Urine: యూరిన్‌లో నురగ వస్తే దేనికి సంకేతం.. కిడ్నీలు పాడైనట్లేనా..?
హార్ట్, మెదడు, లంగ్స్, కాలేయం మొదలైన వాటి క్రమంలో మూత్రపిండాల పనితీరు అత్యంత ముఖ్యమైనది. అలాంటి కిడ్నీల పట్ల అప్రమత్తత ఎంతో అవసరం.
మనం శరీరంలో కిడ్నీలు ఎంతో ముఖ్యమైన పాత్రను పోషిస్తాయి. రక్తం నుండి మలినాలను శుభ్రపరచడం, వ్యర్థాలను మూత్రం ద్వారా విసర్జించడం కిడ్నీల టాస్క్. అయితే కిడ్నీల మీద ఒత్తిడి పెరిగిందన్న సంకేతాలు మనం తెలుసుకోవచ్చా అనే వివరాలను ప్రముఖ గ్యాస్ట్రో అండ్ బరియాట్రిక్ సర్జన్ డాక్టర్ రవికాంత్ కొంగర వెల్లడించారు. రక్తంతో క్రియాటిన్ పెరిగితే కిడ్నీలు పాడైపోయినట్లే అని.. పుణ్యకాలం ముగిసినట్లే అని డాక్టర్ తెలిపారు.
యూరిన్‌లో మైక్రోఅల్బుమిన్ ఎక్కువ ఉంటే.. కిడ్నీల మీద ఒత్తిడి పెరుగుతుందన్న సంకేతం అని వివరించారు. మైక్రోఅల్బుమిన్ యూరిన్ టెస్ట్ ద్వారా మనం దాన్ని ట్రేస్ చేయగలమన్నారు. షుగర్ కంట్రోల్‌లో లేకపోవడం, ఎక్కువ బరువు ఉండటం వంటి సమస్యలు ఉన్నవారు.. మైక్రోఅల్బుమిన్ యూరిన్ టెస్ట్… సంవత్సరం లేదా 6 నెలలకు ఒకసారి చేయించుకోవడం ఉత్తమం అని డాక్టర్ రవికాంత్ కొంగర సూచించారు. ఇక కొంతమందికి యూరిన్‌లో నురగ(ఫోమీ యూరిన్) వస్తూ ఉంటుంది. అది ఉన్నవాళ్లకి అల్బుమిన్ ఎక్కువ ఉండే అవకాశం ఉంటుందని డాక్టర్ తెలిపారు. అలాంటి వారు కూడా అల్బుమిన్ టెస్ట్ చేసుకోవడం మంచిదని డాక్టర్ సూచించారు.
మరిన్ని హెల్త్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..
(నోట్: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణుల సలహాలు, సూచనల మేరకు అందించడం జరుగుతుంది. ఏవైనా సందేహాలుంటే నిపుణులను సంప్రదించండి.)