Hot Water Bath: చలికాలంలో వేడి వేడి నీళ్లతో స్నానం చేస్తున్నారా? అయితే మీరు జాగ్రత్త పడాల్సిందే! లేకుంటే అంతే సంగతులు

గీజర్, లేదా హీటర్ లను ఆన్ చేసేసి బాగా మరిగించి వేడి వేడిగా స్నానం చేయడానికి మొగ్గుచూపుతారు. వేడి నీటి స్నానం బద్ధకాన్ని కాస్త వదిలిస్తుంది. కొంచెం ఉత్సాహాన్ని కూడా తెస్తుంది. అయితే దీని వల్ల కొన్ని ఆరోగ్య సంబంధిత సమస్యలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు.

Hot Water Bath: చలికాలంలో వేడి వేడి నీళ్లతో స్నానం చేస్తున్నారా? అయితే మీరు జాగ్రత్త పడాల్సిందే! లేకుంటే అంతే సంగతులు
చర్మం పొడి బారడం : మన చర్మంలో నుంచి సహజంగా ఆయిల్ ఉత్పత్తి అవుతుంది. ఇది చర్మాన్ని పొడిబారకుండా, చర్మ సంబంధిత సమస్యల నుంచి కాపాడుతుంది. మరీ వేడి నీళ్లతో స్నానం చేసినా, బాత్ టబ్ లోని వేడి నీళ్లలో ఎక్కువసేపు కూర్చున్నా అందులోని వేడి వల్ల ఈ ఆయిల్ ఉత్పత్తి ఆగిపోతుంది. దీంతో చర్మం పొడిబారి, కొత్త సమస్యలు ఎదురవుతాయి.
Follow us
Madhu

| Edited By: Anil kumar poka

Updated on: Jan 12, 2023 | 6:03 PM

చలికాలం బద్ధకానికి పెట్టింది పేరు. ముఖ్యంగా ఉదయం సమయంలో వణికించే చలికి మంచెంపై నుంచి లేవాలంటేనే కష్టంగా ఉంటుంది. దుప్పటి ముసుగు నుంచి బయటకు రాలేక అవస్థలు పడతారు చాలా మంది. ఈ సారి ఎన్నడూ లేని విధంగా తెలుగు రాష్ట్రాల్లో అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. చలి తీవ్రతకు జనం గజగజ వణుకుతున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో స్నానం చేయాలంటే అందరూ వేడి నీటినే ఆశ్రయిస్తారు. గీజర్, లేదా హీటర్ లను ఆన్ చేసేసి బాగా మరిగించి వేడి వేడిగా స్నానం చేయడానికి మొగ్గుచూపుతారు. వేడి నీటి స్నానం బద్ధకాన్ని కాస్త వదిలిస్తుంది. కొంచెం ఉత్సాహాన్ని కూడా తెస్తుంది. అయితే దీని వల్ల కొన్ని ఆరోగ్య సంబంధిత సమస్యలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా చర్మానికి వేడి నీటి స్నానం చేటు చేస్తుందని వివరిస్తున్నారు. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం..

చర్మానికి చేటు..

వేడి నీటి వల్ల మనం ఎంత రిలాక్సేషన్ ఫీల్ అవుతామో.. మన చర్మానికి అంత స్థాయిలోనే నష్టం చేకూరుతుందని నిపుణులు చెబుతున్నారు. చర్మంలో ఉండే సహజ నూనెలను ఈ వేడి నీరు తొలగిస్తుంది. తద్వారా అది పొడిబారినట్లు కనిపిస్తుంది. అందుకనే చాలా మంది చలికాలంలో చర్మం పొడిగా మారిపోయి.. పగిలిపోయి, దురద, మంట పెడుతూ ఇబ్బందులు పడతారు. ఫలితంగా పలు రకాల ఇన్ఫెక్షన్లు, అలెర్జీలు అటాక్ చేస్తాయి. తామర వంటి చర్మ సమస్య‌లు తీవ్రంగా మారుతాయి.

సున్నితం అయిపోతుంది..

వేడి నీటితో ఎక్కువ సమయం పాటు స్నానం చేసినా లేక వేడి ఎక్కువగా ఉన్న నీటితో స్నానం చేసినా చర్మం పొడి బారి సున్నితంగా తయారవుతుంది. ఇలా జరిగినపుడు చర్మం సులభంగా ఇన్ఫెక్షన్ల బారిన పడే ప్రమాదం ఉంటుంది. అలాగే మొటిమల సమస్యతో బాధ పడేవారిలో వేడి నీటి స్నానం సమస్య మరింత పెరిగేందుకు కారణం అవుతుంది. చర్మం మీద పెరిగే ఆరోగ్యకర బ్యాక్టీరియా చర్మాన్ని తేమగా ఉంచుతుంది. చర్మం లోపల ఉన్న మురికిని తొలగించేందుకు కూడా ఇది అవసరమే. ఈ బ్యాక్టీరియా నశించినపుడు చర్మ కణాల్లో తేమ తగ్గడం వల్ల పెళుసుగా మారి సులభంగా విరిగిపోతాయి.

ఇవి కూడా చదవండి

మరేం చేయాలి..

మరి చలికాలంలో చల్ల నీటితో స్నానం చేయలేం. మరి అలాంటప్పుడు ఏం చేయాలి? ఈ ప్రశ్నకు నిపుణులు సమాధానం చెబుతున్నారు. అదేంటంటే.. స్నానం చేసేటప్పుడు బాగా వేడి నీరు వాడకుండా గోరువెచ్చని నీటిని వాడాలి. అలాగే వీలైనంత త్వరగా స్నానం చేసి రావాలి. అనంతరం చర్మం పొడిబారకుండా నూనె లేదా ఏదైనా మంచి మాయిశ్చరైజర్‌ రాసుకోవాలని సూచిస్తున్నారు.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం..