Tesla Car: అన్నీ ఉన్నా బ్రేకులు లేకపోతే ఎలా.. వైరలవుతోన్న టెస్లా కారు వీడియో..

టెస్లా కార్.. దీని గురించి వినని కారు ప్రయాణికులు ఉండనే ఉండరు. అయితే ఇప్పుడు టెస్లా కారుకు సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట వైరల్‌గా మారింది. చైనా వీధులలో..

Tesla Car: అన్నీ ఉన్నా బ్రేకులు లేకపోతే ఎలా.. వైరలవుతోన్న టెస్లా కారు వీడియో..
Tesla Car
Follow us
శివలీల గోపి తుల్వా

|

Updated on: Nov 14, 2022 | 4:30 PM

టెస్లా కార్.. దీని గురించి వినని కారు ప్రయాణికులు ఉండనే ఉండరు. ఏదోక సమయంలో తప్పక అనుకునే ఉంటారు.. ‘ఆ కారు నా సొంతం అయితే ఎంత బాగుంటుందోన’ని. అయితే ఇప్పుడు టెస్లా కారుకు సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట వైరల్‌గా మారింది. చైనా వీధులలో.. బ్రేకులు ఫెయిలయిన టెస్లా మోడల్ వై కారు వేగంగా దూసుకువెళ్లి.. అదుపుతప్పినట్లు ఆ వీడియోలో తెలుస్తుంది. చైనాలోని గ్వాంగ్‌డాంగ్ ప్రావిన్సులో నవంబరు 5న ఈ ఘటన జరిగింది. ఈ ఘటనలో ఒక బైక్ రైడర్‌, ఓ చిన్నారి చనిపోయారు. చివరికి టెస్లా కారు వెళ్లి మరో భారీ వాహనాన్ని ఢీకోనడంతో ఆగింది.

చైనాలోని అతి పెద్ద మార్కెటింగ్ కంపెనీలలో టెస్లా కూడా ఒకటి కావడంతో.. ఈ ఘటనపై చైనా పోలీసులు ఇప్పటికే విచారణ చేపట్టారు. ఇందులో అమెరికాకు చెందిన ఈవీ మేకర్ కూడా సహకరిస్తోంది. కారు అదుపు తప్పడానికి కారణమేమిటో ఇంకా తెలియలేదని, ఇంటి ముందు ఉన్న షాపు నుంచి కారును తీస్తున్నప్పుడు ఈ ఘటన జరిగిందని కారులో ఉన్న వ్యక్తి కుటుంబ సభ్యులు తెలిపారు. దీనిపై టెల్సా కంపెనీ ‘ కారు వేగంగా వెళ్తున్నప్పుడు బ్రేక్ లైట్లు పనిచేయవు. ఇంకా కారును ఆపేందుకు బ్రేక్ మీద కాలు వేసినట్లు డాటాలో కనిపించడంలేద’ని తెలిపింది.

కాగా, టెల్సా కారులో బ్రేకింగ్ సమస్యలు ఉన్నట్లు అనేక సందర్భాలలో తేలింది. గత ఏడాది షాంఘైకు చెందిన ఓ వ్యక్తి.. తన టెస్లా కారుకు బ్రేకులు సరిగా పనిచేయకపోవడంతో ప్రమాదానికి గురయ్యానని, దీనిపై టెస్లా కంపెనీ ఎలాంటి చర్య తీసుకోవడంలేదని సోషల్ మీడియాలో రచ్చ రచ్చ చేశాడు.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే
అత్యున్నత ప్రమాణాలతో అమరావతి.. మరిన్ని పనులకు గ్రీన్ సిగ్నల్
అత్యున్నత ప్రమాణాలతో అమరావతి.. మరిన్ని పనులకు గ్రీన్ సిగ్నల్
సంధ్యా థియేటర్ తొక్కిసలాట కేసు.. అల్లు అర్జున్‌కు మళ్లీ నోటీసులు
సంధ్యా థియేటర్ తొక్కిసలాట కేసు.. అల్లు అర్జున్‌కు మళ్లీ నోటీసులు