Viral video : ధూమ్ ధామ్‌గా జరిగిన పెళ్లి.. కానీ వచ్చిన వాళ్లంతా షాక్.. ఎందుకంటే

తాజాగా ఇక పెళ్లిళ్లలో జరిగే సంఘటనలు భలే విచిత్రంగా ఉంటాయి. ఇలాంటివి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతూ ఉంటాయి. తాజాగా ఓ పెళ్లి కూడా వైరల్ అవుతుంది.

Viral video : ధూమ్ ధామ్‌గా జరిగిన పెళ్లి.. కానీ వచ్చిన వాళ్లంతా షాక్.. ఎందుకంటే
Marriage
Follow us

|

Updated on: Nov 14, 2022 | 1:31 PM

పెళ్లి అనేది కేవలం ఒక వేడుక మాత్రమే కాదు.. రెండు కుటుంబాలను కలిపే ఓ బంధం కూడా.. మన  దేశంలో పెళ్లిళ్లు చాలా ఘనంగా జరుగుతాయి. సంగీత్ లు, బారత్ లతో ధూమ్ ధామ్ గా జరుపుకుంటారు. కొన్ని పెళ్లిళ్లు అయితే రెండు మూడు రోజులు కూడా జరుగుతుంటాయి. తాజాగా ఇక పెళ్లిళ్లలో జరిగే సంఘటనలు భలే విచిత్రంగా ఉంటాయి. ఇలాంటివి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతూ ఉంటాయి. తాజాగా ఓ పెళ్లి కూడా వైరల్ అవుతుంది. పెళ్లి పత్రిక చూడగానే అంతా షాక్ ఇంతకు అందరు ఎందుకు షాక్ అవుతున్నారంటే..  ఇక్కడ పెళ్లి జరుగుతుంది మనుషులకు కాదు.

గురుగ్రామ్‌లోని పాలం విహార్‌లోని జిలే సింగ్ కాలనీలో షేరు అనే వరుడు స్వీటీ అనే వధువును వివాహం చేసుకున్నాడు. భారతీయ వివాహ సంప్రదాయాల ప్రకారం  వివాహం  ఘనంగా ఆచారాలకు తగ్గట్టు తల్లిదండ్రులు నిర్వహించారు. ఇరుగుపొరుగు వారందరూ ప్రేమగా ఆనందంతో పెళ్లిలో పాల్గొన్నారు. వరుడి తల్లి స్వయంగా కల్యాణ మండపాన్ని అలంకరించారు. అందులో వింత ఏముంది అని అనుకుంటున్నారా..?  షేరు-స్వీటీ అంటే మనుషులు కాదు కుక్కలు.

ఇవి కూడా చదవండి

స్వీటీ తల్లి సవిత మాట్లాడుతూ.. ‘నా భర్త గుడి సమీపంలోని కుక్కలకు నిత్యం ఆహారం ఇచ్చేవాడు. ఒకరోజు అతను ఇంటికి వస్తుండగా ఒక కుక్క అతనిని అనుసరించింది. ఎలాగూ మాకు పిల్లలు లేరు. అప్పటి నుంచి ఆ కుక్క స్వీటీ మా కూతురైంది.స్వీటీకి పెళ్లి చేయాలనుకున్నారు. పక్క ఇంట్లో షేరు అనే మగ కుక్క ఉండేది. తల్లిదండ్రులకు పెళ్లి ప్రపోజ్ చేయగా అందుకు వాళ్ళు అంగీకరించారు. చివరకు నాలుగు రోజుల్లో పెళ్లికి ఏర్పాట్లు చేశాం అని తెలిపింది. అలాగే ‘ఈ పెళ్లి చేసినందుకు పోలీసులు మమ్మల్ని జైలుకు తీసుకెళ్తారని కొందరు అన్నారు. కానీ అలాంటి సమస్యే రాలేదు. మాకు పిల్లలు లేరు. మా ఆనందానికి మూలం స్వీటీ. స్వీటీ పెళ్లి విషయంలో మేం కూడా సంతోషంగా ఉన్నాం అని చెప్పుకొచ్చింది.

వరుడు షేరు తల్లి మణిత మాట్లాడుతూ ‘షేరు మాతో కలిసి జీవించడం ప్రారంభించి ఎనిమిదేళ్లు అవుతోంది. అతను మా కొడుకు లాంటి వాడు. స్వీటీతో పెళ్లి ప్రపోజల్ రావడంతో ఒప్పుకున్నాం. అందరితో కలిసి ఆనందంగా జరుపుకోవాలని నిర్ణయించుకున్నాం. దాని ప్రకారం సంప్రదాయ పద్ధతిలో పెళ్లికి కావాల్సిన అన్ని ఏర్పాట్లు చేశాం.

ఈ పెళ్లికి 100 మందిని ఆహ్వానించారు. 25 పెళ్లి పత్రికలను కూడా ముద్రించిన ఆహ్వానాలు ,ఆన్‌లైన్ ఆహ్వానాలు కూడా పంపారు. ఈ వివాహాన్ని ఇరుగుపొరుగున కొందరు స్వాగతించగా మరికొందరు వ్యతిరేకించారు. కానీ కుక్క తల్లిదండ్రులుగా, ఇతరుల అభిప్రాయం మాకు ముఖ్యం కాదు. అనుకున్నది చేశామని సంతోషిస్తున్నాం అని అన్నారు.

మరిన్ని ట్రెండింగ్ వీడియో వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ఏపీ ఇంటర్‌ అడ్వాన్సుడ్‌ సప్లిమెంటరీ 2024 పరీక్షల షెడ్యూల్‌
ఏపీ ఇంటర్‌ అడ్వాన్సుడ్‌ సప్లిమెంటరీ 2024 పరీక్షల షెడ్యూల్‌
దిన ఫలాలు (ఏప్రిల్ 26, 2024): 12 రాశుల వారికి ఇలా..
దిన ఫలాలు (ఏప్రిల్ 26, 2024): 12 రాశుల వారికి ఇలా..
SRH vs RCB: చెల్లుకు చెల్లు.. ప్రతీకారం తీర్చుకున్న బెంగళూరు..
SRH vs RCB: చెల్లుకు చెల్లు.. ప్రతీకారం తీర్చుకున్న బెంగళూరు..
మిచెల్ మార్ష్ స్థానంలో సీమ్ బౌలర్ ఆగయా.. ఢిల్లీ భారీ స్కెచ్..
మిచెల్ మార్ష్ స్థానంలో సీమ్ బౌలర్ ఆగయా.. ఢిల్లీ భారీ స్కెచ్..
అందం ఈమెతో పోటీకి రావడానికి కూడా భయపడుతుంది.. ఓడిపోతానేమో అని..
అందం ఈమెతో పోటీకి రావడానికి కూడా భయపడుతుంది.. ఓడిపోతానేమో అని..
ఆస్ట్రేలియా క్రికెటర్‌ను డామినేట్ చేసిన మహేష్‌..
ఆస్ట్రేలియా క్రికెటర్‌ను డామినేట్ చేసిన మహేష్‌..
పోకిరి సినిమాలో నటించిన ఈ అమ్మడు.. ఇప్పుడు అందాలతో..
పోకిరి సినిమాలో నటించిన ఈ అమ్మడు.. ఇప్పుడు అందాలతో..
తెలంగాణలో మరో ఎమ్మెల్సీ ఎన్నికకు గ్రీన్ సిగ్నల్.. పూర్తి షెడ్యూల్
తెలంగాణలో మరో ఎమ్మెల్సీ ఎన్నికకు గ్రీన్ సిగ్నల్.. పూర్తి షెడ్యూల్
ఈ వయ్యారి కట్టడం వల్ల ఆ చీరకె అందం వచ్చిందేమో.. తాజా లుక్స్ వైరల్
ఈ వయ్యారి కట్టడం వల్ల ఆ చీరకె అందం వచ్చిందేమో.. తాజా లుక్స్ వైరల్
రోజూ ఉదయాన్ని ఈ వాటర్‌ తాగండి.. ప్రయోజనాలు తెలిస్తే షాకవుతారు
రోజూ ఉదయాన్ని ఈ వాటర్‌ తాగండి.. ప్రయోజనాలు తెలిస్తే షాకవుతారు