Relationship Tips: ఎక్కడ నెగ్గాలో కాదు.. ఎక్కడ తగ్గాలో తెలుసుకోండి.. “సారీ” తో అపార్థాలను తొలగించుకోండి..
మానవులు సంఘ జీవి. సమాజంతో సన్నిహతంగా మెలగడం చాలా అవసరం. ఈ తరుణంలో తెలియని వారితో పరిచయాలు, కొత్త వారితో మాట్లాడాల్సిన అవసరం ఏర్పడుతుంది. అయితే మనకు ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే...
మానవుడు సంఘ జీవి. సమాజంతో సన్నిహతంగా మెలగడం చాలా అవసరం. ఈ తరుణంలో తెలియని వారితో పరిచయాలు, కొత్త వారితో మాట్లాడాల్సిన అవసరం ఏర్పడుతుంది. అయితే మనకు ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే అవతలి వారు చిన్నబుచ్చుకునే ప్రమాదం ఉంది. మాట్లాడేది వాస్తవాలే అయినా.. అవి అవతలి వారిని బాధించే అవకాశం లేకపోలేదు. కాబట్టి ఎవరితోనైనా సంభాషించే విధానంలో చాలా అలర్ట్ గా ఉండాలి. అహంకారంతో ఉండటం, తప్పులను అంగీకరించకపోవడం మంచి రిలేషన్ నూ దెబ్బ తీస్తుంది. తప్పులు చేయడం అనివార్యం. మనం చేసే చర్యలను అందరూ అంగీకరిచాలన్న రూలేం లేదు. మన మాటలు ఎదుటి వారిని బాధిస్తే.. వెంటనే ఆ డిస్కషన్ ను వెంటనే అక్కడితో ఆపేయడం మంచిది. అవతలి వారు బాధగా కనిపిస్తే వారికి సారీ చెప్పడం చాలా ముఖ్యం. ఎందుకు అలా మాట్లాడాల్సి వచ్చిందనే విషయాన్ని వివరించాలి. సారీ చెప్పడం చాలా సమస్యలకు చక్కటి పరిష్కారం చూపిస్తుంది. అయితే సారీ చెప్పడం విషయంలోనూ పలు జాగ్రత్తలు పాటించాలి.
సాధారణంగా చేసిన తప్పులను కప్పి పుచ్చుకునేందుకు చాలా మంది అబద్ధాలు చెబుతుంటారు. వాటిని నిజమని నమ్మించేందుకు మళ్లీ మళ్లీ అబద్ధాలు చెబుతుంటారు. చివరికి ఇది వారిపై ఉన్న నమ్మకాన్ని కోల్పోయేలా చేస్తుంది. తప్పులకు సాకులు చెప్పడం వల్ల పరిస్థితి మరింత దిగజారుతుంది. తప్పు చేస్తే చేశామని బాధ్యత వహించడం ముఖ్యం. ఇలా చేయడం ద్వారా మీతో తమను తాము వ్యక్తపరచడానికి బదులు మిమ్మల్ని ఓదార్చాల్సిన అవసరం ఉందని మీరు భావిస్తారు. అయితే సారీ చెప్పే సందర్భంలో “కానీ” అనే పదాన్ని ఉపయోగించవద్దు. ఇది మీ చర్యలను సమర్థించుకోవడానికి ప్రయత్నిస్తున్నారని సూచిస్తుంది. కొన్నిసార్లు వివరణ అవసరం. అటువంటి పరిస్థితుల్లో దానిని క్లుప్తంగా ఉంచి, మీ పొరపాటుకు అనుగుణంగా ఉండేలా చూసుకోవాలి.
అయితే.. ఎదుటి వారి పట్ల మీరు సరిగ్గా ప్రవర్తించారని భావిస్తే సారీ చేయకపోవడమే ఉత్తమం. ఎందుకంటే అది మీ భవిష్యత్ సంబంధాలపై ప్రభావం చూపే అవకాశం ఉంది. కష్టమైన మాటలను నివారించడానికి క్షమాపణ చెప్పకపోవడమే ఉత్తమం. సారీ చెప్పడం మంచి విషయమే. ఇది వారికి కొంత వరకు సాంత్వన కలిగిస్తుందనే విషయాన్ని మాత్రం ఎప్పుడూ మర్చిపోవద్దు.
మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి