- Telugu News Photo Gallery Cinema photos Sara Ali Khan undertakes Amarnath Yatra in Jammu and Kashmir Photos Goes Viral
Sara Ali Khan: ‘జై భోళేనాథ్’.. అమర్‌నాథ్ యాత్రలో సారా అలీఖాన్.. భక్తి పారవశ్యంలో మునిగి తేలుతూ..
తాజాగా ఎంతో విశిష్ఠత కలిగిన అమరనాథ్ యాత్రలో పాల్గొంది సారా. కశ్మీర్‌లోని మంచు గుహలో బాబా బర్ఫానీని దర్శించుకుంది. అనంతరం తన ఆధ్యాత్మిక యాత్రకు సంబంధించిన ఫొటోలు, వీడియోలను సోషల్ మీడియలో షేర్ చేసింది.
Updated on: Jul 21, 2023 | 1:44 PM

సినిమాల నుంచి ఏ కాస్త విరామం దొరికినా ఆధ్యాత్మిక యాత్రలకు బయలుదేరుతుంది బాలీవుడ్ బ్యూటీ సారా అలీఖాన్. కేదార్‌నాథ్ సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమైన ఈ అందాల తార ఇప్పటికే పలు ఆధ్యాత్మిక ప్రదేశాలను సందర్శించింది.

తాజాగా ఎంతో విశిష్ఠత కలిగిన అమరనాథ్ యాత్రలో పాల్గొంది సారా. కశ్మీర్‌లోని మంచు గుహలో బాబా బర్ఫానీని దర్శించుకుంది. అనంతరం తన ఆధ్యాత్మిక యాత్రకు సంబంధించిన ఫొటోలు, వీడియోలను సోషల్ మీడియలో షేర్ చేసింది.

అమర్‌నాథ్ యాత్రతో పాటు కశ్మీర్‌లో పురాతన సరస్వతి ఆలయాన్ని దర్శించుకుంది సారా. తన ఫ్రెండ్స్‌తో కలిసి ఈ డివోషనల్ టూర్‌కు వెళ్లిన ఆమె అక్కడ గుడారాల్లో ఏర్పాటు చేసే ఛాయ్, టిఫిన్‌లను తింటూ కనిపించింది.

అంతకుముందు మధ్యప్రదేశ్ ఇండోర్‌లోని ఖజ్రానా గణేశ్ టెంపుల్‌లో వినాయకుడికి పూజలు చేసింది సారా. తన లేటెస్ట్ సినిమా జరా హట్కే జరా బచ్చే మూవీ సూపర్‌హిట్ అయిన సందర్భంగా ప్రత్యేక పూజలు చేసింది.

సారా అమర్నాథ్ యాత్రకు సంబంధించిన ఫొటోస్, వీడియోలు ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారాయి. ఇటీవల సాయి పల్లవి, సైనా నెహ్వాల్ వంటి సెలబ్రిటీలు కూడా అమర్నాథ్ యాత్రలో పాల్గొన్న సంగతి తెలిసిందే.





























