World Diabetes Day: నేడు ప్రపంచ మధుమేహ దినోత్సవం.. దీనిని ఎందుకు జరుపుకొంటారు? తీసుకోవాల్సిన ఆహారాలు ఏమిటి?

ఈ రోజుల్లో డయాబెటిస్‌ వారు పెరిగిపోతున్నారు. మారుతున్న జీవనశైలి కారణంగా చాలా మందిని డయాబెటిస్‌ వెంటాడుతోంది. మధుమేహం అనేది నేడు..

World Diabetes Day: నేడు ప్రపంచ మధుమేహ దినోత్సవం.. దీనిని ఎందుకు జరుపుకొంటారు? తీసుకోవాల్సిన ఆహారాలు ఏమిటి?
జొన్న రొట్టె వల్ల మీ బ్లడ్ షుగర్ లెవెల్ కంట్రోల్ అవుతుంది. జొన్నలో డైటరీ ఫైబర్ ఉంది. అంతే కాకుండా ఇందులో ఉండే ప్రొటీన్లు, మెగ్నీషియం శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడంతో పాటు బ్లడ్ షుగర్ లెవెల్ ను కంట్రోల్ చేస్తుంది.
Follow us
Subhash Goud

|

Updated on: Nov 14, 2022 | 9:46 AM

ఈ రోజుల్లో డయాబెటిస్‌ వారు పెరిగిపోతున్నారు. మారుతున్న జీవనశైలి కారణంగా చాలా మందిని డయాబెటిస్‌ వెంటాడుతోంది. మధుమేహం అనేది నేడు ప్రతి రెండవ మూడవ వ్యక్తిని ప్రభావితం చేసే వ్యాధి. దీనికి ప్రధాన కారణాలలో ఆహారం, జీవనశైలి. డయాబెటిస్ ఇప్పుడు పిల్లల నుండి పెద్దల వరకు అన్ని వయసుల వారిని వేదిస్తోంది. మధుమేహంలో ప్రధానంగా రెండు రకాలు ఉన్నాయి. టైప్ 1 డయాబెటిస్, టైప్ 2 డయాబెటిస్. టైప్ 1 డయాబెటిస్ అనేది ఒక రకమైన జన్యుపరమైన రుగ్మత, ఇది ఒక తరం నుండి మరొక తరానికి వ్యాపిస్తుంది. అయితే టైప్ 2 డయాబెటిస్ మీ జీవనశైలి, చెడు అలవాట్ల కారణంగా వస్తుంది. ఒకసారి మధుమేహం వచ్చిదంటే దానిని పూర్తిగా నిర్మూలించలేని పరిస్థితి. జీవనశైలి మార్పులు చేసుకోవడం, ఆహార అలవాట్లను మార్చుకోవడం తప్ప వేరే మార్గం లేదనే చెప్పాలి.

అయితే నవంబర్‌ 14న ప్రపంచ మధుమేహ దినోత్సవాన్ని జరుపుకొంటాము. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) ప్రకారం మధుమేహం కారణంగా ప్రతి సంవత్సరం లక్షలాది మంది రోగులు మరణిస్తున్నారు. ఈ వ్యాధిపై ప్రజల్లో అవగాహన పెంచడం చాలా అవసరం. ఈ వ్యాధి గురించిన ప్రజల్లో అవగాహన పెంచేందుకు మధుమేహ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. ఈ వ్యాధిని నివారించడానికి జీవనశైలిలో మార్పులు, మంచి ఆహారం, శారీరక శ్రమ చాలా ముఖ్యం.

ప్రపంచ ఆరోగ్య సంస్థ మద్దతుతో అంతర్జాతీయ మధుమేహ సమాఖ్య 1991లో ఈ దినోత్సవాన్ని ప్రతిపాదించగా, 2006 నుండి అధికారికంగా పాటిస్తున్నారు.మధుమేహంతో బాధపడుతున్నవారు కొన్నింటిని తీసుకోవడం వల్ల అదుపులో పెట్టుకోవచ్చంటున్నారు వైద్య నిపుణులు.

ఇవి కూడా చదవండి
  1. సిట్రస్ పండ్లు: నారింజ, నిమ్మకాయలు వాటి తాజాదనం, పుల్లని రుచికి ప్రసిద్ధి చెందాయి. అమెరికన్ డయాబెటిస్ అసోసియేషన్ ప్రకారం.. సిట్రస్ పండ్లలో పొటాషియం, ఫోలేట్, ఆరోగ్యకరమైన ఫైబర్‌లు ఉంటాయి. ఇవి రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడతాయి.
  2. పెరుగు: మీకు మధుమేహం ఉంటే మీ ఆహారంలో పెరుగును చేర్చుకోండి. హార్వర్డ్ స్కూల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ (హెచ్‌ఎస్‌పిహెచ్) పరిశోధకులు నిర్వహించిన ఒక అధ్యయనంలో పెరుగు తీసుకోవడం వల్ల మధుమేహం ముప్పు తగ్గుతుందని తేలింది. ఇందులో క్యాల్షియం, ప్రొటీన్లు కూడా పుష్కలంగా ఉండటం వల్ల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.
  3. చియా విత్తనాలు: చియా విత్తనాలు బరువు తగ్గడంలో సహాయపడే ప్రభావవంతమైన సూపర్‌ఫుడ్‌గా చెప్పబడుతున్నాయి. చియా విత్తనాలు కూడా మధుమేహాన్ని నియంత్రించడంలో మీకు సహాయపడతాయని నిపుణులు సూచిస్తున్నారు. వీటిలో యాంటీ ఆక్సిడెంట్లు, ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్, మెగ్నీషియం, ఫైబర్ ఉంటాయి. ఈ పోషకాలు మధుమేహం, దాని సంబంధిత సమస్యలను తగ్గించడంలో సహాయపడతాయి.
  4. డ్రై ఫ్రూట్స్: ఇందులో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉంటాయి. అలాగే మధుమేహం వాపు, రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించడంలో సహాయపడుతుంది.
  5. ధాన్యాలు: మీ ఆహారంలో బార్లీ, ఓట్స్ వంటి తృణధాన్యాలు చేర్చుకోండి. మీ బ్లడ్ షుగర్ పెరగకుండా నిరోధిస్తుంది. తృణధాన్యాలు B విటమిన్లు, ఇనుము, ఖనిజాలతో సమృద్ధిగా ఉంటాయి. ఇవి చాలా ఉపయోగకరంగా ఉంటాయి.

(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణుల సలహాలు, సూచనల మేరకు అందించడం జరుగుతుంది. ఏవైనా సందేహాలు ఉంటే నిపుణులను సంప్రదించండి.)

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!