AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Heart Attack Symptoms: ఆ సమయమే ప్రాణాలు నిలుపుతుంది.. గుండెపోటు వచ్చిన వారిని కాపాడండిలా..!

ప్రస్తుత కాలంలో గుండెపోటు ప్రారంభ సంకేతాలు, లక్షణాలను తెలుసుకోవాలి. రక్త ప్రవాహాన్ని పునరుద్ధరించలేకపోవడం వల్ల గుండె నొప్పి వస్తుంది. ముఖ్యంగా గుండె కండరాల నష్టం కాలక్రమేణా పెరుగే కొద్దీ  గుండె పోటు ప్రమాదం పెరుగుతుంది.

Heart Attack Symptoms: ఆ సమయమే ప్రాణాలు నిలుపుతుంది.. గుండెపోటు వచ్చిన వారిని కాపాడండిలా..!
Heart Attack
Nikhil
| Edited By: Anil kumar poka|

Updated on: Mar 02, 2023 | 5:00 PM

Share

భారతదేశంలో ఇటీవల కాలంలో గుండెపోటు కారణంగా మరణాల సంఖ్య వేగంగా పెరుగుతోంది. ప్రజలు తమ జీవనశైలి, అనారోగ్యకరమైన ఆహార అలవాట్ల కారణంగా గుండె జబ్బులు రావడం సర్వ సాధారణమైపోయింది. అందువల్ల ప్రస్తుత కాలంలో గుండెపోటు ప్రారంభ సంకేతాలు, లక్షణాలను తెలుసుకోవాలి. రక్త ప్రవాహాన్ని పునరుద్ధరించలేకపోవడం వల్ల గుండె నొప్పి వస్తుంది. ముఖ్యంగా గుండె కండరాల నష్టం కాలక్రమేణా పెరుగే కొద్దీ  గుండె పోటు ప్రమాదం పెరుగుతుంది. ముఖ్యంగా గుండె పోటు వచ్చిన సమయంలో తీసుకున్న జాగ్రత్తలే రోగి ప్రాణాలను కాపాడడంతో కీలక పాత్ర పోషిస్తాయి. గుండె పోటు వచ్చే ముందు సంకేతాలు ఏ విధంగా ఉంటాయి? ఒక వ్యక్తి జీవితాన్ని కాపాడటానికి ఎలాంటి చర్యలు తీసుకోవాలి? అనే వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.

గుండె పోటు సంకేతాలు

ఛాతీ నొప్పి

గుండెపోటుకు ముఖ్యమైన సంకేతాలలో ఛాతీ నొప్పి ఒకటి. ఒక వ్యక్తి ఛాతీ మధ్యలో లేదా ఎడమ వైపున నొప్పి లేదా అసౌకర్యం, పిండడం వంటివి అనుభూతి చెందితే కచ్చితంగా గుండె పోటు అని అనుమానించాలి. ఇది కొద్దిసేపు మాత్రమే ఉంటుంది. అయితే ఈ నొప్పి మళ్లీ మళ్లీ వచ్చే అవకాశాలు ఉన్నాయి. గుండె కండరాలకు రక్తం చేరకుండా అడ్డుకోవడం ఈ నొప్పికి కారణంగా ఉంటుంది. విశ్రాంతి తీసుకోవడం వల్ల నొప్పి తగ్గదు. కాబట్టి వెంటనే వైద్య సాయం పొందాలి.

శరీరంలో నొప్పి, శ్వాస ఆడకపోవడం

ముఖ్యంగా ఎగువ శరీరంలో నొప్పితో పాటు రెండు చేతులలో లాగినట్లు అనిపించినా అనుమానించాలి. ఈ నొప్పి భుజాల వరకు ప్రసరిస్తుంది. మెడ, వెన్ను, దంతాలు లేదా దవడ నొప్పి కూడా వచ్చే అవకాశం ఉంది. ఈ నొప్పితో పాటు వ్యక్తికి శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉంటే వెంటనే వైద్యుల వద్దకు తీసుకెళ్లడం ఉత్తమం.

ఇవి కూడా చదవండి

కాంతి హీనత

వ్యక్తికి మైకము, బలహీనత, చలి చెమటలు పట్టడం లేదా మూర్ఛపోయినట్లు అనిపించినా గుండె నొప్పి కింద అనుమానించాలి. ఆయా లక్షణాలు కూడా వ్యాధి తీవ్రతను బట్టి వ్యక్తి ఆరోగ్యాన్ని బట్టి మారుతాయి. వికారం, వాంతులు, అసాధారణ అలసట, నిద్ర భంగం, ప్రేగుల్లో అసౌకర్యం వంటి అసాధారణ లక్షణాలున్నా అనుమానించాలి. ఎందుకంటే గుండెపోటు లక్షణాలు, గ్యాస్ట్రిక్ లక్షణాలను ఒకేలా ఉంటాయని గుర్తుంచుకోవాలి.

గుండె పోటుకు వచ్చినప్పుడు తీసుకోవాల్సిన రక్షణ చర్యలివే..

  • ఎవరైనా గుండె పోటుకు గురైతే మీరు వెంటనే అంబులెన్స్‌కు కాల్ చేసి, రోగికి వీలైనంత త్వరగా వైద్య సహాయం అందించాలి.
  • భయపడవద్దని వ్యక్తికి జాగ్రత్తలు చెప్పి వారికి విశ్రాంతినిచ్చేలా పడుకోబెట్టడం, కూర్చోబెట్టాలి. అలాగే వారి బట్టలు విప్పాలి. ముఖ్యంగా మందులు తప్పితే ఆ సమయంలో తినడానికి లేదా గడానికి ఏమీ ఇవ్వకూడదు.
  • ఎవరైనా ఎక్కువగా ఊపిరి పీల్చుకుంటున్నా, గుండెపోటు వచ్చే అవకాశం ఉందని మీరు అనుమానం వస్తే మీరు వారి పల్స్ తనిఖీ చేయాలి. వ్యక్తి ఛాతీపై మీ చెవిని ఉంచడం ద్వారా వారి హృదయ స్పందనను వినాాలి. అనుమానంగా ఉంటే వెంటనే సీపీఆర్ చేయడం ఉత్తమం.
  • రోగికి అలెర్జీ లేకుంటే మీరు ఆస్పిరిన్ లేదా జీటీఎన్ (నైట్రేట్స్-వాసోడైలేటర్) వంటి మాత్రలను ఇవ్వవచ్చు. ఆస్పిరిన్ రక్తం గడ్డకట్టడాన్ని నిరోధిస్తుంది. అలాగే ఏదైనా సంభావ్య రక్తం గడ్డకట్టే పరిమాణాన్ని తగ్గిస్తుంది.

నోట్.. ఈ కథనంలో పేర్కొ న్న విషయాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. వీటిని పాటించే ముందు నిపుణుల సలహాలు తీసుకోడం ఉత్తమం.

మరిన్ని హెల్త్ న్యూస్ కోసం