!
వాట్ ఇండియా థింక్స్ టుడే సదస్సు.. అసదుద్దీన్ ప్రసంగంపైనే అందరి..
వాట్ ఇండియా థింక్స్ టుడే సదస్సు.. అసదుద్దీన్ ప్రసంగంపైనే అందరి..
దొండకాయ పెరుగు పచ్చడి.. తినని వాళ్ళకు కూడా నచ్చేస్తుంది
దొండకాయ పెరుగు పచ్చడి.. తినని వాళ్ళకు కూడా నచ్చేస్తుంది
పసిడి ప్రియులు ఎగిరిగంతేసే వార్త.. భారీగా తగ్గిన బంగారం, వెండి
పసిడి ప్రియులు ఎగిరిగంతేసే వార్త.. భారీగా తగ్గిన బంగారం, వెండి
అమెజాన్ నుంచి ఏఐ 'ట్రాన్స్‌ఫార్మర్' ఫోన్! ఆపిల్, శాంసంగ్‌లకు చెక్
అమెజాన్ నుంచి ఏఐ 'ట్రాన్స్‌ఫార్మర్' ఫోన్! ఆపిల్, శాంసంగ్‌లకు చెక్
100 అవకాశాలు వచ్చాయి.. కానీ.. చిన్న రోల్ వచ్చినా చాలు..
100 అవకాశాలు వచ్చాయి.. కానీ.. చిన్న రోల్ వచ్చినా చాలు..
బ్యాడ్ న్యూస్.. మళ్లీ పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు
బ్యాడ్ న్యూస్.. మళ్లీ పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు