Jasmine Benefits: మల్లెపువ్వు ఆధారిత పదార్థాల ప్రయోజనాలు తెలిస్తే.. మీరిక వదిలిపెట్టరేమో..

మల్లెపువ్వుల వాసనను అందరూ ఆస్వాదిస్తారు. అసలు మల్లెపువ్వుల గురించి చెప్తే చాలు ఉన్నట్లుండి కొంతమంది మూడ్ కూడా ఒక్కసారిగా మారిపోతుంది. మల్లెపువ్వులనగానే ఓ రకమైన ఆలోచన మదిలో మెదులుతుంది. ఇంకా చెప్పాలంటే..

Jasmine Benefits: మల్లెపువ్వు ఆధారిత పదార్థాల ప్రయోజనాలు తెలిస్తే.. మీరిక వదిలిపెట్టరేమో..
Jasmine Benfits
Follow us
Amarnadh Daneti

|

Updated on: Oct 01, 2022 | 10:06 PM

మల్లెపువ్వుల వాసనను అందరూ ఆస్వాదిస్తారు. అసలు మల్లెపువ్వుల గురించి చెప్తే చాలు ఉన్నట్లుండి కొంతమంది మూడ్ కూడా ఒక్కసారిగా మారిపోతుంది. మల్లెపువ్వులనగానే ఓ రకమైన ఆలోచన మదిలో మెదులుతుంది. ఇంకా చెప్పాలంటే మల్లెపువ్వులను ఇష్టపడని మహిళలు అసలుండరంటే అతిశయోక్తి కాదు. సాధారణంగా మల్లెపువ్వులు అంటే మహిళలు తలలో పెట్టుకోవడానికి తప్ప ఇంకెందుకు ఉపయోగపడవనే ఆలోచనలో చాలా మంది ఉంటారు. కాని మల్లేవువ్వుల్లో ఎన్నో ఔషద గుణాలు ఉన్నాయంటున్నారు. మల్లెపువ్వులతో కలిగే ప్రయోజనాలు తెలిస్తే మతిపోవల్సిందేనంట. మల్లెపువ్వులను టీలు, జ్యూస్లు, క్యాండీలు, రకరకాల ఫుడ్స్ తో తీసుకోవడం వల్ల పలు ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చు అంటున్నారు. మల్లెపువ్వులతో జీర్ణశక్తి పెంపొందడంతో పాటు గుండె ఆరోగ్యానికి మంచిదని సూచిస్తున్నారు. బరువు తగ్గడంలో కూడా మల్లెపువ్వులు సహకరిస్తాయంట. నిజంగా మల్లెపువ్వులో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా అనే ఆశ్చర్యం కలగక మానదు. ఎందుకంటే సాధారణంగా మల్లెపువ్వుల వాసనను ఆస్వాదించడంతో పాటు.. మహిళలు తమ తలలో పెట్టుకోవడానికే ఈపూలను ఉపయోగిస్తారు. ఇంకా చెప్పాలంటే మల్లిపువ్వుల ఫ్లేవర్ కోసం అగరబత్తి వంటి వాటి తయారీలో వాడతారు. కాని మల్లెపువ్వులతో కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటో తెలుసుకుందాం.

జీర్ణశక్తిని పెంపొందిస్తుంది: మల్లెపువ్వుల్లో శరీరంలోని గ్యాస్ట్రిక్ ఎంజైమ్‌లతో పరస్పర చర్యను సులభతరం చేసే యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. ఇది గ్యాస్, పొత్తికడుపు నొప్పి, అతిసారం, మలబద్ధకం వంటి వాటి నుంచి ఉపశమనం అందించడంలో సహాయపడుతుంది. జీర్ణాశయంలోని మంచి బ్యాక్టీరియా వృద్ధిని ప్రోత్సహిస్తుందంట. శరీరం నుంచి టాక్సిన్లను తొలగిస్తుంది. అందుకే భోజనం తర్వాత జాస్మిన్ టీ తాగండం వల్ల ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయంటున్నారు.

గుండె ఆరోగ్యానికి మంచిది: జాస్మిన్ ఆధారిత ఫుడ్, పానీయాలను తీసుకోవడం వల్ల గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఇది గుండె సంబంధిత వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. ఈ సుగంధ పువ్వులో యాంటీ కోగ్యులెంట్, యాంటీ ఫైబ్రినోలైటిక్ లక్షణాలు ఉండటం వల్ల “చెడు” కొలెస్ట్రాల్ తగ్గుతుంది. రక్తం గడ్డకట్టడాన్ని నివారించడంలో కూడా ఇది సహాయపడుతుంది. గుండె సంబంధిత సమస్యలు ఉన్నవారు తమ రోజువారీ ఆహారంలో మల్లెపువ్వుల ఆధారిత పదార్థాలను చేర్చుకోవడం మంచిది.

ఇవి కూడా చదవండి

వెయిట్ లాస్: బరువు తగ్గాలనుకునే వారికి మల్లె ఆధారిత ఆహార పదార్థాలు ఎంతో లబ్ధి చేకూరుస్తాయి. మల్లెలతో సహజమైన మార్గంలో అదనపు కిలోల బరువును సులభంగా తగ్గించుకోవచ్చంటున్నారు. ఎపిగాల్లోకాటెచిన్ గాలెట్, గల్లిక్ యాసిడ్ ఉనికి జీవక్రియను వేగవంతం చేసి.. బరువు పెరగడాన్ని నిరోధిస్తాయి. అందుకే మల్లెలతో కలిపిన ఫుడ్ తినేటప్పుడు అది శరీరంలో అదనపు కొవ్వును కరిగిస్తుంది.

నిద్రలేమికి చికిత్స: జాస్మిన్ ఎసెన్షియల్ ఆయిల్స్ నిద్రలేమి, ఆందోళన, ఒత్తిడి, నిరాశ వంటి సందర్భాల్లో మనస్సుకి ప్రశాంతత, ఓదార్పును అందిస్తాయి. ఒక అధ్యయనం ప్రకారం జాస్మిన్ ఆయిల్ మానసిక స్థితి, మెదడు కార్యకలాపాలను మెరుగుపరుస్తుంది. తద్వారా ఆందోళన లక్షణాలను తగ్గిస్తుంది. అదనంగా ఇది మెదడుపై ఉపశమన ప్రభావాలను కలిగిస్తుంది. వేగంగా నిద్రపోవడానికి సహాయపడుతుంది.

మరిన్ని హెల్త్ వార్తల కోసం చూడండి..