AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Arthritis In Monsoon: వర్షాకాలంలో కీళ్ల సమస్యల దాడి… నివారణకు తీసుకోవాల్సిన చర్యలివే

ముఖ్యంగా ప్రతిరోజూ ఉదయం లేచిన వెంటే కీళ్లనొప్పులు వేధిస్తే దాన్ని ఆర్థరైటిస్‌ లక్షణాలు పరిగణించాలని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా ఆర్థరైటిస్‌ లక్షణాలు అధిక తేమ స్థాయి, వాతావరణ పీడం తీవ్రతరం చేస్తాయి. వాతావరణంలో అల్ప పీడనం వల్ల కీళ్లలో, చుట్టుపక్కల ఉన్న కణజాలాలు విస్తరిస్తాయి.

Arthritis In Monsoon: వర్షాకాలంలో కీళ్ల సమస్యల దాడి… నివారణకు తీసుకోవాల్సిన చర్యలివే
Knee Pain Tips
Nikhil
|

Updated on: Jul 21, 2023 | 4:15 PM

Share

భారతదేశంలో దంచికొడుతున్న ఎండల నుంచి ఉపశమనం కలిగిస్తూ వానలు మొదలయ్యాయి. కొన్ని ప్రాంతాల్లో అధిక వర్షాలు పలు ఇబ్బందులను కలుగజేస్తున్నాయి. అయితే ఒక్కసారిగా వాతావరణం మారిపోవడంతో కీళ్ల నొప్పుల సమస్య వేధిస్తుంది. ముఖ్యంగా ఆర్థరైటిస్ ఉన్నవారిలో ఎముకల సమస్యలు మరింత తీవ్రం అవుతాయి. ముఖ్యంగా ప్రతిరోజూ ఉదయం లేచిన వెంటే కీళ్లనొప్పులు వేధిస్తే దాన్ని ఆర్థరైటిస్‌ లక్షణాలు పరిగణించాలని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా ఆర్థరైటిస్‌ లక్షణాలు అధిక తేమ స్థాయి, వాతావరణ పీడం తీవ్రతరం చేస్తాయి. వాతావరణంలో అల్ప పీడనం వల్ల కీళ్లలో, చుట్టుపక్కల ఉన్న కణజాలాలు విస్తరిస్తాయి. కాబట్టి కొంతమంది వాపు, మంట, తీవ్రమైన నొప్పిని అనుభవించవచ్చు. ఆర్థరైటిస్ అనేది కీళ్లలో వాపు, వాపునకు కారణమయ్యే కీళ్ల వ్యాధిని సూచిస్తుంది. ప్రస్తుతం దాదాపు 100 రకాల ఆర్థరైటిస్‌లు ఉన్నాయి. ఇది ప్రపంచవ్యాప్తంగా వైకల్యానికి ప్రధాన కారణం. వయస్సుతో ఆర్థరైటిస్ సాధారణంగా అభివృద్ధి చెందుతుంది. కాబట్టి ఈ సమస్యపై మరిన్ని వివరాలు తెలుసుకుందాం.

నొప్పి తీవ్రత ఇందుకే?

అధిక వర్షపాతం, పెరిగిన తేమతో కూడిన వర్షాకాలం, కీళ్లనొప్పులతో నివసించే వ్యక్తులపై గణనీయమైన ప్రభావాన్ని చూపుతుంది. ఆర్థరైటిస్ ఉన్న చాలా మంది వ్యక్తులు ఈ సమయంలో తమ వ్యాధి లక్షణాల్లో మార్పును గమనిస్తారు. పెరిగిన కీళ్ల నొప్పులు, దృఢత్వం, అసౌకర్యాన్ని అనుభవిస్తారు. రుతుపవన వాతావరణంతో వాతావరణ పీడనంలో మార్పులు కీళ్ల ఒత్తిడిని ప్రభావితం చేస్తాయి.  రుతుపవన వాతావరణం తరచుగా ఆకస్మిక ఉష్ణోగ్రత మార్పులను తెస్తుంది. ఇది కీళ్ల ద్రవం చిక్కదనాన్ని ప్రభావితం చేస్తుంది. కాబటట్టి ఈ సమయంలో ఎలాంటి జాగ్రతలు తీసుకోవాలో? నిపుణులు వెల్లడిస్తున్నారు. అవేంటో ఓ సారి తెలుసుకుందాం.

చురుగ్గా ఉండడం

వర్షాకాలంలో ఆర్థరైటిస్‌తో బాధపడేవారు మరింత చురుగ్గా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. కచ్చితంగా వ్యాయామాన్ని స్కిప్‌ చేయకూడదు. వర్షాకాలంలో మీ శరీరాన్ని కదిలించడం వల్ల కీళ్ల దృఢత్వం నుంచి ఉపశమనం పొందవచ్చు. ఆర్థరైటిస్‌ను నిర్వహించడానికి రెగ్యులర్ శారీరక శ్రమ కీలకం. వర్షాకాలంలో కీళ్ల సౌలభ్యాన్ని నిర్వహించడానికి, దృఢత్వాన్ని తగ్గించడానికి, ఈత కొట్టడం లేదా ఇంటి లోపల నడవడం వంటి తక్కువ-ప్రభావ వ్యాయామాల్లో పాల్గొనాలి.

ఇవి కూడా చదవండి

బరువు నిర్వహణ

వాకింగ్, సైక్లింగ్, స్విమ్మింగ్ వంటివి కీళ్లనొప్పుల కోసం సిఫార్సు చేయబడిన వ్యాయామాల్లోఉన్నాయి. ఎందుకంటే అవి కీళ్లపై కనీస ఒత్తిడిని కలిగిస్తాయి. బరువు తగ్గడం వల్ల ఆర్థరైటిస్‌ను సులభంగా నిర్వహించడంలో సహాయపడుతుంది. అలాగే మీ శక్తి స్థాయిలను కూడా పెంచుకోవచ్చు. అధిక బరువు కీళ్లపై అదనపు ఒత్తిడిని కలిగిస్తుంది. ఆర్థరైటిస్ లక్షణాలను తీవ్రతరం చేస్తుంది. ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం, శారీరక శ్రమ, యోగా వంటివి బరువు తగ్గడంలో సహాయపడతాయి. తద్వారా కీళ్లపై భారాన్ని తగ్గించడంలో సహాయపడతాయి.

వేడి నీళ్ల మసాజ్‌

ఆర్థరైటిస్ లక్షణాలు పెరిగినప్పుడు ప్రజలు విశ్వసించే కొన్ని ఇంటి నివారణలు ఉన్నాయి. వేడి నీళ్లతో కీల్ల వద్ద మసాజ్‌ మంచి ఫలితాలను ఇస్తుంది. ఇది ఎల్లప్పుడూ ప్రభావవంతంగా ఉంటుంది. ముఖ్యంగా వాతావరణం వల్ల కలిగే కీళ్ల నొప్పులు, దృఢత్వాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది.

హైడ్రేటెడ్‌గా ఉండడం

వర్షాకాలంలో మీకు ప్రత్యేకించి దాహం అనిపించకపోవచ్చు. కానీ ఈ సమయంలో చెమట ద్వారా చాలా నీటిని కోల్పోతారు కాబట్టి మీరు హైడ్రేట్ చేసుకోవడం చాలా ముఖ్యం. తగినంత మొత్తంలో నీరు తాగడం వల్ల కీళ్లను ద్రవపదార్థంగా ఉంచడంలో సహాయపడుతుంది. అలాగే ఆర్థరైటిస్ లక్షణాలను కూడా  తగ్గించవచ్చు. వర్షాకాలంలో హైడ్రేషన్ చాలా ముఖ్యం. ఎందుకంటే పెరిగిన తేమ నిర్జలీకరణానికి దారితీస్తుంది.

తగిన దుస్తులు ధరించడం

చలి, తేమ నుంచి రక్షించే వదులుగా, సౌకర్యవంతమైన దుస్తులను ధరించాలి. నొప్పి కొనసాగితే లేదా తీవ్రంగా ఉంటే వైద్యులు సలహా తీసుకోవడం ఉత్తమయం. చికిత్సలో మందులు, భౌతిక చికిత్స వంటి వాటి ద్వారా కీళ్ల నొప్పుల ప్రభావాన్ని తగ్గించడంలో సాయం చేస్తాయి. 

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..