Heart Attack: ఈ ట్యాబ్లెట్ తో గుండెపోటు దూరం.. ఎప్పుడూ మీ దగ్గరే ఉంచుకోండి…

Srinu

Srinu | Edited By: Anil kumar poka

Updated on: Jan 26, 2023 | 4:09 PM

సాధారణంగా గుండె పోటు కొన్ని సంకేతాలతో వస్తుంది. వీటిని పట్టించుకోకపోతే సమస్య తీవ్రమవుతుంది. మామూలుగా 45 ఏళ్లు వయస్సు పైబడిన మగవారికి, 55 ఏళ్ల వయస్సు పైబడిన ఆడవాళ్లకు గుండెపోటు ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. మధుమేహం, ఊబకాయం, ఒత్తిడి, రక్తపోటు వంటి సమ్యలున్న వారికి గుండె పోటు వచ్చే అవకాశం ఎక్కువని వైద్యులు చెబుతుంటారు.

Heart Attack: ఈ ట్యాబ్లెట్ తో గుండెపోటు దూరం.. ఎప్పుడూ మీ దగ్గరే ఉంచుకోండి…
Heart Attack

మనకు తెలిసిన వాళ్లల్లో చాలా మంది గుండెపోటుతో మరణించారనే వార్త వింటూనే ఉంటాం. అలాంటి సమయంలో అందరూ చెప్పే మాట ఇంట్లో ఒక్కరే ఉన్నప్పుడు సడెన్ గా స్ట్రోక్ వచ్చింది..అలర్ట్ అయ్యే లోపు ప్రాణం పోయింది అని అంటుంటారు. గుండె సమస్యలున్న వారు ఈ మాట విని భయపడుతుంటారు. తమ పరిస్థితి ఏంటి? అని. సాధారణంగా గుండె పోటు కొన్ని సంకేతాలతో వస్తుంది. వీటిని పట్టించుకోకపోతే సమస్య తీవ్రమవుతుంది. మామూలుగా 45 ఏళ్లు వయస్సు పైబడిన మగవారికి, 55 ఏళ్ల వయస్సు పైబడిన ఆడవాళ్లకు గుండెపోటు ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. మధుమేహం, ఊబకాయం, ఒత్తిడి, రక్తపోటు వంటి సమ్యలున్న వారికి గుండె పోటు వచ్చే అవకాశం ఎక్కువని వైద్యులు చెబుతుంటారు. అలాగే కుటుంబ చరిత్రలో గుండె పోటు సంకేతాలు ఉంటే వారికి కూడా గుండె పోటు వచ్చే అవకాశం ఉంది. గుండె పోటు వచ్చే ముందు శరీరం ఇచ్చే సంకేతాలు ఏంటి? అలాగే ఒంటరిగా ఉన్న సమయంలో గుండె పోటు వస్తే ఏం చేయాలి? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అనే విషయాలపై నిపుణులు అభిప్రాయాలేంటో ఓ సారి తెలుసుకుందాం.

గుండె పోటు సంకేతాలు

గుండె పోటు వచ్చే ముందు ముఖ్యంగా అందరూ గమనించే విషయంలో ఏంటంటో చాతిలో నొప్పి. ఈ నొప్పి వచ్చే సమయంలో ఎడమ చేయి లేదా కుడి చేయి లాగడం, మొండెం, చాతి దవడ నొప్పితో కుడి వైపు ఎక్కువగా రావడం వంటి అంశాలను గమనించవచ్చు. ఈ నొప్పి 20 నిమిషాల కంటే ఎక్కువ సేపు ఉంటే వెంటనే అనుమానించాలని వైద్యులు సూచిస్తున్నారు. అయితే ఇలాంటి నొప్పి మొదటిసారిగా శ్వాస తీసుకోవడంలో ఏదైనా ఇబ్బంది ఉందో? లేదో? అనే విషయాన్ని గమనించాలి. ఇదే సమయంలో బరువు, బిగుతు, ఒత్తిడి, నొప్పి, మంట లేదా తిమ్మిరిని అనుభూతి చెందవచ్చు. అలాగే అలసట, ఆందోళన, స్పీడ్ హార్ట్ బీట్ ను అనుభించవచ్చు. ఇలాంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే అలర్ట్ అవ్వాలని నిపుణులు చెబుతున్నారు.

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

ఈ ట్యాబ్లెట్స్ తో రక్షణ

పైన పేర్కొన్న సంకేతాలు కనిపించిన వెంటనే  భయపడకుండా కొన్ని జాగ్రత్తలు తీసుకుంటూ వైద్య సాయం పొందాలి. ముందుగా సార్బిట్రేట్(5 ఎంజీ నుంచి 10 ఎంజీ) ట్యాబ్లెట్ ను నాలుక కింద పెట్టుకుని చప్పరించాలి. అయినా నొప్పి తగ్గకపోతే దాన్ని గుండె పోటుగా పరిగణించి వెంటనే వైద్య సాయం పొందడానికి చర్యలు తీసుకోవాలి. ఇలాంటి సమయంలో ఆస్పిరిన్ (300 ఎంజీ), క్లోపిడోగ్రిల్ (300 ఎంజీ), అటోర్వాస్టాటిన్( 80 ఎంజీ ) ట్యాబ్లెట్ తీసుకోవాలి. అప్పుడు ఈసీజీ కోసం ఆస్పత్రికి వెళ్లాలి. అయితే మనం అత్యవసర సమయంలో మాత్రమే వీటిని వేసుకుంటారు కాబట్టి ఈ టాబ్లెట్ వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్ ఏమీ ఉండవు.

అలాగే పరీక్షించే డాక్టర్ కు కూడా ఏ ట్యాబ్లెట్ వేసుకున్నామో? తెలపాలి. లక్షణాలు కనిపించిన 30 నిమిషాలలోపు ఆస్పిరిన్ నమలడం వల్ల ప్లేట్‌లెట్ అభివృద్ధి నిరోధిస్తుంది, అలాగే రక్తం గడ్డకట్టడం ఆలస్యం అవుతుంది. కొంతమంది రోగులు గుండె సంబంధిత సంఘటన కంటే రక్తపోటు అకస్మాత్తుగా పడిపోవడం వల్ల విపరీతమైన చెమట, మైకం వచ్చిందని చెబుతారు. . అలాంటి సమయంలో బీపీ తక్కువగా ఉంటుందని కాబట్టి రోగి సార్బిట్రేట్ తీసుకోకూడదు ఎందుకంటే ఇది బీపీను మరింత తగ్గిస్తుంది. ఈ విషయంపై జాగ్రత్త తీసుకోవాలి. అయితే ఈ ట్యాబ్లెట్ వేసుకున్నామని వైద్య సాయం పొందకుండా ఉంటే ప్రాణాపాయం వచ్చే అవకాశం ఉంది. ఈ చర్య కేవలం అంబులెన్స్ లేదా ఆస్పత్రికి వెళ్లే సమయం వరకూ ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉండడానికి మాత్రమే అనే విషయం గుర్తు పెట్టుకోవాలి.

నోట్.. ఈ కథనంలో పేర్కొ న్న విషయాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. వీటిని పాటించే ముందు నిపుణుల సలహాలు తీసుకోడం ఉత్తమం.

ఇవి కూడా చదవండి

మరిన్ని హెల్త్ న్యూస్ కోసం

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu