Hyderabad: స్కూల్‌కు వెళ్లి మళ్లీ తిరిగిరాలేదు.. నగరంలో ఇద్దరు బాలికల అదృశ్యం.. అసలేం జరిగింది?

Girls Missing in Hyderabad: హైదరాబాద్ దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సూరారంలో ఇద్దరు స్టూడెంట్స్ మిస్సింగ్ కలకలం రేపుతుంది. సురారం గవర్నమెంట్ స్కూల్ లో 10వ తరగతి

Hyderabad: స్కూల్‌కు వెళ్లి మళ్లీ తిరిగిరాలేదు.. నగరంలో ఇద్దరు బాలికల అదృశ్యం.. అసలేం జరిగింది?
Girls Missing
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Mar 06, 2022 | 9:32 AM

Girls Missing in Hyderabad: హైదరాబాద్ దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సూరారంలో ఇద్దరు స్టూడెంట్స్ మిస్సింగ్ కలకలం రేపుతుంది. సురారం గవర్నమెంట్ స్కూల్ లో 10వ తరగతి చదువుతున్న మౌనిక, గాయత్రిలు శనివారం అదృశ్యమయ్యారు. ఆందోళన చెందిన తల్లిదండ్రులు స్నేహితుల ఇళ్లల్లో అడిగినా ఎలాంటి సమాచారం లభించలేదు. అయితే.. వారి కోసం వెతుకుతున్న క్రమంలో కుటుంబసభ్యులకు సురారం చెరువు కట్ట వద్ద బాలికల స్కూల్ బ్యాగులు లభ్యమయ్యాయి. దీంతో మౌనిక, గాయత్రిలు ఇంటికి రాలేదంటూ తల్లిదండ్రులు దుండిగల్ (Dundigal) పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీంతోపాటు స్కూల్ బ్యాగులు చెరువు కట్ట దగ్గర ఉన్నాయంటూ చెప్పడంతో పోలీసులు రంగంలోకి దిగి గాలింపు చర్యలు చేపట్టారు.

కాగా.. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ప్రమాదవశాత్తూ బాలికలు చెరువులో పడ్డారా..? లేక మరెక్కడికైనా వెళ్ళారా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. బాలికల ఆచూకీ ఇంతవరకు తెలియకపోడంతో తల్లిదండ్రులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. దీంతోపాటు పాఠశాల ఉపాధ్యాయుల నుంచి కూడా పోలీసులు వివరాలు సేకరించారు.

Also Read:

Wedding Function: కాంగ్రెస్ లీడర్ తనయుడి వివాహ వేడుకలో అపశ్రుతి.. కలుషిత ఆహారం తిని 1200మందికి అస్వస్థత

Hyderabad: స్పా సెంటర్ల పేరిట చీకటి వ్యాపారం.. ఆరుగురు యువతులను రక్షించిన పోలీసులు