జాతి వైరం మరిచి పిల్లిని కాపాడిన కుక్క.. వీడియో చూసిన మండిపడుతున్న నెటిజన్లు..!! కారణం ఏంటంటే..

ప్రాణాలు కాపాడుకునేందుకు దారిలేక బిక్కుబిక్కుమంటూ కనిపించింది. అంతలోనే అటుగా వచ్చిన ఒక కుక్క పిల్లిని చూస్తుంది. ఎలాగైనా దాన్ని కాపాడాలని భావించి ఓ తెలివైన ఉపాయం చేసింది.

జాతి వైరం మరిచి పిల్లిని కాపాడిన కుక్క.. వీడియో చూసిన మండిపడుతున్న నెటిజన్లు..!! కారణం ఏంటంటే..
Dog Helping Cat
Follow us
Jyothi Gadda

|

Updated on: Nov 14, 2022 | 2:41 PM

సోషల్ మీడియాలో నిత్యం వేల వీడియోలు అప్‌లోడ్‌ అవుతుంటాయి. వాటిల్లో చాలా వీడియోలు జంతువులకు సంబంధించినవే ఎక్కువగా ఉంటాయి. అలాంటి వీడియోల్లో కుక్కలు, పిల్లలు, ఏనుగులు, కోతులు వంటి జంతువులు జాతి వైరం మరిచిపోయి తోటి జంతువులకు సాయం చేస్తున్న వీడియోలు సైతం తరచూ నెట్టింట వైరల్‌ అవుతుంటాయి. తాజాగా అలాంటిదే ఓ కుక్క, పిల్లికి సంబంధించిన వీడియో ఇప్పుడు నెటిజన్లను ఎంతగానో ఆకట్టుకుంటోంది. ఇప్పటివరకు 1.8 మిలియన్ల మందికి పైగా ఈ వీడియోను చూశారు. వైరల్ అవుతున్న ఈ వీడియోలో ఒక పిల్లి పిల్ల ఒక చిన్న నీటి ప్రవాహం మధ్యలో ఇరుక్కుపోయింది. నీటి ప్రవాహంలో ఓ బండరాయిపై నిలబడి ఉంది. తన  ప్రాణాలు కాపాడుకునేందుకు దారిలేక బిక్కుబిక్కుమంటూ కనిపించింది. అంతలోనే అటుగా వచ్చిన ఒక కుక్క పిల్లిని చూస్తుంది. ఎలాగైనా దాన్ని కాపాడాలని భావించి ఓ తెలివైన ఉపాయం చేసింది.

పిల్లిని కాపాడేందుకు ఆ కుక్క వేగంగా వెళ్లి ఓ చెక్కను నోట కరుచుకుని తీసుకొచ్చింది. నీటి ప్రవాహానికి అడ్డుగా వేసింది. పిల్లి కాళ్ల దగ్గర నుంచి ఆ చెక్కను వారధిలా వేసింది. దాంతో ఆ పిల్లి ఈజీగా చెక్కపై నుంచి దాటుకుంటూ ఇవతలి ఒడ్డుకు చేరింది. ఈ వీడియో చూస్తే ఎవరైనా ఫిదా కావాల్సిందే. కుక్క చేసిన ఈ పనికి నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈ పిల్లి పిల్ల ఎంతసేపు అలా నిలబడిందో పాపం.. నిలబడటానికి ఎంతలా భయపడిపోయిందోనంటూ వీడియో చూసిన నెటిజన్లు కామెంట్‌ చేస్తున్నారు. ఈ కుక్కకి కూడా ఎక్కడో ఒక చెక్క దొరికింది. పిల్లి సాఫీగా దాటింది. ఇలా ఆలోచిస్తే అన్నీ సినిమా సీన్ లాగా తలపిస్తున్నాయంటున్నారు.

ఇవి కూడా చదవండి

కానీ, లైకుల కోసం కొందరు వ్యక్తులు కావాలనే ఇలాంటి వీడియోలు చిత్రీకరిస్తున్నారని ఆరోపిస్తున్నారు. లైకుల కోసం పిల్లిని ఇలా హింసించటం తప్పని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పైగా ఇలాంటి వీడియోలు చూడమని ప్రజలను ప్రోత్సహించకండి. ఈ వీడియో తీయటం కోసం పిల్లి పిల్లను ఎంత కాలం హింసించాడో తెలియదంటున్నారు. లైకులు, షేర్ల ద్వారా డబ్బు సంపాదించేందుకు ప్రజలు దేనికైనా సిద్ధంగా ఉన్నారని అన్నారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం క్లిక్ చేయండి

'పంత్.. నువ్వొక స్టుపిడ్'.. లైవ్ మ్యాచ్‌లోనే రెచ్చిపోయిన సన్నీ..
'పంత్.. నువ్వొక స్టుపిడ్'.. లైవ్ మ్యాచ్‌లోనే రెచ్చిపోయిన సన్నీ..
ప్రభాస్, విజయ్ పై సుదీప్ కామెంట్స్..
ప్రభాస్, విజయ్ పై సుదీప్ కామెంట్స్..
మీల్ మేకర్‌తో ఇలా వెజ్ దమ్ బిర్యానీ చేయండి.. చలికాలంలో బెస్ట్!
మీల్ మేకర్‌తో ఇలా వెజ్ దమ్ బిర్యానీ చేయండి.. చలికాలంలో బెస్ట్!
వాట్సాప్‌ లింక్‌.. సెకనులో రూ.6 లక్షలు పోగొట్టుకున్న యువకుడు!
వాట్సాప్‌ లింక్‌.. సెకనులో రూ.6 లక్షలు పోగొట్టుకున్న యువకుడు!
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!
వెలగ పండుతో అద్భుతాలే.. సంతానలేమి సమస్యలు మాయం!
వెలగ పండుతో అద్భుతాలే.. సంతానలేమి సమస్యలు మాయం!
ఐటీ చెల్లింపుదారులకు పండగే.. వచ్చే బడ్జెట్‌లో ట్యాక్స్ తగ్గింపు.?
ఐటీ చెల్లింపుదారులకు పండగే.. వచ్చే బడ్జెట్‌లో ట్యాక్స్ తగ్గింపు.?
ఇలాంటి వాళ్లను ఏం చేయాలి? రేణూ దేశాయ్ సంచలన పోస్ట్.. ఏమైందంటే?
ఇలాంటి వాళ్లను ఏం చేయాలి? రేణూ దేశాయ్ సంచలన పోస్ట్.. ఏమైందంటే?
17 ఏళ్లకే క్రేజీ హీరోయిన్.. రహస్యంగా పెళ్లి, 9 నెలలకే విడాకులు..
17 ఏళ్లకే క్రేజీ హీరోయిన్.. రహస్యంగా పెళ్లి, 9 నెలలకే విడాకులు..