AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Nourished Skin Tips : చర్మ సమస్యలకు ఆ పోషక లోపమే కారణం.. ఆహార అలవాట్లతో లోపాన్ని నివారించండిలా..!

స్తుత కాలంలో నాజుకైన చర్మానికి అవసరమయ్యే కొల్లాజిన్ అనే పోషక లోపం అందరిలో కనిపిస్తుంది. ఆ లోపమే అన్ని చర్మ సమస్యలకు కారణంగా నిలుస్తుంది. కొల్లాజెన్ అనేది మన చర్మం, జుట్టు, గోర్లు, కీళ్ల ఆరోగ్యం, రూపాన్ని కాపాడుకోవడంలో కీలక పాత్ర పోషించే ప్రోటీన్.

Nourished Skin Tips : చర్మ సమస్యలకు ఆ పోషక లోపమే కారణం.. ఆహార అలవాట్లతో లోపాన్ని నివారించండిలా..!
skin rashes
Nikhil
|

Updated on: Mar 23, 2023 | 7:00 PM

Share

ప్రస్తుత కాలంలో ఎక్కువ పొల్యూషన్ కారణంగా చర్మ సమస్యలు అందరినీ వేధిస్తున్నాయి. అయితే చర్మ సమస్యలకు పొల్యూషన్ మాత్రమే కారణం కాదని వైద్య నిపుణుల వాదన. శరీరానికి సహజంగా అందే పోషకాలు మారుతున్న ఆహార అలవాట్ల కారణంగా అందకపోవడంతో చర్మ సమస్యలు తీవ్రం అవుతుందని పేర్కొంటున్నారు. ముఖ్యంగా ప్రస్తుత కాలంలో నాజుకైన చర్మానికి అవసరమయ్యే కొల్లాజిన్ అనే పోషక లోపం అందరిలో కనిపిస్తుంది. ఆ లోపమే అన్ని చర్మ సమస్యలకు కారణంగా నిలుస్తుంది. కొల్లాజెన్ అనేది మన చర్మం, జుట్టు, గోర్లు, కీళ్ల ఆరోగ్యం, రూపాన్ని కాపాడుకోవడంలో కీలక పాత్ర పోషించే ప్రోటీన్. ఇది మన శరీరానికి నిర్మాణం, స్థితిస్థాపకత, దృఢత్వాన్ని అందించే బంధన కణజాలాలలో ఒక ముఖ్యమైన భాగం. వయసు పెరిగేకొద్దీ, మన కొల్లాజెన్ ఉత్పత్తి మందగిస్తుంది, ఇది ముడతలు, చర్మం కుంగిపోవడం, కీళ్ల నొప్పులకు దారితీస్తుంది. అయినప్పటికీ, మన శరీరం యొక్క సహజ కొల్లాజెన్ సంశ్లేషణను పెంచడానికి మరియు ఆరోగ్యకరమైన, పోషకమైన చర్మాన్ని ప్రోత్సహించడానికి మన ఆహారంలోనే కొల్లాజెన్ అధికంగా ఉండే ఆహార పదార్థాలు తినాలని నిపుణులు సూచిస్తున్నారు. 

బోన్ సూప్

బోన్ సూప్ అంటే మేక మాంసంలోని ఎముకలు, బంధన కణజాలాలను చాలా గంటల పాటు ఉడకబెట్టి తయారు చేస్తారు. ఇందులో చర్మ రక్షణకు అవసరమయ్యే కొల్లాజెన్, గ్లూకోసమైన్, కొండ్రోయిటిన్‌లలో సమృద్ధిగా ఉంటాయి. ఇది కీళ్ల ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి, వాపును తగ్గించడానికి, చర్మ స్థితిస్థాపకతకు మద్దతు ఇస్తుంది.

పప్పు దినుసులు

భారతీయ వంటకాలలో పప్పు దినుసులు ప్రధానమైన ఆహారం. అవి మొక్కల ఆధారిత ప్రోటీన్, ఫైబర్, జింక్, రాగి, మాంగనీస్ వంటి పోషకాలతో ఉంటాయి. దీంతో శరీరానికి అవసరమయ్యే కొల్లాజెన్ పెరుగుతుంది.  అలాగే వాటిని తినడం ద్వారా యాంటీఆక్సిడెంట్లను పెరిగి, చర్మాన్ని ఫ్రీ రాడికల్స్ దెబ్బతినకుండా కాపాడతాయి. అలాగే ఆరోగ్యకరమైన మెరుపును ప్రోత్సహిస్తాయి.

ఇవి కూడా చదవండి

పసుపు

పసుపు అనేది భారతీయ వంటలలో సాధారణంగా ఉపయోగించేది. పసుపులోని యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీఆక్సిడెంట్ లక్షణాలకు ప్రసిద్ధి చెందింది. ఇది కర్కుమిన్ అనే సమ్మేళనాన్ని కలిగి ఉంటుంది. ఇది కొల్లాజెన్ ఉత్పత్తిని ప్రేరేపిస్తుంది. అలాగే చర్మ స్థితిస్థాపకతను మెరుగుపరుస్తుంది.

నెయ్యి

భారతీయ వంటకాల్లో నెయ్యిని విస్తృతంగా వాడతారు. ఇందులో విటమిన్ ఏ, డీ, ఈ వంటి ఆరోగ్యకరమైన కొవ్వులు ఉన్నాయి. అలాగే కొవ్వులో కరిగే విటమిన్లు పుష్కలంగా ఉన్నాయి, ఇవి ఆరోగ్యకరమైన చర్మంతో పాటు జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తాయి. నెయ్యిలో బ్యూట్రిక్ యాసిడ్ కూడా ఉంటుంది. ఇది మంటను తగ్గించడానికి, అలాగే పేగు ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడుతుంది.

బాదంపప్పు

బాదం పప్పు అంటే పోషకాలు అధికంగా ఉంటాయి. ఇందులో విటమిన్ ఈ అధికంగా ఉంటుంది. ఇది ఆరోగ్యకరమైన చర్మానికి అవసరం. విటమిన్ ఈ ఒక శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్. ఇది చర్మాన్ని ఆక్సీకరణ ఒత్తిడి నుంచి రక్షిస్తుంది. అలాగే కొల్లాజెన్ సంశ్లేషణను ప్రోత్సహిస్తుంది. బాదంపప్పులో ఆరోగ్యకరమైన కొవ్వులు, ఫైబర్, ప్రొటీన్లు కూడా ఉంటాయి. ఇవి ఆరోగ్యకరమైన చర్మం, జుట్టు పెరుగుదలకు చాలా బాగా పని చేస్తాయి.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం..