Winter Health: చలికాలంలో ఆహారంలో ఈ మార్పులు చేసుకోండి.. ఆరోగ్య సమస్యలకు దూరంగా ఉండండి..
శీతాకాలం వచ్చేసింది. వెచ్చని దుప్పట్లలో దూరిపోయి.. బారెడు పొద్దెక్కేంత వరకు మంచం దిగాలనిపించని పరిస్థితులు వచ్చేశాయి. అయితే ఈ కాలంలో వేడి వేడి టీ, నూలు దుస్తులతో పాటు మన ఆహారపు అలవాట్లలోనూ...
శీతాకాలం వచ్చేసింది. వెచ్చని దుప్పట్లలో దూరిపోయి.. బారెడు పొద్దెక్కేంత వరకు మంచం దిగాలనిపించని పరిస్థితులు వచ్చేశాయి. అయితే ఈ కాలంలో వేడి వేడి టీ, నూలు దుస్తులతో పాటు మన ఆహారం పు అలవాట్లలోనూ కొంత మార్పులు చేసుకోక తప్పదు. కూరగాయల్లో ఉండే పోషకాలు, విటమిన్లు, ఖనిజాలు శరీరానికి అవసరమైన శక్తిని అందిస్తాయనే విషయం మనకు తెలిసిందే. అయితే శీతాకాలంలో ఫుడ్ విషయంలో చాలా అలర్ట్ గా ఉండాలి. జలుబు, దగ్గు, ఫ్లూ జ్వరాలు చాలా కామన్ కాబట్టి అవి పెరిగి తీవ్రమై ఇతర వ్యాధులకు దారి తీయకుండా చూసుకోవాల్సిన అవసరం మనపై ఉంది. కాబట్టి ఫుడ్ డైట్ లో సీజనల్ కూరగాయలు, పండ్లను భాగం చేసుకోవాలి. వీటి ద్వారా రోగనిరోధక శక్తిని అదుపులో ఉంచుకోవడంతో పాటు కీళ్ల నొప్పులు, జుట్టు రాలడం, చర్మ సమస్యలు వంటి వాటి నుంచి సేఫ్ గా ఉండవచ్చు.
గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్… పాలకూర, మెంతికూర, బచ్చలికూర, తోటకూర, బీట్‌రూట్ ఆకుకూరలు, క్యారెట్ ఆకులు, ముల్లింగి ఆకులు చలికాలంలో శరీరానికి వెచ్చదనాన్ని అందిస్తాయి. వీటిలో క్లోరోఫిల్ మాత్రమే కాకుండా విటమిన్లు ఏ, సీ, కే, ఈ, మెగ్నీషియం అధికంగా ఉంటాయి. ఫైటోన్యూట్రియెంట్‌లు, యాంటీ ఆక్సిడెంట్‌లు పుష్కలంగా ఉంటాయి. ఫైబర్ కంటెంట్ కూడా అధికంగా ఉంటుంది. ఇవి రోగనిరోధక వ్యవస్థను బలపరుస్తాయి. ఆహారపు అలవాట్ల వల్ల కలిగే ఫ్రీ రాడికల్స్ నష్టం నుంచి రక్షణ కల్పిస్తాయి. కాబట్టి ప్రతి వారం కనీసం రెండు వేర్వేరు ఆకు కూరలను తినేలా ప్లాన్ చేసుకోవాలి.
దుంపలు.. చలికాలంలో దుంపలు తినడం వల్ల మంచి ప్రయోజనాలు అందుతాయి. చిలగడదుంపల్లోని పిండి పదార్ధం, క్యారెట్ లోని బీటా-కెరోటిన్ ద్వారా శరీరానికి అవసరమైన పోషకాలు లభిస్తాయి. క్యారెట్ లో ఉండే విటమిన్ ఏ.. కళ్లను ఆరోగ్యంగా ఉంచుతుంది. రోగనిరోధక శక్తి, పెరుగుదల, అభివృద్ధిని పెంచుతుంది. ఇది యాంటీఆక్సిడెంట్ కెరోటినాయిడ్స్‌ను అధికంగా కలిగి ఉంది. అంతే కాకుండా దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. బీట్‌రూట్ లోని పొటాషియం, మెగ్నీషియం, విటమిన్ బీ6, ఏ, సీ, రక్తంలో చక్కెర స్థాయిని కంట్రోల్ లో ఉంచుతాయి.
క్యాబేజీ, కాలీఫ్లవర్, బ్రోకలీ, ముల్లంగి, మొలకలు వంటి విభిన్న కూరగాయల్లో ఫైబర్, విటమిన్లు, మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్లు అధికం. ఇవి అనారోగ్యానికి గురికాకుండా నిరోధిస్తాయి. మరీ ముఖ్యంగా ఇది మీ చెడు ఈస్ట్రోజెన్ స్థాయిలను తొలగించేందుకు సహాయపడతాయి. కాబట్టి చలికాలంలో ఆహార పదార్థాల్లో మార్పులు చేసుకోవడం మంచిది.
నోట్.. ఇందులో పేర్కొన్ని విషయాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. వీటిని పాటించేముందు నిపుణులు సలహాలు తీసుకోవడం ఉత్తమం.
మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి