ఉప్పల్ పరిధిలోని పలు బస్తీలకు చెందిన శాంతి, సురేశ్ దంపతులు అధిక వడ్డీ ఆశ చూపి రూ.1.8 కోట్లు మోసగించారు. ఆన్లైన్ బెట్టింగ్లు, స్టాక్ మార్కెట్లో డబ్బు పోగొట్టుకున్నారని అనుమానం. బాధితులు డబ్బు అడగగా శాంతి ఆత్మహత్యాయత్నం నటించింది. చివరకు డబ్బులు తిరిగి ఇవ్వకుండా మోసం చేయడంతో బాధితులు ఉప్పల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.