AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Phone Overheating: ఫోన్ బాగా వేడెక్కుతోందా? ఈ టిప్స్‪తో ఎప్పుడూ చల్లగా ఉంచండి..

మీ ఫోన్ ఊరకనే వేడెక్కుతోందా? ఈ వేసవిలో సమస్య మరింత ఎక్కువగా వేధిస్తుందా? అయితే ఈ సింపుల్ టిప్స్ ఫాలో అవ్వడం ద్వారా మీ ఫోన్ ను చల్లగా ఉంచుకోవచ్చు.

Phone Overheating: ఫోన్ బాగా వేడెక్కుతోందా? ఈ టిప్స్‪తో ఎప్పుడూ చల్లగా ఉంచండి..
Phone Heating
Madhu
|

Updated on: Mar 23, 2023 | 4:30 PM

Share

ఎండాకాలం వచ్చేసింది. వాతావరణంలో వేడి క్రమక్రమంగా పెరుగుతోంది. భానుడు నెమ్మదిగా తన ప్రతాపాన్ని చూపడం మొదలు పెట్టాడు. ఈ క్రమంలో మన శరీరం చల్లదనాన్ని కోరుకుంటుంది. అలానే నిత్యం మన చేతుల్లో ఉండే ఫోన్ కూడా బాగా వేడిగా అయిపోతుంటుంది. ఇది ఫోన్ పనితీరుపై ప్రభావం చూపుతుంది. ఈ నేపథ్యంలో ఈ వేసవిలో మీ ఫోన్ ని కాపాడుకోవాల్సిన అవసరం ఉంటుంది. కొన్ని టిప్స్ ఫాలో అవడం ద్వారా మీ ఫోన్ ని ఈ వేసవిలో కూల్ గా ఉంచొచ్చు. ఆ చిట్కాలు ఏంటో చూద్దాం రండి..

కారు లోపల ఉంచొద్దు.. ఎండలో బయట పార్క్ చేసిన కార్ల లోపల మీ ఫోన్‌ని ఉంచవద్దు. యాపిల్ సంస్థ ప్రకటించిన దాని ప్రకారం, 35 డిగ్రీల సెల్సియస్ కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలో యాపిల్ ఐఫోన్ ఉంచితే దాని బ్యాటరీకి హాని కలుగుతుంది. ఆండ్రాయిడ్ ఫోన్‌లకు సంబంధించి ఎటువంటి నివేదిక లేదు. కానీ అది అదే విధమైన ప్రభావం వీటిపై కూడా ఉండే అవకాశం ఉంది. ఎండలో పార్క్ చేసిన కారులో ఉష్ణోగ్రత బాగా పెరిగుతుంది. కాబట్టి ఫోన్లను అలా వదిలేయవద్దు.

ఫోన్‌ను డ్యాష్‌బోర్డ్‌లో ఉంచవద్దు.. అలాగే, డ్రైవింగ్ చేస్తున్నప్పుడు ఫోన్‌ను డ్యాష్‌బోర్డ్‌లో ఉంచవద్దు. ఇది గాజు/విండ్‌షీల్డ్ నుండి వచ్చే ప్రత్యక్ష సూర్యకాంతికి గురికావచ్చు.

ఇవి కూడా చదవండి

ఎండలో ఎక్కువసేపు ఉంచొద్దు.. స్మార్ట్‌ఫోన్‌లు కూడా దాని పరిసరాల నుండి వేడిని గ్రహిస్తాయి. కాబట్టి, మీ పరికరాలను నేరుగా సూర్యకాంతిలో ఉంచకపోవడమే మంచిది. మీరు చార్జింగ్ చేస్తున్నప్పుడల్లా మీ ఫోన్ చల్లని పొడి ప్రదేశంలో (నీడలో) ఉంచినట్లు నిర్ధారించుకోండి. బ్యాటరీని ఛార్జ్ చేయడం వల్ల చాలా ఫోన్‌లు వేడెక్కుతాయి.

పగటిపూట ఆరుబయట వాడొద్దు.. మీరు ఎక్కువసేపు సూర్యకాంతిలో ఉన్నట్లయితే, ఫోన్‌ని సుదీర్ఘ సంభాషణల కోసం ఉపయోగించడం మానుకోండి. మీరు ఎండలో ఉంటే, మీ స్మార్ట్‌ఫోన్ సాధారణం కంటే ఎక్కువ వేడిగా ఉందని భావిస్తే కొంత సేపు దానిని పక్కన పెట్టండి. వేడి తగ్గాక తిరిగి వాడుకోండి.

ఫోన్‌ ఓవర్‌ఛార్జ్ చేయవద్దు.. చాలా మంది వినియోగదారులు రాత్రిపూట నిద్రిస్తున్నప్పుడు తమ ఫోన్‌లను ఛార్జ్ పెట్టేసి రాత్రంతా అలాగే ఉంచేస్తారు. దీని వల్ల ఫోన్ ఓవర్ హీట్ అవడంతో పాటు బ్యాటరీ కూడా బలహీన పడే అవకాశం ఉంది. ఇటీవల కాలంలో చాలా ఫోన్‌లు బ్యాటరీ విషయానికి వస్తే ఆటో కట్-ఆఫ్‌తో వచ్చినప్పటికీ, మీ ఫోన్‌ను ఓవర్ ఛార్జ్ చేయకుండా ఉండటం మంచి పద్ధతి. ఈ అభ్యాసం బ్యాటరీ దెబ్బతినడానికి మాత్రమే కాకుండా స్మార్ట్‌ఫోన్‌లలో హీటింగ్ సమస్యలను కూడా కలిగిస్తుంది. అలాగే, ఛార్జింగ్‌లో ఉన్నప్పుడు మీ స్మార్ట్‌ఫోన్‌లను దిండ్లు లేదా దుప్పటి కింద ఉంచకుండా ఉండండి.

వేడెక్కువైతే పౌచ్ తీసేయండి.. పౌచ్ ఉన్న స్మార్ట్‌ఫోన్‌లను ఉపయోగించడం మంచి పద్ధతి. ఇది ప్రమాదవశాత్తు ఫోన్ కింద పడిపోయినప్పుడు అవసరమైన రక్షణను అందిస్తుంది. అయితే, మీ ఫోన్ వేడెక్కుతున్నట్లు మీకు అనిపిస్తే, కొంత సమయం పాటు కవర్‌ నుంచి ఫోన్ బయటకు తీయడం మంచిది.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్  చేయండి..