Energy Drinks: యాక్టివ్‌గా ఉండాలంటే ఈ ఎనర్జీ డ్రింక్స్ తాగాల్సిందే.. ఇంట్లోనే ఈజీగా తయారు చేయండిలా..
Health Tips: శక్తిని పొందడానికి, ప్రజలు మార్కెట్‌లో లభించే ప్రోటీన్ పౌడర్లను ఆశ్రయిస్తారు. అయితే మీకు కావాలంటే ఇంట్లోనే తయారుచేసే కొన్ని ప్రత్యేక పానీయాలతో కూడా మీ శక్తిని పెంచుకోవచ్చు.
Health Tips: నేటి బిజీ లైఫ్ స్టైల్(Life Style) మన జీవితాన్ని చెడుగా ప్రభావితం చేసేవి ఎన్నో ఉన్నాయి. రోజంతా ఇంట్లో, ఆఫీసులో పనిచేసి సాయంత్రం వేళల్లో అలసిపోయి బలహీనంగా ఉండడానికి ఇదే కారణంగా ఉంటుంది. ఇటువంటి పరిస్థితిలో మనకు కొంత శక్తి అవసరం. శక్తిని పొందడానికి, ప్రజలు మార్కెట్‌లో లభించే ప్రోటీన్ పౌడర్, సప్లిమెంట్లు మొదలైనవాటిని ఆశ్రయిస్తారు. అయితే మీకు కావాలంటే ఇంట్లోనే తయారుచేసే కొన్ని ప్రత్యేక పానీయాలతో కూడా మీ శక్తిని పెంచుకోవచ్చు. ఎనర్జీ డ్రింక్ మీ బలహీనత, అలసటను తొలగిస్తుంది. అదే సమయంలో, ఇది మిమ్మల్ని బలపరుస్తుంది. ఎనర్జీ డ్రింక్స్(Energy Drinks) మిమ్మల్ని ఎప్పటికప్పుడు యాక్టివ్‌గా ఉంచుతాయి. మీరు వాటిని మీ ఆహారంలో చేర్చుకోవచ్చు. మీరు ఎలాంటి ఎనర్జీ డ్రింక్స్ తీసుకోవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం.
బలహీనతను అధిగమించే ఎనర్జీ డ్రింక్స్ ఇవే..
కొబ్బరి నీరు, నిమ్మకాయ – కొబ్బరి నీరు ఉత్తమ సహజ శక్తి పానీయంగా పరిగణిస్తారు. చాలా సార్లు, శరీరంలో నీరు లేకపోవడం వల్ల, బలహీనత లేదా అలసట అనుభూతి ప్రారంభమవుతుంది. ఇటువంటి పరిస్థితిలో కొబ్బరి నీరు తాగటం ప్రయోజనకరంగా ఉంటుంది. కొబ్బరి నీరు స్వతహాగా ఎనర్జీ డ్రింక్ అయినప్పటికీ, నిమ్మకాయను కూడా జోడించవచ్చు. ఇది తక్షణ శక్తిని ఇస్తుంది.
తయారుచేసే విధానం- దీన్ని తయారు చేసేందుకు, మీరు ఒక కప్పు కొబ్బరి నీళ్లను తీసుకోవాలి. దానికి ఒక చెంచా తేనె, 5 చుక్కల నిమ్మరసం కలపండి. ఆ తర్వాత మీరు దీనికి ఉప్పు కలపాలి. మీకు అలసటగా లేదా బలహీనంగా అనిపిస్తే వెంటనే ఈ నీటిని తాగండి.
బచ్చలికూర, పైనాపిల్ ఎనర్జీ డ్రింక్- బచ్చలికూర, పైనాపిల్, యాపిల్‌తో తయారు చేసిన ఎనర్జీ డ్రింక్ శరీరానికి బలాన్ని ఇవ్వడంలో సహాయపడుతుంది. రోజంతా పని చేసి అలసిపోయినట్లు అనిపిస్తే, మీరు ఈ డ్రింక్ తాగవచ్చు.
తయారుచేసే విధానం- దీని కోసం మీరు ఒక కప్పు పాలకూర తీసుకోవాలి. చిన్న చిన్న పైనాపిల్ ముక్కలు, ఒక కప్పు యాపిల్‌ను కట్ చేసి స్మూతీని తయారు చేయండి. దీని తర్వాత ఉప్పు, నిమ్మరసం వేసి తాగాలి.
గమనిక: ఈ కథనంలో పేర్కొన్న పద్ధతులు కేవలం సూచనలుగా మాత్రమే తీసుకోండి. ఇటువంటి చికిత్స/మందు/ఆహారం అనుసరించే ముందు డాక్టర్‌ని సంప్రదించండి.
Also Read: Knowledge: సురపానంలోనూ తగ్గేదేలే! ఆ విషయాల్లో మగజాతిని ఓవర్‌టేక్ చేసిన మగువలు..