Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఆదాయం ఇచ్చే శాఖలపై సీఎం జగన్ సమీక్ష.. అధికారులకు కీలక ఆదేశాలు.. ఇకపై ఇలా..

అక్రమాలకు పాల్పడుతున్న ఏజెన్సీలపై అప్రమత్తంగా ఉండాలని అధికారులను సూచించారు సీఎం జగన్‌. నిరుపయోగంగా ఉన్న మైనింగ్‌ ఏరియాల్లో..

ఆదాయం ఇచ్చే శాఖలపై సీఎం జగన్ సమీక్ష.. అధికారులకు కీలక ఆదేశాలు.. ఇకపై ఇలా..
CM Jagan
Follow us
Jyothi Gadda

|

Updated on: Nov 14, 2022 | 7:12 PM

ఏపీలో ఆదాయాన్నిచ్చే శాఖ‌ల‌పై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి స‌మీక్షాసమావేశం నిర్వహించారు. ఈ సంద‌ర్భంగా ఆయా శాఖలకు సంబంధించిన అధికారులతో సీఎం జగన్‌ విస్తృత సమీక్షచేశారు. ఈ సమీక్షా సమావేశానికి విద్యుత్, అటవీ పర్యావరణ, భూగర్భ గనులశాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, సీఎస్‌ సమీర్‌ శర్మ, ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా సీఎం జగన్‌ అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్రంలో అక్రమాలకు పాల్పడుతున్న ఏజెన్సీల పట్ల అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. పన్ను కట్టేవారికి చెల్లింపుల ప్రక్రియను ప్రజలకు వీలైనంత సులభతరం చేయాలని సూచించారు. దీనిపై అవగాహన పెంచడంతో పాటు.. పన్ను చెల్లింపుదారుల అభ్యంతరాలను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని ఆదేశించారు. ఇలా చేస్తే..పన్ను చెల్లింపులు సకాలంలో జరుగుతాయని సీఎం జగన్ ఆశాభావం వ్యక్తం చేశారు.

ప్రభుత్వం తీసుకున్న చర్యలతో మద్యం వినియోగం తగ్గిందని చెప్పారు సీఎం. అక్రమ మద్యం తయారీ, అమ్మకాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు జగన్‌. బెల్టుషాపులు తొలగించడం, పర్మిట్‌ రూమ్‌లు రద్దు వంటి చర్యల వల్ల మద్యం అమ్మకాలు గణనీయంగా తగ్గాయన్నారు సీఎం జగన్‌. రేట్లు పెంచడం వల్ల కూడా మద్యం వినియోగం తగ్గడానికి కారణమని చెప్పారు. గంజాయి నివారణ చర్యలు చేపట్టి ప్రత్యామ్నాయ ఉపాధి చూపించాలన్నారు.

అర్హులైన వారికి ఆర్‌ఓఎఫ్‌ఆర్‌ పట్టాలివ్వాలని సూచించారు. శాశ్వత భూహక్కు, భూసర్వే కార్యక్రమం చేపడుతున్న గ్రామాలు, వార్డుల్లో సబ్‌ రిజిస్ట్రార్‌ భవనం, సేవలు వంటి వాటిపై అవగాహన కలిగించాలన్నారు జగన్. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలను అప్ గ్రేడ్ చేయాలని వెల్లడించారు. మైనింగ్‌లో నాన్‌ ఆపరేషనల్‌ మైన్స్‌పై మరింత దృష్టి పెట్టాలని సూచించారు సీఎం. నిరుపయోగంగా ఉన్న మైనింగ్‌ ఏరియాలో కార్యకలాపాలు మొదలయ్యేలా చూడాలని అధికారులను ఆదేశించారు సీఎం జగన్.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి