Health Tips: మధ్యాహ్నం భోజనం తిన్న వెంటనే నిద్ర వస్తోందా.? అయితే ఇలా చెక్ పెట్టొచ్చు..
చాలామందికి మధ్యాహ్నం భోజనం తిన్న వెంటనే నిద్ర వస్తుంది. కొందరికి అయితే కాసేపు పడుకుంటేనే గానీ..
చాలామందికి మధ్యాహ్నం భోజనం తిన్న వెంటనే నిద్ర వస్తుంది. కొందరికి అయితే కాసేపు పడుకుంటేనే గానీ.. హుషారు ఉండదు. ఇంతకీ అసలు అన్నం తిన్న వెంటనే ఎందుకు నిద్ర వస్తుంది.? వైద్య నిపుణులు ఏమన్నారంటే..? అన్నంలోని గ్లూకోజ్ రక్తంలో వేగంగా కలవడం వల్ల భోజనం చేసిన వెంటనే నిద్రమత్తుగా అనిపిస్తుందని నిపుణులు చెబుతున్నారు. అన్నంతో మెలటోనిన్, సెరటోనిన్ లాంటి ప్రశాంతతను కలగజేసే హార్మోన్లు విడుదలవుతాయని.. ఇవి ప్రశాంతతను, విశ్రాంతిని, మత్తును కలగజేస్తాయని అంటున్నారు. అన్నం మాత్రమే కాదని.. పలు రకాల పిండి పదార్ధాలతోనూ ఇలాగే అనిపిస్తుందన్నారు.
సహజంగా మధ్యాహ్నం వేళ మనలో శక్తి తగ్గుతుంది. దానికి అన్నం కూడా తోడవ్వడంతో నిద్ర వెంటనే ముంచుకొస్తుంది. అందుకే ప్రోటీన్లు, విటమిన్లు ఎక్కువగా ఉన్న ఆహారాన్ని తినడం మంచిది. అలా తినడం వల్ల డొపమైన్, ఎపినెఫ్రిన్ లాంటి చురుకైన రసాయనాలు మెదడు వేగాన్ని పెంచడమే కాదు.. శరీరానికి కావాల్సిన శక్తిని కూడా ఇస్తాయి.
మరిన్ని దీన్ని చెక్ పెట్టడం ఎలా..?
- మధ్యాహ్నం వేళ అన్నం తినాలంటే.. మాములు బియ్యం బదులుగా బాస్మతి బియ్యం వాడటం మంచిది. వీటిల్లో గ్లూకోజ్ త్వరగా రక్తంలో కలవదు. అంతేకాకుండా మధ్యాహ్నం సమయంలో అన్నం కొద్దిగా తినండి.
- జొన్న, సజ్జ, గోధుమ రొట్టెలు, కూరగాయలు, సలాడ్‌తో కలిపి చికెన్ తీసుకున్నా మీకు కడుపు నిండిన భావన కలుగుతుంది. నిద్రమత్తు అనిపించదు.
మరిన్ని లైఫ్‌స్టైల్ న్యూస్ కోసం..