AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ముంబయికి పాకిన గన్‌ కల్చర్‌.. పట్టపగలు నడిరోడ్డుపై కాల్పులతో వీరంగం.. వైరలవుతున్న వీడియో..

కాల్పులు జరుగుతున్న క్రమంలో కొందరు వ్యక్తులు ప్రాణభయంతో పరిగెత్తడం కనిపించింది. మరికొందరు పార్క్ చేసిన కార్ల వెనుక దాక్కోవడానికి ప్రయత్నిస్తున్నారు.

ముంబయికి పాకిన గన్‌ కల్చర్‌.. పట్టపగలు నడిరోడ్డుపై కాల్పులతో వీరంగం.. వైరలవుతున్న వీడియో..
Heavy Firing
Jyothi Gadda
|

Updated on: Nov 14, 2022 | 3:44 PM

Share

నిన్నమొన్నటి వరకు పంజాబ్‌ను హడలెత్తించిన గన్‌ కల్చర్‌ ఇప్పుడు ముంబయికి పాకింది. పట్టపగలు ఓ వర్గం కాల్పులకు దిగిన ఘటన సంచలనం సృష్టించింది. ఆదివారం రాత్రి ఎద్దుల బళ్ల పోటీల నిర్వహణలో ఇద్దరు వ్యక్తుల మధ్య గొడవ జరిగినట్టుగా తెలిసింది. దీంతో మరో వర్గం వారిపై కాల్పులకు దిగింది. సుమారు 15-20 రౌండ్ల కాల్పులు జరిగినట్లు సమాచారం. ఈ వీడియోలు సోషల్‌మీడియాలో వైరలయ్యాయి. ప్రధాన రహదారికి దూరంగా పార్క్‌ చేసిన వాహనాల చుట్టూ కొంతమంది నిలబడి ఉండగా, కాల్పులు జరగడం, కొందరు కార్ల వెనుక దాక్కోవడానికి యత్నిస్తుండగా, మరికొందరు భయంతో పరుగులు తీస్తున్న దృశ్యాలు సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తున్నాయి. వివరాల్లోకి వెళితే..

ముంబై సమీపంలోని ఓ వీధిలో ఈరోజు పట్టపగలు విచక్షణారహితంగా కాల్పులు జరిగాయి. అంబర్‌నాథ్‌లో ఆదివారం రాత్రి ఎద్దుల బండి పోటీలు నిర్వహించారు. ఈ క్రమంలోనే ఇద్దరు వ్యక్తుల మధ్య వాగ్వాదం చోటుచేసుకోవడంతో ఈ సంఘటన జరిగింది. ఇద్దరు వ్యక్తుల మధ్య వాగ్వాదం చినికి చినికి గాలివానగా మారింది. దాంతో ఒక వర్గం అకస్మాత్తుగా మరొకరిపై కాల్పులు జరిపింది. ఎద్దుల బండి రేసులో రెండు గ్రూపులు ఘర్షణకు దిగడంతో దాదాపు 15-20 రౌండ్లు కాల్పులు జరిగాయి. ఎవరికీ ఎలాంటి గాయాలు అయినట్లు సమాచారం లేదు.

ఇవి కూడా చదవండి

ఈ సంఘటన సమయంలో చిత్రీకరించబడిన ఒక వీడియో క్లిప్‌లో రోడ్డుపై వాహనాల రద్దీ ఎక్కువగానే ఉంది. నడిరోడ్డుపై అకస్మాత్తుగా కాల్పులు జరుపుతున్నప్పుడు కొంతమంది వ్యక్తులు ప్రధాన రహదారికి దూరంగా పార్క్ చేసిన వాహనాల చుట్టూ నిలబడి ఉన్నారు. ఇతర వాహనాలు వారి ముందు కాల్పులు జరుపుతున్నారు. కొందరు పార్క్ చేసిన కార్ల వెనుక దాక్కోవడానికి ప్రయత్నిస్తున్నారు. కొంతమంది వ్యక్తులు ప్రధాన రహదారికి దూరంగా పార్క్ చేసిన వాహనాల చుట్టూ నిలబడి ఉన్నారు. కాల్పులు జరుగుతున్న క్రమంలో కొందరు వ్యక్తులు ప్రాణభయంతో పరిగెత్తడం కనిపించింది. మరికొందరు పార్క్ చేసిన కార్ల వెనుక దాక్కోవడానికి ప్రయత్నిస్తున్నారు.

అంబర్‌నాథ్‌లో ఎద్దుల బండ్ల రేస్‌లో ఇద్దరి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. వాగ్వాద తీవ్ర ఉద్రికత్తకు దారి తీసింది. ఈ క్రమంలోనే ఇరువర్గాలు వాగ్వాదానికి దిగి కాల్పులు జరిపారు. శివాజీనగర్ పోలీస్ స్టేషన్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి