మరో మారు కంపించిన భూమి.. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 6.1గా నమోదు..హడలెత్తిపోయిన ప్రజలు
నేపాల్‌లోని సిలాంగ్ నగరానికి మూడు కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం ఉందని, అయితే దాని ప్రకంపనలు భారత్, చైనా, నేపాల్‌లో కనిపించాయని సంబంధిత అధికారి ఒకరు తెలిపారు.
గత కొన్ని రోజులుగా జపాన్, నేపాల్, భారతదేశం సహా పరిసర ప్రాంతాలలో వరుస భూ ప్రకంపనలు భయపెడుతున్నాయి. జపాన్‌లో సోమవారం మరోసారి భూమి కంపించింది. దాంతో స్థానికంగా తీవ్ర భయానక వాతావరణం నెలకొంది. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 6.1గా నమోదైంది. తోబాకు ఆగ్నేయంగా 84 కిలోమీటర్ల దూరంలో భూకంపం సంభవించింది. మధ్యాహ్నం 1.38 గంటల ప్రాంతంలో భూకంపం సంభవించింది. ఈ విషయాన్ని యునైటెడ్ స్టేట్స్ జియోలాజికల్ సర్వే ధృవీకరించింది.
అంతకుముందు,నవంబర్12న నేపాల్‌లో 5.4 తీవ్రతతో భూకంపం సంభవించింది. ఢిల్లీ, జాతీయ రాజధాని ప్రాంతం (ఎన్‌సిఆర్) నుండి ఉత్తరాఖండ్ వరకు ప్రకంపనలు వచ్చాయి. ఉత్తరాఖండ్‌లోని పితోర్‌గఢ్‌కు తూర్పు-ఆగ్నేయ దిశగా 101 కిలోమీటర్ల దూరంలో భూకంపం సంభవించింది. ఈ మేరకు అధికారులు సమాచారం అందించారు. నేషనల్ ఎర్త్‌క్వేక్ మానిటరింగ్ అండ్ రీసెర్చ్ సెంటర్ ఆఫ్ నేపాల్ అధికారులు తెలిపిన వివరాల మేరకు..భూకంపం కేంద్రం బజాంగ్ జిల్లాలోని పటాడబుల్ వద్ద 10 కిలోమీటర్ల లోతులో 29.28 డిగ్రీల ఉత్తరం, రేఖాంశం 81.20 డిగ్రీల తూర్పున ఉంది. వారం వ్యవధిలో నేపాల్‌లో భూకంపం సంభవించడం ఇది మూడోసారి. అయితే ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని తెలిసింది.
An earthquake with a magnitude of 6.1 on the Richter Scale hit 84 km South Southeast of Toba, Japan today at 13:38:26 UTC: USGS pic.twitter.com/tYyNbBhGkI
— ANI (@ANI) November 14, 2022
ఇది ఖాట్మండుకు పశ్చిమాన 460 కిలోమీటర్ల దూరంలో ఉన్న బజాంగ్ జిల్లాలో రాత్రి 7.57 గంటలకు రావడంతో ప్రజలు భయంతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్‌లోని ఇతర జిల్లాలు, పశ్చిమ ఉత్తరప్రదేశ్‌లోని బిజ్నోర్, ముజఫర్‌నగర్, షామ్లీలలో భూకంపం సంభవించింది. దాదాపు 10 సెకన్ల పాటు భూమి కంపించినట్టుగా నోయిడా నివాసితులు చెప్పారు.
అంతకుముందు, శనివారం సాయంత్రం 4:15 గంటలకు ఉత్తరాఖండ్‌లో 3.4 తీవ్రతతో భూకంపం సంభవించింది. దాని కేంద్రం పౌడి గర్వాల్ ప్రాంతంలో ఉంది. నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ డేటా ప్రకారం, ఉత్తరాఖండ్-నేపాల్ సరిహద్దుకు ఆనుకుని ఉన్న హిమాలయ ప్రాంతంలో నవంబర్ 8, 12 మధ్య కనీసం ఎనిమిది భూకంపాలు సంభవించాయి. నేపాల్‌లోని సిలాంగ్ నగరానికి మూడు కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం ఉందని, అయితే దాని ప్రకంపనలు భారత్, చైనా, నేపాల్‌లో కనిపించాయని పితోర్‌ఘర్ విపత్తు నిర్వహణ అధికారి బిఎస్ మహర్ తెలిపారు.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి