AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Children Health: పిల్లలకు వ్యాయామం చేయిస్తే మెరుగైన ఫలితాలు

ఈ కాలం చిన్నారులకు స్కూలు, ట్యూషన్లు, హోంవర్కులు, ఫోన్లలో గెమ్స్ ఆడడం, వీడియోలు చూడటం వీటికే సరిపోతుంది. దీంతో చాలామంది పిల్లలకు అసలు శారీరక శ్రమ అనేది ఉండటం లేదు. ఆటలాడాలనే ఆసక్తి లేకపోవండంతో వారిలో ఫిట్‌నెస్ తగ్గుతోంది.

Aravind B
|

Updated on: Jul 21, 2023 | 1:43 PM

Share
ఈ కాలం చిన్నారులకు స్కూలు, ట్యూషన్లు, హోంవర్కులు, ఫోన్లలో గెమ్స్ ఆడడం, వీడియోలు చూడటం వీటికే సరిపోతుంది. దీంతో చాలామంది పిల్లలకు అసలు శారీరక శ్రమ అనేది ఉండటం లేదు. ఆటలాడాలనే ఆసక్తి లేకపోవండంతో వారిలో ఫిట్‌నెస్ తగ్గుతోంది.

ఈ కాలం చిన్నారులకు స్కూలు, ట్యూషన్లు, హోంవర్కులు, ఫోన్లలో గెమ్స్ ఆడడం, వీడియోలు చూడటం వీటికే సరిపోతుంది. దీంతో చాలామంది పిల్లలకు అసలు శారీరక శ్రమ అనేది ఉండటం లేదు. ఆటలాడాలనే ఆసక్తి లేకపోవండంతో వారిలో ఫిట్‌నెస్ తగ్గుతోంది.

1 / 5
అంతేకాదు ఒకేచోట గంటల సేపు కూర్చోవడం వల్ల వాళ్ల కండరాలకు కదలికలు అనేవి ఉండవు. దీంతో జీవక్రియలన్ని మందకొడిగా మారుతున్న పరిస్థితులు నెలకొన్నాయి. ఇలాంటి సమస్యలు పరిష్కరించాలంటే చిన్నారులు సైతం తప్పనిసరిగా వ్యాయమం చేయాలని నిపుణులు సూచిస్తున్నారు.

2 / 5
పెద్దవారికి శారీరక వ్యాయమం చేయడం ఎంత ముఖ్యమో.. పిల్లలకు సైతం అంతే ముఖ్యం. పిల్లలు కూడా వ్యాయామం చేస్తే ఎల్లప్పుడు వారు చురుగ్గా ఉంటారు. ఏకాగ్రత, జ్ఞాపకశక్తి కూడా మెరుగుపడతాయి. జీర్ణాశయ పనితీరు సవ్యంగా జరుగుతుంది. అలాగే పిల్లలు మైదానం, పార్కుల్లో అవుట్‌గేర్ గేమ్స్ ఆడేందుకు వారిని ప్రోత్సహించాలి. వీలైతే తల్లిదండ్రులు కూడా మైదానంలోకి వెళ్లాలి.

3 / 5
తల్లిదండ్రులతో కసరత్తులు చేసేందుకు పిల్లలు ముందుకొస్తారు. చెమట పట్టేలా ఆడినప్పుడే శరీరంలో వ్యర్థాలు బయటకు వెళ్లిపోతాయి. దీనివల్ల అవయవాల పనితీరు మెరుగ్గా ఉంటుంది. ఉదయం నిద్రలేచాక చిన్న చిన్న వ్యాయామాలు పిల్లలతో చేయించాలి. దీనివల్ల వారి అవయవాలకు బాగా రక్తప్రసరణ జరుగుతుంది. అలాగే కండరాలు, ఎముకలు బలపడి వయసుకు తగ్గ ఎదుగుదల కనిపిస్తుంది.

4 / 5
అలాగే పిల్లలకు చిన్నప్పటి నుంచే ధ్యానం, యోగా చేయడం వంటివి కూడా నేరించాలి. ఇలా చేయిస్తే వారిని మానసికంగా బలంగా మారుస్తుంది. అంతేకాదు వారిలో ఆత్మవిశ్వాసాన్ని కూడా పెంపొదిస్తుంది. ఆందోళన, ఒత్తిడి వంటి వాటికి దూరంగా ఉంచుతుంది.

5 / 5