Chronic Kidney Disease: మీకు ఈ లక్షణాలు కనిపిస్తే అనుమానించాల్సిందే.. ధీర్ఘకాలిక కిడ్నీ వ్యాధుల నుంచి రక్షణకు ఈ టిప్స్ పాటించాల్సిందే..!
ఓ వ్యక్తికి కిడ్నీ వ్యాధి ఉన్నట్లు నిర్ధారణైతే వాటి ముఖ్య పనితీరును కోల్పోతాయి. దీంతో రోజువారీ కార్యకలాపాలు నిర్వహించడం కష్టమవుతుంది. ముఖ్యంగా మూత్రపిండాల వ్యాధి తారాస్థాయికి చేరితో వారికి డయాలసిస్ చేయాల్సి వస్తుంది. సమస్య మరీ తీవ్రమైతే కిడ్నీ మార్పిడి కూడా చేయాల్సి వస్తుంది.

మానవ శరీరంలో కిడ్నీలు చాలా ముఖ్యమైనవి. ఎందుకంటే మనం తాగే నీరు, తీసుకునే ఆహారం నుంచి శుద్ధి చేసి, శరీరానికి పని చేయని వాటిని మలం లేదా మూత్రం ద్వారా బయటకు పంపేవి కిడ్నీలు మాత్రమే. రక్తం నుంచి వ్యర్థాలతో పాటు అదనపు ద్రవాలను ఫిల్టర్ చేయడంలో కిడ్నీలు కీలక పాత్ర పోషిస్తాయి. అయితే ఓ వ్యక్తికి కిడ్నీ వ్యాధి ఉన్నట్లు నిర్ధారణైతే వాటి ముఖ్య పనితీరును కోల్పోతాయి. దీంతో రోజువారీ కార్యకలాపాలు నిర్వహించడం కష్టమవుతుంది. ముఖ్యంగా మూత్రపిండాల వ్యాధి తారాస్థాయికి చేరితో వారికి డయాలసిస్ చేయాల్సి వస్తుంది. సమస్య మరీ తీవ్రమైతే కిడ్నీ మార్పిడి కూడా చేయాల్సి వస్తుంది. మధుమేహం, ఊబకాయం, ధూమపానం, వయస్సు, పాలిసిస్టిక్ కిడ్నీ వ్యాధి, వారసత్వంగా వచ్చే కిడ్నీ వ్యాధులు, గుండె జబ్బులు, పునరావృత కిడ్నీ ఇన్‌ఫెక్షన్ వంటి కిడ్నీ వ్యాధి తీవ్రం అవ్వడానికి కారణాలుగా వైద్యులు పేర్కొంటున్నారు. ముఖ్యంగా ఇతర వ్యాధులకు వాడే మందులు కిడ్నీల ఆరోగ్యంపై ప్రభావం చూపుతుందని చెబుతున్నారు. వికారం, వాంతులు, పేలవమైన ఆకలి, బలహీనత, నిద్రలేమి, తరచుగా లేదా తక్కువ మూత్రం, కండరాల తిమ్మిరి, పాదాలు, చీలమండల వాపు, పొడి, దురద చర్మం, రక్తపోటు, ఊపిరి పీల్చుకోలేకపోవడం వంటి సంకేతాలు కిడ్నీ సమస్యలున్న వారిలో కనిపిస్తాయి. అలాగే కిడ్నీ సమస్యలు ఉన్న తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటో ఓ సారి తెలుసుకుందాం.
కిడ్నీ సమస్యలు ఉన్నవారు తీసుకోవాల్సిన జాగ్రత్తలు
- కిడ్నీ సమస్యలు ఉన్నవారు డాక్టర్ల సూచన మేరకు తరచూగా రక్తపోటును తనిఖీ చేయాలి. రక్తపోటు ఎక్కువగా ఉంటే మద్యం వంటి అలవాట్లకు దూరంగా ఉంటే ఉత్తమం.
- ఒకవేళ కిడ్నీ వ్యాధిగ్రస్తులకు మధుమేహం ఉంటే దాని నిర్వహణ చాలా ముఖ్యం. ముఖ్యంగా రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంటే కిడ్నీ ఆరోగ్యానికి మేలు జరుగుతుంది.
- కిడ్నీ వ్యాధిగ్రస్తులు ముఖ్యంగా బరువును అదుపులో ఉంచుకోవాలి. బరువు నిర్వహించడానికి ప్రతిరోజూ తప్పనిసరిగా వ్యాయామం చేయాలని వైద్యులు సూచిస్తున్నారు.
- ధూమపానం వంటి అలవాట్లు ఉంటే కిడ్నీ వ్యాధిగ్రస్తులు వాటి నుంచి దూరంగా ఉండాలి. ధూమపానం ఊపిరితిత్తులపైనే కాకుండా కిడ్నీ ఆరోగ్యంపై ప్రభావం చూపుతుందని గుర్తుంచుకోవాలి.
మరిన్ని హెల్త్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..




