Samosa: చలికాలపు సాయంత్రాలు.. వేడి వేడి టీ తో పాటు ఈ వెరైటీ సమోసాలనూ ఓ సారి ట్రై చేయండి..
భారతీయ సాంప్రదాయ వంటకాల్లో సమోసా గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఉదయమైనా, సాయంత్రమైనా వేడి వేడి టీ తో సమోసా తింటుంటే ఆహా.. ఆ హాయే వేరు. రుచికరమైన చిరుతిళ్లకు భారతీయ సంస్కృతికి అవినాభావ సంబంధం...
భారతీయ సాంప్రదాయ వంటకాల్లో సమోసా గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఉదయమైనా, సాయంత్రమైనా వేడి వేడి టీ తో సమోసా తింటుంటే ఆహా.. ఆ హాయే వేరు. రుచికరమైన చిరుతిళ్లకు భారతీయ సంస్కృతికి అవినాభావ సంబంధం ఉంది. ఇది మన రోజువారీ అలవాట్లలో ఒక ముఖ్యమైన భాగం. కచోరీ, వడ పావ్ మొదలైన దేశమంతటా ప్రసిద్ధి చెందిన వంటకాలు, ప్రాంతీయ వంటకాలు, స్ట్రీట్ ఫుడ్స్ కు మన దేశంలో కొదవ లేదు. కొన్ని ప్రాంతాలు ఆక్కడ లభించే ఆహార పదార్థాలతోనే ఫేమస్ అయ్యాయంటే అతిశయోక్తి కాదు. సమోసాలు దేశవ్యాప్తంగా అందరూ ఇష్టంగా తినే ఈవ్ నింగ్ స్నాక్ ఐటమ్. సమోసాను ఇష్టపడే వారందరూ వివిధ రకాలుగా సమోసాలను ట్రై చేస్తుంటారు. కొన్ని రకాల సమోసా వెరైటీలను ఇప్పుడు తెలుసుకుందాం.
చీజ్ చిల్లీ సమోసా.. చీజ్‌కి ఎవరూ నో చెప్పలేరు. సమోసాను చీజ్ తో కలిపి తింటుంటే ఆ కిక్కే వేరు. సాయంత్రం చిరుతిండి చీజీగా, స్పైసీగా ఉండాలని ఇష్టపడే వారందరికీ చీజ్ చిల్లీ సమోసా కంటే మెరుగైనది ఏమీ ఉండదు. ఇది దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో విస్తృతంగా అందుబాటులో ఉంది.
పంజాబీ ఆలూ సమోసా.. పంజాబీ ఆహారాన్ని ఇష్టపడేవారే కాకుండా సమోసా తినని వారు కూడా పంజాబీ ఆలూ సమోసా రుచి చూస్తే అస్సలు వదిలిపెట్టరు. పంజాబీ మసాలా దినుసులతో కూడిన ఈ పర్ఫెక్ట్ ఫ్యూజన్ సాయంత్రం టీ కోసం తయారైన అధ్భుతమైన స్నాక్.
కార్న్ మసాలా సమోసా.. మొక్కజొన్న చాలా కాలం నుంచి ప్రజలకు ఇష్టమైన చిరుతిండిగా ప్రాధాన్యం సంతరించుకుంది. ముఖ్యంగా చలికాలంలో మసాలా మొక్కజొన్నకు బాగా గిరాకీ ఉంటుంది. అయితే శరీరానికి కావాల్సిన దానికంటే ఎక్కువగా మసాలాలను తీసుకుంటే ఆరోగ్య సమస్యలు వస్తాయి. కాబట్టి కార్న్ మసాలా సమోసాను మితంగా తీసుకోవడం మంచిది.
సమోసా అభిమానులకు సాయంత్రం అల్పాహారం సమోసాలకు సంబంధించినది. వేయించిన సమోసాతో వేడి వేడి టీ.. అనే ఆలోచే సమోసా ప్రియులకు ఓ రకమైన ఆనందంలో పడేస్తుంది. ముఖ్యంగా చీజ్ చిల్లీ సమోసా, కధై పనీర్ సమోసా మొదలుకొని మసాలా కార్న్ సమోసా, వెజ్జీ సమోసా, పంజాబీ ఆలూ సమోసా వరకు అనేక రకాల సమోసాలు అందుబాటులోకి వస్తున్నాయి.
మరిన్ని లైఫ్‌స్టైల్ న్యూస్ కోసం..