AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

తొక్కే కదా అని తేలికగా తీసుకోవద్దు.. నిమ్మతొక్కలో దాగివున్న అద్భుత ప్రయోజనాలు తెలుసుకోండి.!

పండ్ల తొక్కలలో ఆరోగ్యానికి అవసరమైన పోషకాలు పుష్కలంగా ఉంటాయి. అలాంటి వాటిల్లో నిమ్మ తొక్క వల్ల కలిగే ప్రయోజనాలు తెలిస్తే.. ఇకపై అస్సలు విసిరేయరు..

తొక్కే కదా అని తేలికగా తీసుకోవద్దు.. నిమ్మతొక్కలో దాగివున్న అద్భుత ప్రయోజనాలు తెలుసుకోండి.!
Lemon Peels
Follow us
Jyothi Gadda

|

Updated on: Nov 14, 2022 | 9:19 PM

ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో కూరగాయలు, పండ్ల పాత్ర ఉంటుంది. సాధారణంగా పండ్లు తిన్న తర్వాత తొక్కలను పారేస్తాం. అయితే మనం చెత్తలో వేసే పండ్ల తొక్కలు అద్భుతమైన ప్రయోజనాలను కలిగి ఉన్నాయని మీరు నమ్ముతారా? అవును ఇది నిజం. పండ్ల తొక్కలలో ఆరోగ్యానికి అవసరమైన పోషకాలు పుష్కలంగా ఉంటాయి. అలాంటి వాటిల్లో నిమ్మ తొక్క వల్ల కలిగే ప్రయోజనాలు తెలిస్తే.. ఇకపై అస్సలు విసిరేయరు..అవేంటో ఇక్కడ తెలుసుకుందాం..

నిమ్మ తొక్క ప్రయోజనాలు.. నిమ్మకాయ మాత్రమే కాదు దాని తొక్క కూడా బరువు తగ్గడంలో ముఖ్యపాత్ర పోషిస్తుంది. నిమ్మకాయ ఒక అద్భుత పండు. మనలో చాలా మంది నిమ్మకాయను ఉపయోగించిన తర్వాత దాని చర్మాన్ని పారేస్తుంటారు. మనం పారేసే నిమ్మతొక్కలో క్యాల్షియం, పొటాషియం, మెగ్నీషియం వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి.

ఒత్తిడిని తగ్గిస్తుంది.. నిమ్మ తొక్కలో డి-లిమోనెన్ అనే సమ్మేళనం ఉంటుంది. ఇది కొవ్వును తగ్గించడంలో సహాయపడుతుంది. ఇది టాక్సిన్స్ ను కూడా తొలగిస్తుంది. నిమ్మ తొక్కలలో ఫ్లేవనాయిడ్లు ఉంటాయి. ఇవి ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడతాయి. ఒత్తిడిలో ఉన్నవారు నిమ్మ తొక్కలను తినడం వల్ల ప్రయోజనం పొందవచ్చు.

ఇవి కూడా చదవండి

టాక్సిన్స్ ను తొలగిస్తుంది.. శరీరంలో కొవ్వులు పెరగడం వల్ల శరీరంలో టాక్సిన్స్ కూడా పెరుగుతాయి. నిమ్మ తొక్క తినడం వల్ల శరీరంలోని టాక్సిన్స్ తొలగిపోయి శరీరం ఆరోగ్యవంతంగా మారి శరీర బరువు గణనీయంగా తగ్గుతుంది.

కొవ్వును కరిగిస్తుంది.. నిమ్మ తొక్కలో ఉండే విటమిన్ సి కొవ్వును కరిగించడంలో సహాయపడుతుంది.

నిమ్మ తొక్కతో కలిపిన వేడి నీరు.. నిమ్మకాయ తొక్కను తీసుకుని సుమారు 2 లీటర్ల నీటిలో 30 నిమిషాలు ఉడకబెట్టండి. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత కాచిన వేడినీళ్లను వడపోసి చల్లార్చి తాగాలి. రోజూ ఉదయాన్నే నిమ్మతొక్క కలిపిన వేడి నీళ్లలో తాగితే బరువు గణనీయంగా తగ్గుతారు. అలాగే మలబద్ధకం, అజీర్ణం, కడుపు ఉబ్బరం వంటి రకరకాల శారీరక రుగ్మతలు ఎప్పటికీ రావు.

మరిన్ని ఆరోగ్య సంబంధిత వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి