మీ ఒంట్లోనూ ‘సైలెంట్ కిల్లర్’.. అశ్రద్ధ చేశారో ప్రాణాలు తీసేస్తుంది! తస్మాత్ జాగ్రత్త..
High BP: వైద్యులు, నిపుణులు దానిని సైలెంట్ కిల్లర్ అని పిలుస్తారు. శరీరంలోనే ఉంటుంది. కానీ బయట పడదు. కానీ చేయాల్సిన నష్టాన్ని నెమ్మదిగా చేసేస్తోంది. చివరికి మనిషి ప్రాణాన్ని హరించేస్తుంది. అదే హైపర్ టెన్షన్(రక్తపోటు). చాలా సందర్భాల్లో స్ట్రోక్స్, హార్ట్ అటాక్స్ కేవలం ఈ హై బీపీ వల్లే వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు.
వైద్యులు, నిపుణులు దానిని సైలెంట్ కిల్లర్ అని పిలుస్తారు. శరీరంలోనే ఉంటుంది. కానీ బయట పడదు. కానీ చేయాల్సిన నష్టాన్ని నెమ్మదిగా చేసేస్తోంది. చివరికి మనిషి ప్రాణాన్ని హరించేస్తుంది. అదే హైపర్ టెన్షన్(రక్తపోటు). చాలా సందర్భాల్లో స్ట్రోక్స్, హార్ట్ అటాక్స్ కేవలం ఈ హై బీపీ వల్లే వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. అంతేకాక దీర్ఘకాలంలో ఇది పలు కార్డియో వాస్కులర్ వ్యాధులకు, కిడ్నీ సంబంధిత వ్యాధులు, డిమెన్షియా వంటి వ్యాధులకు ఇది కారణమవుతుంది. దీనిలో మరో ప్రమాదకర అంశం ఏమిటంటే హై బీపీని కలిగి ఉన్న వారికి అది ఉన్నట్లు అసలు తెలీదు. ఎందుకంటే ఎటువంటి లక్షణాలను ఇది చూపదు. కొందరిలో పరీక్ష చేస్తే గానీ బయటకు రాదు. అందుకే హై బీపీ విషయంలో జాగ్రత్తలు వహించాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలో అసలు అధిక రక్తపోటు అంటే ఏమిటి? దానిని ఎలా గుర్తించాలి? చికిత్స విధానాలు ఏమిటి తెలుసుకుందాం రండి..
రక్తపోటు అంటే..
- అమెరికన్ హార్ట్ అసోసియేషన్ చెబుతున్న దాని ప్రకారం రక్తపోటు అంటే గుండె రక్తాన్ని ధమనుల గోడల మీదుగా పంప్ చేయడం. అధిక రక్తపోటు ఉన్న వారిలో రక్తం సాధారణ ఒత్తిడి(ప్రెజర్) కన్నా ఎక్కువ ప్రెజర్ తో ధమనుల ద్వారా ప్రవహిస్తుంది. దీనికి కొలవడానికి రెండు ప్రాథమిక అంశాలను పరిగణనలోకి తీసుకుంటారు.
- అవేంటంటే.. బీపీలో చూపించి రెండు సంఖ్యల్లో పెద్ద సంఖ్య దీనినే సిస్టోలిక్ ప్రెజర్ అంటారు. గుండె కొట్టుకొంటున్నప్పుడు ధమనుల గోడల మీదుగా ఇది వెళ్తుంది.
- రెండోది కింద ఉండే తక్కువ నంబర్. దీనిని డయాస్టోలిక్ అని అంటారు. గుండె బీట్ టు బీట్ మధ్య సమయంలో ధమనుల మధ్య రక్త ప్రవాహానికి ఏర్పడే ఒత్తడి.
- సాధారణంగా వైద్యులు సిస్టోలిక్ అనేది 130 కన్నా ఎక్కువ ఉండి.. డయాస్టోలిక కూడా 80 కన్నా ఎక్కువగా ఉంటే ఆ వ్యక్తి హైపర్ టెన్షన్‌తో బాధపడుతున్నట్లు నిర్ధారిస్తారు.
ప్రమాదాలు ఇవి..
హై బ్లడ్ ప్రెజర్ వల్ల ఆకస్మికంగా ఏర్పడే గుండెపోటులు, బ్రెయిన్ స్ట్రోక్‌లతో పాటు అనేక రకాల తీవ్రమైన ఆరోగ్య పరిస్థితులకు దారితీస్తుంది. అవేంటంటే.. హార్ట్ ఫెయిల్యూర్, కిడ్నీ ఫెయిల్యూర్, మైక్రో వాస్కూలర్ డిసీజ్, ఫెరిఫెరీ ఆర్టరీ డిసీజ్, పర్మనెంట్ లాస్ ఆఫ్ విజన్, సెక్యువల్ డిస్ ఫంక‌్షన్,
త్వరగా కనిపెడితే..
నిపుణులు చెబుతున్న దాని ప్రకారం.. అమెరికాలోని ప్రతి ముగ్గురిలో ఒకరు, దాదాపు 100 మిలియన్లకు పైగా అడల్ట్స్ ఈ హై బ్లడ్ ప్రజెర్‌తో బాధపడతున్నట్లు గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. వీరిలో సగం మంది మాత్రమే ముందుగా దానిని గుర్తించి, అదుపులో ఉంచుకుంటున్నారు. వైద్యులు చెబుతున్న దాని ప్రకారం 30ఏళ్లు లేదా 40 ఏళ్ల మధ్య ఉన్న వారు ఎక్కువగా దీని బారిన పడుతున్నారు. ఇది ప్రధానంగా అనారోగ్యకరమైన జీవన శైలి, శారీరక శ్రమ లేకపోవడం, అనారోగ్యకరమైన ఆహార అలవాట్ల కారణంగానే వస్తుందని చెబుతున్నారు.
ఎలా తగ్గించుకోవాలి..
- బ్రిటీష్ హెల్త్ ఫౌండేషన్ ప్రకారం పలు కారణాలు హైపర్ టెన్షన్‌ని ప్రభావితం చేస్తాయి. వాటిల్లో ప్రధానమైనవి లైఫ్ స్టైల్‌తో ముడిపడి ఉన్నవే. అందులో మధుమేహం కూడా ఒకటి. అలాగే శారీరక శ్రమ లేకపోవడం, స్మోకింగ్, అధిక మద్యపానం, ఇంతకుముందు కుటుంబంలో ఎవరికైనా బీపీ ఉండటం వంటివి కారణాలు కావొచ్చు. దీనిని వీలైనంత త్వరగా గుర్తించి, చికిత్స పొందడం అవసరం.
- రోజూ ఓ మాదిరి వ్యాయామం, తక్కువ సోడియంతో కూడిన ఆహారం తీసుకోవడం, మానసిక ఒత్తిళ్లను తగ్గించుకోవడం, నిద్రను క్రమపరచుకోవడం, కెఫిన్‌ను తగ్గించుకోవడం, ధూమపానం, మద్యపానాన్ని మానేయడం, సమతుల్య ఆహారం తీసుకోవడం, రెగ్యూలర్‌గా బీపీని పరీక్షించడం ద్వారా హై బీపీని అదుపులో ఉంచుకోవచ్చు.
(నోట్: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏవైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)
మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..