అసభ్యంగా మాట్లాడుతున్నాడని రాయితో కొట్టి.. రెండేళ్ల తరువాత ఊహించని ట్విస్ట్
వారిద్దరూ ప్రాణ స్నేహితులు. ఎక్కడికి వెళ్లినా ఇద్దరూ కలిసే వెళ్లేవారు. అయితే తన భార్య గురించి అసభ్యంగా మాట్లాడడాన్ని ఆ స్నేహితుడు తట్టుకోలేకపోయాడు. వద్దని వారించాడు. అయినా వినకపోవడంతో..
వారిద్దరూ ప్రాణ స్నేహితులు. ఎక్కడికి వెళ్లినా ఇద్దరూ కలిసే వెళ్లేవారు. అయితే తన భార్య గురించి అసభ్యంగా మాట్లాడడాన్ని ఆ స్నేహితుడు తట్టుకోలేకపోయాడు. వద్దని వారించాడు. అయినా వినకపోవడంతో అతనిని చంపేయాలని నిర్ణయించుకున్నాడు. పథకం ప్రకారం మద్యం తాగించి, తలపై రాయితో కొట్టి చంపేశాడు(Murder). అనంతరం మృతదేహాన్ని తగలబెట్టారు. మృతుని బంధువుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. రెండేళ్ల క్రితం జరిగిన ఈ ఘటనలో పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. అతనిని అరెస్టు చేసి, కోర్టులో హజరుపరచారు. గుంటూరు(Guntur)లోని నెహ్రూనగర్ ప్రాంతానికి చెందిన ఫణికృష్ణ, తాడికొండ మండలం లాం గ్రామానికి చెందిన అజయ్‌సాయి స్నేహితులు. కొద్ది రోజులుగా వారిద్దరి మధ్య గొడవలు జరుగుతున్నాయి. తన భార్య గురించి ఫణికృష్ణ వ్యాఖ్యలు చేయడం సరికాదని అజయ్ హెచ్చరించాడు. అయినా ఫణి ప్రవర్తనలో మార్పు రాకపోవడంతో.. అతనిని హత్య చేయించాలని అజయ్ పథకం వేశాడు. ఇందులో భాగంగా ఫిబ్రవరి 16, 2020న ఫణికృష్ణతో గోవా వెళ్దామని చెప్పి, సమీపంలోని ప్లాట్ల వద్దకు తీసుకువెళ్లాడు. అక్కడ ఇద్దరూ మద్యం తాగుతుండగా, తన భార్య గురించి అసభ్యంగా మాట్లాడడంతో అజయ్‌సాయి ఆగ్రహించాడు. విచక్షణ కోల్పోయి ఫణికృష్ణ తలపై రాయితో కొట్టి చంపాడు. అనంతరం మృతదేహంపై డీజిల్ పోసి తగలబెట్టాడు.
తన కుమారుడు కనిపించడం లేదంటూ మృతుడి తల్లి ఫిబ్రవరి 19, 2020న పోలీసులకు ఫిర్యాదు చేశారు. అప్పటి నుంచి కేసు దర్యాప్తు కొనసాగుతోంది. ఈ క్రమంలో కేసు దర్యాప్తు ముమ్మరం చేసిన పోలీసులు.. రెండు రోజుల క్రితం అజయ్‌సాయిని హైదరాబాదులో అదుపులో తీసుకొన్నారు. తమదైన శైలిలో విచారించగా ఫణికృష్ణను హత్య చేసినట్లు అంగీకరించాడు. అనంతరం నిందితుడిని అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచారు.
Also Read
అర్ధరాత్రి పిల్లలు ఇంటర్నెట్ వాడుతున్నారని.. ఆ తండ్రి ఏం చేశాడో తెలిస్తే !! వీడియో
ఔదార్యం చాటుకున్న పవన్ కల్యాణ్.. ఆ కార్యకర్త కుటుంబానికి భారీగా ఆర్థిక సాయం