Health Tips: లేట్ నైట్‌లో ఫుడ్ తింటున్నారా.. కచ్చితంగా ఈ విషయాలు తెలుసుకోవాల్సిందే..!

Late Night Food: లేట్ నైట్ ఫుడ్ తీసుకుంటున్నారా. అయితే, కచ్చితంగా ఈ విషయాలు తెలుసుకోవాల్సిందే. లేదంటే తీవ్ర ప్రమాదాలన బారిన పడే ఛాన్స్ ఉంది.

Health Tips: లేట్ నైట్‌లో ఫుడ్ తింటున్నారా.. కచ్చితంగా ఈ విషయాలు తెలుసుకోవాల్సిందే..!
Food
Follow us
Venkata Chari

|

Updated on: Feb 19, 2022 | 8:05 AM

Health Tips: మారుతున్న కాలానుగుణంగా అన్నీ మారిపోతున్నాయి. ప్రస్తుతం లేట్ నైట్ ఫుడ్(Late Night Food) తినడం ట్రెండ్‌గా మారింది. అర్ధరాత్రి భోజనం చేసేందుకు హోటళ్ల వైపు వెళ్తున్నారు. చాలామంది నిద్ర నుంచి లేచిన వెంటనే ఇంట్లో చేసిన ఆహారాన్ని తింటుంటారు. అయితే అర్థరాత్రి తినడం వల్ల చాలా నష్టాలు ఉంటాయి. ఆరోగ్యంపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తుంది.  అవును, ఇటువంటి పరిస్థితిలో, ఆహారం తీసుకునే ముందు మీరు గుర్తుంచుకోవలసిన కొన్ని విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

ఆహారం తీసుకోవడానికి సరైన సమయం ఏది?

రాత్రి పది గంటలలోపు ఆహారం తినాలని చాలా మందికి తెలుసు. కానీ ఆయుర్వేదం ప్రకారం, రాత్రి తినడానికి సరైన సమయం ఏడు గంటలు మాత్రమే. ఏడు లేదా పది గంటలకు తినకుండా 11 లేదా 12కి తినే వాళ్ల జాబితా ప్రస్తుతం పెరిగిందనే చెప్పాలి. ఇలాంటి పరిస్థితుల్లో అర్థరాత్రి ఆహారం తీసుకోవడం వల్ల ఒకటి కాదు అనేక సమస్యలు వస్తాయి. కాబట్టి రాత్రి భోజనం 8 గంటలలోపు తినడానికి ప్రయత్నించాలని నిపుణులు సూచిస్తున్నారు.

ఆహారం తీసుకునేటప్పుడు ఈ విషయాలను తప్పక గుర్తుంచుకోండి-

అతిగా తినవద్దు- రాత్రిపూట హెవీగా ఫుడ్ తీసుకునే వారు వేల సంఖ్యలో ఉన్నారు. తిన్న తర్వాత కాస్త సమయం తరువాత నిద్రపోవాలి. కానీ, రాత్రిపూట భారీగా ఆహారాన్ని తినడం వల్ల కడుపు నొప్పి విపరీతంగా వస్తుంది. గ్యాస్ సమస్యలు, నిద్రలేమి, కడుపు నొప్పి ఇందులో భాగం అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఇటువంటి పరిస్థితిలో, మీరు అర్థరాత్రి తరువాత భారీగా ఆహారాన్ని తినకుండా ఉండాలి. లేదంటే శరీరంలో భారీగా కొవ్వు చేరే అవకాశం ఉంటుంది. రాత్రి పూట శరీరం కూడా విశ్రాంతి తీసుకుంటుంది. ఈ సమయంలో జీర్ణక్రియలో కూడా పలు సమస్యలు ఏర్పడుతుంటాయి.

నమిలి తినాలి- ఎక్కువ సార్లు ఆలస్యంగా అంటే అర్థరాత్రిపూట తింటుంటారు. అలాగే చాలామంది ఐదు నిమిషాల్లో ఆహారం తినేస్తుంటారు. తిన్న వెంటనే నిద్ర పోతుంటారు. ఇటువంటి పరిస్థితిలో, మీకు కూడా వేగంగా తినే అలవాటు ఉంటే, ఈ అలవాటును తప్పుకుండా మార్చుకోవాలి.

గమనిక: ఈ కథనంలో పేర్కొన్న పద్ధతులు కేవలం సూచనలుగా మాత్రమే తీసుకోండి. ఇటువంటి చికిత్స/మందు/ఆహారం అనుసరించే ముందు డాక్టర్‌ని సంప్రదించండి.

Also Read: Bappi Lahiri: బప్పి లహిరి మృతికి కారణమైన అబ్‌స్ట్రక్టివ్ స్లీప్ అప్నియా అంటే ఏంటి.? ఎలా గుర్తించాలి.? లక్షణాలు ఏంటి.?

Bodybuilding Tips: కండలవీరుడిగా మారాలనుకుంటున్నారా..? జిమ్ చేస్తే సరిపోదు.. వీటి గురించి తెలుసుకోవాల్సిందే..