World Diabetes Day 2022: పీసీఓఎస్, మధుమేహం ఉన్న మహిళల్లో సంతానలేమి..?
నవంబర్ 14న ప్రపంచ మధుమేహ దినోత్సాన్ని నిర్వహించుకుంటున్నారు. మధుమేహం ఎంతో మందిని వెంటాడుతోంది. ఈ డయాబెటిస్ మహిళల్లో కూడా ..
నవంబర్ 14న ప్రపంచ మధుమేహ దినోత్సాన్ని నిర్వహించుకుంటున్నారు. మధుమేహం ఎంతో మందిని వెంటాడుతోంది. ఈ డయాబెటిస్ మహిళల్లో కూడా వ్యాపిస్తోంది. దీని కారణంగా వారిలో సంతనలేమి సమస్య తలెత్తుతుంటుంది. మధుమేహం అనేది రక్తంలో గ్లూకోజ్‌ని విచ్ఛిన్నం చేయడంలో శరీరం అసమర్థత కారణంగా శరీరంలో చేరడం జరుగుతుంది. శరీరం ఇన్సులిన్ అనే హార్మోన్‌కు నిరోధకతను కలిగి ఉండటం వలన ఇది పెరుగుతుంది. ఇన్సులిన్ నిరోధకత మహిళల్లో ఆరోగ్యకరమైన పునరుత్పత్తి పనితీరుకు అవసరమైన హార్మోన్ల అసమతుల్యతతో దగ్గరి సంబంధం కలిగి ఉంటుంది. దీని ద్వారా పీసీఓఎస్ ప్రమాద కారకాన్ని గణనీయంగా పెంచుతుంది. పీసీఓఎస్, మధుమేహం రెండూ మహిళల్లో వంధ్యత్వానికి సంబంధించినవి. అలాంటి వ్యక్తులు సహజంగా గర్భం దాల్చడం సవాలుగా మారుతుంది.
వయస్సు గల స్త్రీలలో మధుమేహం ఉండటం వారు గర్భం దాల్చే అవకాశం 17 శాతం తగ్గుతుందని పరిశోధకులు చెబుతున్నారు. దీని వల్ల వారి ఋతు చక్రం పూర్తిగా ముగిసే వయస్సును వేగవంతం చేస్తుంది. మధుమేహం ఉన్న స్త్రీలు అనేక సమస్యలను ఎదుర్కొంటారు. మధుమేమం ఉన్న స్త్రీలు సక్రమంగా పీరియడ్స్ రాకపోవడం, పీరిడయ్స్‌లో సమస్యలను ఎదుర్కొంటారు. మధుమేహం అండాశయం వృద్ధాప్య రేటును కూడా వేగవంతం చేస్తుంది. అంటే వారిలో ఉండే అండాలు మరింత క్షీణించి పిల్లలు పుట్టే అవకాశం తగ్గుతుంది. ఇది సహజంగా గర్భం దాల్చే అవకాశాలు తగ్గించేలా చేస్తుంది. అలాగే గర్భస్రావం, ప్రసవంలో ఇబ్బందులు తలెత్తుతాయి.
గర్భం దాల్చడంలో సమస్యలు!
మహిళల్లో పీసీఓఎస్, మధుమేహం అనేక ఆరోగ్య ప్రమాదాలను కలిగిస్తాయి. అండాశయాలలో తిత్తులు ఏర్పడటం వలన మగ టెస్టోస్టెరాన్ హార్మోన్, ల్యూటినైజింగ్ హార్మోన్ (ఎల్‌హెచ్), ఈస్ట్రోజెన్ స్థాయిలు పెరగడంతో హార్మోన్ల అసమతుల్యత ఏర్పడుతుంది. ఫోలికల్-స్టిమ్యులేటింగ్ హార్మోన్ (ఎఫ్‌ఎస్‌హెచ్) స్థాయిలలో కూడా గణనీయమైన తగ్గుదల ఉంది. ఇవి క్రమరహిత ఋతు చక్రంకు దోహదపడే కొన్ని అంశాలు. అంతేకాకుండా, క్రమరహిత ఋతు చక్రం అండోత్సర్గము సమయం సక్రమంగా లేదని సూచిస్తుంది. పీసీఓఎస్ ఉన్న స్త్రీలలో, అండోత్సర్గము సమయంలో అండం విడుదల చేయబడదు. ఫలదీకరణం లేనప్పుడు గర్భం సంభవించదు.
పీసీఓఎస్ అంటే ఏంటి?
చాలా మంది మహిళలు పీసీఓస్ బారిన పడుతున్నారు. పాలిసిస్టిక్ ఒవరియన్ సిండ్రోమ్‌కు రూపమే పీసీఓఎస్. అంశాశయంలో చిన్న నీటి బుడగల్లాంటివి ఏర్పడటం అవాంఛిత రోమాలు, నెలసరి సక్రమంగా రాకపోవడం, సంతానలేమి వంటివి లక్షణాలు పీసీఓఎస్‌లో ఉంటాయి.
పీసీఓఎస్, మధుమేహం ఉన్న స్త్రీలు తమ శరీర బరువు పెరిగే అవకాశం ఉంటుంది. దీని కారణంగా గుండెకు సంబంధించిన వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంటుంది. అధిక రక్తపోటు, కొన్ని సందర్భాల్లో ఎండోమెట్రియల్ క్యాన్సర్ లాంటివి వస్తుంటాయి. మధుమేహం, పీసీఓఎస్ కారణంగా బరువు పెరగడం, సంతాన లేమి సమస్యలు తలెత్తుతాయి. పీసీఓఎస్ ఉన్నవారికి టైప్ 2 డయాబెటిస్, అధిక రక్తపోటు, గుండె సమస్యలు, ఎండోమెట్రియల్ క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉందని వైద్యులు చెబుతున్నారు.
జీవనశైలిలో మార్పులు..
ఈ సమస్యలతో బాధపడుతున్న వారు వైద్యులను సంప్రదించి చికిత్స తీసుకోవడం మంచిది. అంతేకాకుండా జీవనశైలిలో మార్పులు చేసుకోవాలి. బరువు తగ్గడం, పోషకాలు ఉన్న ఆహారం తీసుకోవడం, క్రమం తప్పకుండా వ్యాయామాలు చేయడం లాంటివి పీసీఓఎస్‌ను అదుపులో ఉంచుతాయి.
(నోట్: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణుల సలహాలు, సూచనల మేరకు అందించడం జరుగుతుంది. ఏవైనా సందేహాలు ఉంటే నిపుణులను సంప్రదించండి.)