Health Tips: ఎండు అల్లం, లవంగంతో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు.. తెలుసుకుంటే అస్సలు వదిలిపెట్టరు..

ఎండు అల్లం, లవంగం ఆరోగ్యానికి చాలా ఉపయోగకరంగా పరిగణిస్తారు. ఎండు అల్లం, లవంగాలను తీసుకోవడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

Health Tips: ఎండు అల్లం, లవంగంతో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు.. తెలుసుకుంటే అస్సలు వదిలిపెట్టరు..
Dry Ginger With Clove
Follow us
Venkata Chari

|

Updated on: Feb 19, 2022 | 8:47 AM

Dry Ginger With Clove: ఎండు అల్లం, లవంగం ఆరోగ్యానికి చాలా ఉపయోగకరంగా పరిగణిస్తారు. ఆయుర్వేదంలో ఎండు అల్లంను ఔషధంగా ఉపయోగిస్తారు. ఎండు అల్లం, లవంగం కలిపి తీసుకోవడం వల్ల మీ ఆరోగ్యాని(Health Tips)కి అనేక ప్రయోజనాలు లభిస్తాయి. ప్రజలు ఎండు అల్లం మెత్తగా, అనేక సమస్యలలో ఉపయోగిస్తారు. అల్లం ఎండబెట్టి తయారు చేసిన ఎండు అల్లం(Dry Ginger) అనేక ఆరోగ్య సమస్యలలో ఉపయోగిస్తుంటారు. ఇది కాకుండా ఆహారంలో మసాలాగా కూడా ఉపయోగిస్తుంటారు. పొడి అల్లం, లవంగం(Clove) యాంటీఆక్సిడెంట్, యాంటీ ఇన్ఫ్లమేటరీ, బీటా వంటి లక్షణాలను కలిగి ఉన్నాయి. ఎండు అల్లం, లవంగాలు తీసుకోవడం వల్ల ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు చూద్దాం.

పొడి అల్లం, లవంగం యొక్క ప్రయోజనాలు-

రోగనిరోధక శక్తిని పెంచడంలో ఉపయోగపడుతుంది- శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచడానికి ఎండు అల్లం, లవంగం తీసుకోవడం మంచింది. క్యాప్లిసిన్, కర్కుమిన్ వంటి యాంటీఆక్సిడెంట్ మూలకాలు పొడి అల్లం, లవంగాలలో కనిపిస్తాయి. ఈ రెండింటినీ కలిపి తీసుకోవడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది.

పంటి నొప్పి సమస్యలో ప్రయోజనకరమైనది – లవంగం, పొడి అల్లంలో ఉండే లక్షణాలు నొప్పిని తొలగించడంలో చాలా ఉపయోగకరంగా పరిగణిస్తారు. లవంగం నొప్పి నివారిణిగా కూడా ఉపయోగపడుతుంది. లవంగాలలో ఉండే యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు పంటి నొప్పికి చాలా మేలు చేస్తాయి. లవంగం, ఎండు అల్లం తీసుకోవడం వల్ల పంటి నొప్పి నుంచి ఉపశమనం లభిస్తుంది.

శ్వాసకోశ సమస్యలలో ఉపశమనం- లవంగాలు, ఎండు అల్లం డికాషన్ తాగడం శ్వాసకోశ సమస్యలలో చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఎండు అల్లం, లవంగం, తేనె కలిపి తినడం వల్ల శ్వాసకోశ సమస్యల నుంచి ఉపశమనం పొందుతారు.

గమనిక: ఈ కథనంలో పేర్కొన్న పద్ధతులు కేవలం సూచనలుగా మాత్రమే తీసుకోండి. ఇటువంటి చికిత్స/మందు/ఆహారం అనుసరించే ముందు డాక్టర్‌ని సంప్రదించండి.

Also Read: Post COVID Problems: కరోనా తరువాత చర్మవ్యాధులు వస్తాయా? నిపుణులు ఏమంటున్నారంటే..

Foods Never Expire: ఈ ఫుడ్స్ ఎప్పటికీ ఎక్స్‏పైర్ అవ్వవు.. ఎన్నాళ్లనై తినొచ్చంట.!