Post COVID Problems: కరోనా తరువాత చర్మవ్యాధులు వస్తాయా? నిపుణులు ఏమంటున్నారంటే..

ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఫిబ్రవరి 6న దేశవ్యాప్తంగా చాలా రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో కరోనా (COVID-19) సంఖ్య తగ్గుదలని కనిపిస్తోందని చెప్పింది. అయితే, మరోవైపు మనం ఇంకా ముప్పు నుంచి బయటపడలేదని వైరాలజిస్టులు చెబుతున్నారు.

Post COVID Problems: కరోనా తరువాత చర్మవ్యాధులు వస్తాయా? నిపుణులు ఏమంటున్నారంటే..
Post Covid Problems
Follow us
KVD Varma

|

Updated on: Feb 18, 2022 | 9:07 PM

Post COVID Problems: ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఫిబ్రవరి 6న దేశవ్యాప్తంగా చాలా రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో కరోనా (COVID-19) సంఖ్య తగ్గుదలని కనిపిస్తోందని చెప్పింది. అయితే, మరోవైపు మనం ఇంకా ముప్పు నుంచి బయటపడలేదని వైరాలజిస్టులు చెబుతున్నారు. భారత్ లో ప్రజలకు కోవిడ్ కారణంగా తలెత్తిన ఆరోగ్య ఇబ్బందులు.. వైరస్ తరువాత ప్రభావాల గురించి తెలుసుకుందాం. కరోనా రెండవ వేవ్ సమయంలో, భారతదేశంలో రోజువారీ ప్రాతిపదికన 4 లక్షలకు పైగా కరోనా కేసులు నమోదయ్యాయి. ఒమిక్రాన్ (Omicron) వేరియంట్ కారణంగా దేశవ్యాప్తంగా అనేక ఆసుపత్రిలో చేరనప్పటికీ, సానుకూలత రేటు ఊహించిన విధంగా ఎక్కువగా ఉంది. ప్రస్తుతం కేసులు క్రమంగా తగ్గుతుండగా, వైరస్ పరిణామాలు చాలా కాలం పాటు ఉంటాయని వైద్యులు కనుగొన్నారు. ఇది సహజంగా జరిగేదే. వైరస్ శరీరాన్ని అనేక విధాలుగా దెబ్బ తీసింది. అప్పుడు మేము గుర్తించ లేకపోయాము అని న్యూ ఢిల్లీలోని ఎల్‌ఎన్‌జెపి ఆసుపత్రిలో ఇన్ఫెక్షియస్ డిసీజ్ స్పెషలిస్ట్ డాక్టర్ అతుల్ బమ్సయ్య న్యూస్ 9 కి తెలిపారు. అప్పట్లో కరోనా వేవ్ ఎదుర్కోవడంపైనే మా దృష్టి ఉంది. ఇప్పడు మనకు కాస్త ఇతర విషయాల గురించి పరిశీలించే అవకాశం దొరికింది. అందువల్ల దీర్ఘ కాలపు కరోనా.. కరోనా తరువాత ఇబ్బందుల ప్రభావాన్ని బాగా అధ్యయనం చేసే వీలు చెక్కింది అని ఆయన వివరించారు.

చాలా మంది రోగులు ఇంకా మిగిలిపోయిన కరోనా లక్షణాలను కొద్దిగా చూపిస్తారని, అయితే దీని గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆయన అన్నారు. “SARS CoV-2తో జీవించడం అంటే శరీరంలో ఇంకా కొంత ఇన్ఫెక్షన్‌తో జీవించడం, వైరస్ తరువాతి దశలోఇది అనేక సమస్యలను ప్రేరేపిస్తుందని డాక్టర్ అతుల్ బమ్సయ్య చెబుతున్నారు.

చర్మంపై ప్రభావం..

గురుగ్రామ్‌లోని ఫోర్టిస్ మెమోరియల్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్‌లో డెర్మటాలజీ కన్సల్టెంట్ డాక్టర్ సోనాల్ బన్సాల్ మాట్లాడుతూ, కరోనా సంక్రమణ ప్రారంభమై రెండేళ్ళు అయింది. ఇప్పుడు దీనివలన అనేక చర్మ సంబంధ ఇబ్బందులు ఉన్నాయని మాకు తెలిసింది అని చెప్పారు. అయితే, ఈ చర్మ సమస్యలు మనకు సవాలుగా మారనున్నాయా? అనే ప్రశ్న తలెత్తుతోంది. ఈ విషయంపై ఫోర్టిస్ హాస్పిటల్‌కు చెందిన కన్సల్టెంట్ డెర్మటాలజిస్ట్ డాక్టర్ సుధీంద్ర జి ఉద్బాల్కర్ మాట్లాడుతూ, చర్మంపై కోవిడ్ దీర్ఘకాలిక ప్రభావం లేదా చర్మంపై దీర్ఘకాలిక ఇన్ఫెక్షన్ ఉండదు. కానీ చాలా మంది రోగులు అనారోగ్యం తర్వాత కొన్ని చర్మ వ్యాధులను నివేదించారు,దాదాపు రెండు వారాల తర్వాత అంటూ వివరించారు. మానవ శరీరంలో కనిపించే ఓమిక్రాన్ వేరియంట్ ఇన్ఫెక్షన్ అనేక లక్షణాలలో, చర్మంపై కనిపించేవి చాలా తక్కువ అని పరిశోధకులు కనుగొన్నారు.

కోవిడ్ టోస్ (COVID toes) వైరస్ కారణంగా ఏర్పడే మొదటి చర్మ ఇబ్బందుల్లో ఒకటి అని నిపుణులు చెబుతున్నారు. ఒక వ్యక్తి వైరస్ బారిన పడినట్లయితే, ఈ బాధను అనుభవించే అవకాశాలున్నాయి. నిపుణుల అభిప్రాయం ప్రకారం, కోవిడ్ ఇన్‌ఫెక్షన్ తర్వాత కాలి వేళ్లు ఎర్రగా, వాపుగా .. నొప్పిగా ఉంటే, ఆ పరిస్థితిని కోవిడ్ టోస్ అంటారు. కోవిడ్ టోస్ అనేది వ్యాధి సోకిన వ్యక్తులలో కాలి వేళ్లపై కనిపించే చిల్‌బ్లెయిన్‌లు. కరోనా బారిన పడిన వ్యక్తులలో చర్మవ్యాధి నిపుణులు గుర్తించిన మొదటి చర్మ ఇబ్బందుల్లో ఇది ఒకటి అని డాక్టర్ బన్సాల్ వివరించారు.

ఈ వ్యాధి సోకినపుడు.. కాలి ఎరుపు లేదా ఊదా రంగులో కనిపించవచ్చు. ఇది అలెర్జీ మంటను పోలి ఉంటుంది. కాలి దురద కూడా ఉంటుంది. మొదటి వేరియంట్ ఆల్ఫా వేరియంట్ వల్ల వచ్చిన కరోనావైరస్ ఇన్‌ఫెక్షన్ సమయంలో దీని సంభవం ప్రధానంగా ఉంది. పూణేలోని మణిపాల్ హాస్పిటల్స్‌లో డెర్మటాలజీ కన్సల్టెంట్ డాక్టర్ శ్వేతా శర్మ చెబుతున్న దాని ప్రకారం ‘కోవిడ్ టోస్’ సాధారణంగా కోవిడ్ సోకిన రోగులలో కనిపిస్తుంది .. ఇది స్వల్ప వ్యాధికి సంకేతం. ఇది ఏ మచ్చ లేదా గుర్తును వదలకుండా సగటున రెండు వారాల తర్వాత అదృశ్యమవుతుంది.

కానీ చికిత్స చేయకుండా వదిలేస్తే, కోవిడ్ టోస్ మరింత తీవ్రమైన పరిస్థితిగా అభివృద్ధి చెందుతుంది. “వైరల్ ఇన్ఫెక్షన్ తర్వాత ఈ చర్మ సమస్య కనిపించడం ఇదే మొదటిసారి. నా రోగులలో కోవిడ్ టోస్ ఇప్పటికీ అలాగే ఉండిపోయింది. వారు అప్పుడప్పుడు దురదతో బాధపడుతుంటారు” అని డాక్టర్ బమ్సయ్య చెప్పారు.

చర్మంపై దద్దుర్లు..

శరీరం దాని అలెర్జీ కారకాలకు గురైనప్పుడు దద్దుర్లు రావడం సాధారణంగా జరుగుతుంది. కరోనా రోగుల్లో దద్దుర్లు వంటి చర్మ సమస్యను చూస్తారని చర్మవ్యాధి నిపుణులు చెప్పారు. కోవిడ్ ఇన్‌ఫెక్షన్‌లు ఉన్న వ్యక్తులు కూడా చాలా దద్దుర్లు కలిగి ఉంటారని,అయితే అవి తక్కువగా స్పందించడం లేదా సాధారణ చికిత్సకు నిరోధకతను కలిగి ఉంటాయని డాక్టర్ బన్సాల్ చెప్పారు. డాక్టర్ ఉద్బాల్కర్ కొవిడ్ ఇన్ఫెక్షన్ తర్వాత దద్దుర్లు అందరిలో కనిపించవు. కొందరిలోనే ఇలా కనిపిస్తుంది. దీని సంభావ్యత పెద్దది కాదు, అయితే రోగులందరిలో కోవిడ్ దద్దుర్లు వచ్చే అవకాశం కూడా లేకపోలేదు అని చెప్పారు. మందులు వాడితే కొన్ని రోజుల్లో ఇబ్బందుల నుంచి వారు బయటపడతారని ఆయన అంటున్నారు.

కరోనాకి సంబంధించిన ఇతర చర్మ సమస్యలు..

డాక్టర్ బన్సాల్ ఇలా అన్నారు “సోరియాసిస్‌తో బాధపడుతున్న వ్యక్తులు కోవిడ్ ఇన్‌ఫెక్షన్ లేదా కొన్ని సమయాల్లో కోవిడ్ వ్యాక్సిన్‌లు తీసుకున్నప్పుడు సోరియాసిస్ వంటి వ్యాధులు తీవ్రతరం కావడం లేదా సోరియాసిస్ వంటి వ్యాధులను పొందడం గమనించిన సందర్భాలు ఉన్నాయి. బొల్లి, సోరియాసిస్ వంటి ఏదైనా స్వయం ప్రతిరక్షక వ్యాధి కోవిడ్ తర్వాత మరింత తీవ్రమవుతుంది. మనం పిట్రియాసిస్ రోసియా అని పిలుస్తున్న ఒక రకమైన చర్మ అలెర్జీ కూడా కోవిడ్ తర్వాత చాలా సాధారణంగా కనిపిస్తుంది. కోవిడ్ ఇన్ఫెక్షన్ ఉన్నవారిలో హెర్పెస్ జోస్టర్ చర్మానికి సంబంధించిన వైరల్ ఇన్‌ఫెక్షన్ కూడా కనిపించినట్టు తెలిసింది.” అనారోగ్యానికి గురైన రెండు నెలల తర్వాత, జుట్టు రాలడం కేసుల సంఖ్యను మనం గమనించవచ్చు. కారణం ఇంకా తెలియదు అని డాక్టర్ ఉద్బాల్కర్ చెబుతున్నారు.

కరోనా తరువాత వచ్చె చర్మ సమస్యలను గుర్చించడం ఎలా?

మీ అలెర్జీని రెండు రోజుల పాటు గమనించండి, అది OTC మందులతో తగ్గకపోతే త్వరగా మీ చర్మ వైద్యునితో అపాయింట్‌మెంట్‌ని ఫిక్స్ చేసుకోండి. మీకు కోవిడ్ వచ్చి, స్టెరాయిడ్స్ ఉపయోగించి కోలుకున్నట్లయితే, ప్రతి ఆరు నెలలకు ఒక సాధారణ నిర్ధారణ కోసం అపాయింట్‌మెంట్ తీసుకోండి. మీ చర్మ ఆరోగ్యం సరిగ్గా ఉందో లేదో చూడండి. కొన్ని దద్దుర్లు ఇప్పటికీ అలాగే ఉండవచ్చు కానీ మరింత ప్రమాదకరమైన చర్మవ్యాధులు కనిపించకముందే వాటికి చికిత్స చేయించుకోవాలని డాక్టర్ ఉద్బాల్కర్ సలహా ఇచ్చారు.

Also Read: Bappi Lahiri: బప్పి లహిరి మృతికి కారణమైన అబ్‌స్ట్రక్టివ్ స్లీప్ అప్నియా అంటే ఏంటి.? ఎలా గుర్తించాలి.? లక్షణాలు ఏంటి.?

Knowledge: సురపానంలోనూ తగ్గేదేలే! ఆ విషయాల్లో మగజాతిని ఓవర్‌టేక్‌ చేసిన మగువలు..