Buffalo Died: హెలికాప్టర్ ‘శబ్దం’ కారణంగా నా గేదె చనిపోయింది.. పైలట్‌పై ఫిర్యాదు చేసిన రైతు..
రాజస్థాన్‌లో ఆదివారం ఓ వింత కేసు వెలుగులోకి వచ్చింది. బల్బీర్ అనే వ్యక్తి పోలీస్ స్టేషన్‌లో విచిత్రమైన కేసు పెట్టాడు. హెలికాప్టర్ చేసిన శబ్ధం వల్లే ఎద్దు చనిపోయిందని ఆ వ్యక్తి పేర్కొన్నాడు.
దేశంలో దాదాపు ప్రతిరోజూ అనేక విచిత్రమైన సంఘటనలు జరుగుతూనే ఉన్నాయి. లోకంలో ఎన్నో వింతలను మనం చూస్తుంటాం. కొన్నిసార్లు మనల్ని నవ్విస్తాయి. రాజస్థాన్‌లో ఓ వృద్ధుడు చేసిన పని ఇప్పుడు సోషల్ మీడియాను కుదిపేస్తున్నాడు. అతనిది అమాయకత్వం అని అంతా నవ్వుకుంటున్నారు. ఇంతకీ ఆ వృద్ధుడు ఏం చేశాడో తెలిస్తే మీరు కూడా అదే అంటారు. హెలికాప్టర్ చేసిన పెద్ద శబ్దం వల్ల తన గేదె చనిపోయిందని రాజస్థాన్‌కు చెందిన ఓ రైతు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అల్వార్ జిల్లా బహ్‌రోడ్ నియోజకవర్గ ఎమ్మెల్యే బల్జీత్ యాదవ్ తన గ్రామానికి వస్తున్నారని.. అతనికి ఘన స్వాగతం పలికేందుకు భారీ ఏర్పాట్లు చేశారు కార్యకర్తలు. అతని రాక సందర్భంగా హెలికాప్టర్ ద్వారా తమ ప్రియమైన నాయకుడిపై పూల వర్షం కురిపించాలనుకున్నారు. అనుకున్నట్లుగానే ఆదివారం హెలికాప్టర్ నుంచి ఎమ్మెల్యేపై పూల వర్షం కురిపించారు. మాలిక్ బల్బీర్ హెలికాప్టర్ 10 అడుగుల ఎత్తు నుంచి పూలవర్షం కురిపిస్తోంది . అయితే ఇక్కడి వరకు అంతా సాఫీగా జరిగిపోయింది.
ఇదే సమయంలో ఆ హెలికాప్టర్ బహ్‌రోడ్ ప్రాంతంలో కొంతసేపు చక్కర్లు కొట్టింది. అనంతరం కోహ్రానా అనే గ్రామం మీదుగా వెళ్లింది. అయితే ఆ హెలికాప్టర్ తక్కువ ఎత్తులో వెళ్లడం వల్ల.. చాలా పెద్దగా శబ్దం వచ్చింది. దీనివల్ల ఆ చుట్టుపక్కల వాళ్లు కొంచెం ఇబ్బందిపడ్డారు.
ఆ హెలికాప్టర్ చేసిన శబ్ధం వల్లే తన గేదె చనిపోయిందని హెలికాప్టర్ నడిపిన పైలట్‌పై ఏకంగా పోలీసులకే ఫిర్యాదు చేశాడు బల్వీర్ అనే వృద్ధుడు. దీని విలువ సూమారు రూ.1.5 లక్షల వరకు ఉంటుందని ఫిద్యాదులో పేర్కొన్నాడు. దీనిపై స్పందించిన పోలీసులు పరీక్ష నిమిత్తం గేదెను వెటర్నిటీ ఆస్పత్రికి తరలించారు. టెస్ట్‌ల అనంతరం గేదె ఎందుకు చనిపోయిందో తెలుస్తుందని, అప్పుడు కేసు నమోదు చేస్తామని పోలీసులు చెప్పారు. పరీక్ష చేసిన తర్వాతే చెప్పగలమని వైద్యులు అంటున్నారు. నిజంగా హెలిక్టాప్టర్ శబ్ధం వల్లే గేదె చనిపోతే మాత్రం రూ.1.5 లక్షల నష్టపరిహారం చెల్లించాల్సి ఉంటుంది.
మరిన్ని జాతీయ వార్తల కోసం