ఊహించిందే జరిగింది..ప్లేస్ మారింది కానీ పద్ధతి మారలేదు. మళ్లీ అదే అంతర్గత పోరు. అవే వివాదాలు, అవే వాకౌట్లు. కాంగ్రెస్ అంటేనే అంత! అందులోనూ తెలంగాణ కాంగ్రెస్ సమ్‌థింగ్ స్పెషల్. CLP మీటింగ్ వేదికగా ఇది మరోసారి రుజువైంది. మరోసారి విభేదాలు బయపడ్డాయి. సోమవారం నుంచి అసెంబ్లీ సమావేశాలు. ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు.. ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిరి చేసేందుకు అనుసరించాల్సిన వ్యూహాలపై CLP సమావేశమైంది. గాంధీభవన్‌లో జరిగితే వివరాలు బయటకు వెళ్తాయన్న ఉద్దేశంతో.. తాజ్ డెక్కన్ హోటల్లో పెట్టుకున్నారు మీటింగ్. కానీ సమావేశం ప్రారంభంలోనే ఝలక్ ఇచ్చారు ఎమ్మెల్యే జగ్గారెడ్డి. లెటెస్ట్‌గా రేవంత్ , జగ్గారెడ్డి మధ్య మరో వివాదం రాజుకుంది.. ఆదివారం మెదక్ చర్చికి వెళ్ళారు రేవంత్ . మెదక్ టూర్‌పై తనకు ఏమాత్రం సమాచారం లేదంటూ సీరియస్ అవుతున్నారు జగ్గారెడ్డి.
ముందుగా మాట్లాడే అవకాశం ఇవ్వాలని కోరారు. పీసీసీ చీఫ్ రేవంత్ తీరు పై అందరి ముందు మాట్లాడతానని చెప్పారు. అయితే ఇది సమయం కాదంటూ సర్దిచెప్పారు భట్టివిక్రమార్క. దీంతో సీఎల్పీ మీటింగ్‌ను బాయ్‌కాట్ చేసి వెళ్లిపోయారు జగ్గారెడ్డి. కొంతకాలంగా పీసీసీలో జరుగుతున్న పరిణామాలపై అసంతృప్తితో ఉన్నారు జగ్గారెడ్డి. ఏకంగా హైకమాండ్‌కు లేఖ కూడా రాశారు.
అటు ఆదివారం రేవంత్ రెడ్డి మెదక్ టూర్‌కు వెళ్లారు. ఈ పర్యటనపై కనీసం తనకు సమాచారం కూడా ఇవ్వలేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు జగ్గారెడ్డి. ఇదే ఇష్యూని CLP మీటింగ్‌లో ప్రస్తావించాలని భావించారు. అయితే అది కుదరకపోవడంతో పార్టీ మీటింగ్ నుంచి బయటకు వచ్చేశారు.
అయితే.. రేపటి నుంచి తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై సమావేశం అయ్యింది కాంగ్రెస్ శాసనసభాపక్షం. ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు ఏయే ఇష్యూస్‌ని ప్రస్తావించాలి అనే అంశాలపై చర్చించేందకు ప్లాన్ చేశారు. ముఖ్యంగా రైతు సమస్యలే ఎజెండాగా ముందుకెళ్లాలని కాంగ్రెస్ భావిస్తోంది.
ఇప్పటికే CLP లీడర్ భట్టివిక్రమార్క పీపుల్స్‌మార్చ్ పేరుతో ప్రజల్లోకి వెళ్తున్నారు. అటు సోమవారం గవర్నర్‌ను కలిసి రాష్ట్రంలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై వినతిపత్రం కూడా ఇవ్వాలని నిర్ణయించారు. అసెంబ్లీ వ్యూహాలను పక్కన పెడితే సీఎల్పీ మీటింగ్ హాట్‌హాట్‌గా సాగే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.
ఇవి కూడా చదవండి: Russia Ukraine War Live Updates: ఉక్రెయిన్‌పై ఆగని బాంబుల వర్షం.. దద్దరిల్లుతున్న పట్టణాలు.. కుప్పకూలుతున్న భవనాలు..
Job Fair: రౌడీషీటర్లకు బంపర్ ఆఫర్.. పోలీసుల జాబ్ మేళాకు భారీ స్పందన..