Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

చేతిలో కర్రతో సింహం వెంటపడ్డ యువకుడు.. ఒక్కసారిగా రెచ్చిపోయిన మృగరాజు.. వీడియో చూస్తే బుర్ర గిర్రుమనాల్సిందే..

ప్రస్తుతం సింహం వీడియో ఒకటి సోషల్ మీడియాలో హల్‌చల్‌ చేస్తోంది. వీడియో చూసిన ప్రజలు షాక్ అవుతున్నారు. వైరల్ అవుతున్న క్లిప్‌లో, అడవికి రాజైన మృగరాజును కర్ర సహాయంతో భయపెట్టడానికి ప్రయత్నిస్తున్న వ్యక్తిని అది..

చేతిలో కర్రతో సింహం వెంటపడ్డ యువకుడు.. ఒక్కసారిగా రెచ్చిపోయిన మృగరాజు.. వీడియో చూస్తే బుర్ర గిర్రుమనాల్సిందే..
Funny Lion Video
Follow us
Jyothi Gadda

|

Updated on: Nov 14, 2022 | 5:20 PM

మృగరాజు.. సింహాన్ని అడవికి రాజుగా పరిగణిస్తారు. సింహ గర్జనతో అరణ్యమంతా వణికిపోతుంది.. అయితే అలాంటి మృగరాజు ఎదురుపడితే అడవి జంతువులే కాదు.. మనుషులు సైతం ప్రాణాల మీద ఆశలు వదులుకోవాల్సిందే. కానీ, ఎవరైనా ఆవు-గేదెను కర్రతో తరిమినంత ఈజీగా సింహాన్ని భయపెడితే ఎలా ఉంటుంది? అవును, మీరు చదివింది పూర్తిగా నిజమే. ఈ వీడియో చూసిన తర్వాత మీరు కూడా అవాక్కవుతారు. ఎందుకంటే ఈ వీడియో సర్కస్ కాదు, అడవికి సంబంధించినది. ప్రస్తుతం సింహం వీడియో ఒకటి సోషల్ మీడియాలో హల్‌చల్‌ చేస్తోంది. వీడియో చూసిన ప్రజలు షాక్ అవుతున్నారు. తమ కళ్లను తామే నమ్మలేకపోతున్నామంటూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

వైరల్‌గా మారుతున్న ఈ క్లిప్ నిడివి కొన్ని సెకన్లు మాత్రమే.. అయినప్పటికీ, ఇది చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. సింహానికి సంబంధించిన ఇలాంటి వీడియోని మీరు చాలా అరుదుగా చూసి ఉంటారు. వైరల్ అవుతున్న క్లిప్‌లో, అడవికి రాజైన మృగరాజును కర్ర సహాయంతో భయపెట్టడానికి ప్రయత్నిస్తున్న వ్యక్తిని మీరు వీడియోలో చూస్తారు. ఆశ్చర్యకరంగా సింహం అతనిపై దాడి చేయకుండా భయపడి పారిపోతుంది. ఈ వీడియో నిజంగా అద్భుతం. వైరల్‌ అవుతున్న ఈ వీడియోలో కర్రను చూసిన సింహం చాలా భయపడిపోతుంది. భయంతో వెంటనే పారిపోవడం ప్రారంభిస్తుంది. ఐతే మీరు కూడా ఈ అద్భుతమైన వీడియో చూడండి.

ఇవి కూడా చదవండి

షాకింగ్ వీడియో సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ఇన్‌స్టాగ్రామ్‌లో one_earth__one_life అనే ఖాతా ద్వారా షేర్ చేయబడింది. నవంబర్ 1న షేర్ చేసిన ఈ వీడియోను 12.5 వేల మందికి పైగా లైక్ చేశారు. అలాగే పలువురు కామెంట్లు కూడా చేశారు.

ఇతడు.. ఎవరో మృత్యువుతో పారాడుతున్నాడు.. అంటూ కొందరు నెటిజన్లు కామెంట్‌ చేశారు. సింహాలు ఇలా ఉంటాయనీ మాకు గతంలో ఎప్పుడూ తెలియదంటూ మరికొందరు నెటిజన్లు కామెంట్‌ చేశారు. సింహానికి ఆకలిగా ఉండకపోవచ్చని, లేకుంటే కర్రతో బెదిరించిన ఆ వ్యక్తికి తన అసలు స్వరూపం చూపించి ఉండేదని మరో వినియోగదారు వ్యాఖ్యానించారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం ఇక్కడ  క్లిక్ చేయండి