AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Heart Attack Symptoms : ఈ హెచ్చరికలను విస్మరించారో? ఇక అంతే.. గుండెపోటు వస్తుందని తెలిపే సంకేతాలు ఇవే

గత కొన్ని నెలలుగా వయస్సుతో సంబంధం లేకుండా అందరికీ గుండె పోటు వస్తుంది. అయితే సరైన సమయంలో వైద్య సాయం అందితే బతుకుతున్నారు తప్ప వైద్య సాయం పొందలేకపోతే చనిపోతున్నారు

Heart Attack Symptoms : ఈ హెచ్చరికలను విస్మరించారో? ఇక అంతే.. గుండెపోటు వస్తుందని తెలిపే సంకేతాలు ఇవే
Heart Attack
Nikhil
|

Updated on: Mar 23, 2023 | 5:00 PM

Share

మారుతున్న ఆహార అలవాట్లు, జీవనశైలి కారణంగా ప్రస్తుత కాలంలో వయస్సుతో సంబంధం లేకుండా అనారోగ్య సమస్యలు అందరినీ వేధిస్తున్నాయి. కరోనా మహమ్మారి తర్వాత ఈ పరిస్థితి మరింత తీవ్రమైంది. గత కొన్ని నెలలుగా వయస్సుతో సంబంధం లేకుండా అందరికీ గుండె పోటు వస్తుంది. అయితే సరైన సమయంలో వైద్య సాయం అందితే బతుకుతున్నారు తప్ప వైద్య సాయం పొందలేకపోతే చనిపోతున్నారు కూడా. ప్రపంచవ్యాప్తంగా, గుండె జబ్బులు పురుషులు, మహిళలు ఇద్దరికీ మరణానికి ప్రధాన కారణంగా ఉంటున్నాయి. గుండెపోటు లక్షణాలు ఛాతీ బిగుతు, శరీర పైభాగంలో నొప్పిని కలిగి ఉంటాయి. అయితే అవి వివిధ రకాల ఇతర రుగ్మతలకు (వికారం, గుండెల్లో మంట, అలసట వంటివి) తప్పుగా నిర్ధారణ చేస్తారు. గుండెపోటు సంకేతాలను ముందుగానే గుర్తిస్తే దాని బారి నుంచి బయటపడవచ్చు. 

ఛాతి నొప్పి

తీవ్రమైన ఛాతీ నొప్పి లేదా భారంగా ఉండటం లేదా దవడలు/ఎడమ చేతికి మంటలు ప్రసరించడం వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్య సాయం పొందడానికి ప్రయత్నించాలి. సమయం గడిచే కొద్దీ మరింత అసౌకర్యంగా మారడం వంటివి గుండెపోటును సూచిస్తాయి.

కాలులో వాపు

మీరు నడుస్తున్నప్పుడు లేదా మెట్లు ఎక్కేటప్పుడు శ్వాస తీసుకోవడంలో ఇబ్బందిని అనుభవిస్తే లేదా మీ కాలు వాపును గమనిస్తే వెంటనే అలర్ట్ అవ్వాలి.వాల్యులర్ గుండె జబ్బులు లేదా బలహీనమైన గుండె కండరాలతో బాధపడుతున్న వారిలో ఇలాంటి సంకేతాలు కనిపిస్తాయి.

ఇవి కూడా చదవండి

శరీరంలోని ఇతర ప్రాంతాలలో అసౌకర్యం

మీ గుండెను ప్రభావితం చేయడంతో పాటు, గుండెపోటు మీ శరీరం అంతటా లక్షణాలను కూడా కలిగిస్తుంది. ఇది గుర్తించడం కష్టతరం చేస్తుంది. మీ చేయి, వీపు, మెడ మరియు దవడలో నొప్పి, అసౌకర్యాన్ని అనుభవించవచ్చు. గుండెపోటు లక్షణాలు వ్యక్తికి వ్యక్తికి మారుతూ ఉంటాయి. 

తలతిరగడం

మీరు తగినంత నీరు తాగకపోతే, మధ్యాహ్న భోజనం మానేసినప్పుడు లేదా చాలా త్వరగా లేచి నిలబడితే మీకు తల తిరగినట్లు అనిపించవచ్చు. మీరు ఛాతీ నొప్పి, శ్వాస ఆడకపోవటంతో పాటుగా తల తిరగడంవంటివి అనుభవించివచ్చు. మీ శరీరంలో రక్త పరిమాణం తగ్గినందున, మీ రక్తపోటు పడిపోతుంది. దీంతో మీరు గుండెపోటుకు గురయ్యే ప్రమాదం ఉంది.

అలసట

మీరు సులభంగా అలసిపోయినట్లు అనిపించినప్పుడు, తక్కువ శ్రమతో శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉన్నప్పుడు గుండె జబ్బులు వచ్చే అవకాశం కూడా ఉందని గుర్తుంచుకోవాలి. ఇలాంటి సమయంలో వీలైనంత త్వరగా వైద్యులను సంప్రదించాలి.

(ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణుల సలహాలు, సూచనల మేరకు అందించడం జరుగుతుంది. ఏవైనా సందేహాలు ఉంటే నిపుణులను సంప్రదించండి.)

మరిన్ని ఆరోగ్య వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..