Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Fatima Sana Shaikh: అలాంటి వ్యాధితో బాధపడుతున్న దంగల్‌ నటి.. ప్రజల్లో అవగాహన కోసం ప్రచారం

దంగల్‌ మూవీలో నటించిన ఫాతిమా సనా షేక్..గత కొంతకాలంగా తీవ్రమైన వ్యాధితో బాధపడుతున్నారు. ప్రముఖ బాలీవుడ్‌ నటుడు అమీర్‌ఖాన్‌ నటించిన 'దంగల్‌' సినిమాలో ఫాతిమా నటించారు. ఈ సినిమాలో ఆమె నటనకు మంచి గుర్తింపు లభించింది.

Fatima Sana Shaikh: అలాంటి వ్యాధితో బాధపడుతున్న దంగల్‌ నటి.. ప్రజల్లో అవగాహన కోసం ప్రచారం
Fatima Sana Shaikh
Follow us
Jyothi Gadda

|

Updated on: Nov 14, 2022 | 6:17 PM

బాలీవుడ్ నటి, ఫేమస్‌ దంగల్‌ మూవీలో నటించిన ఫాతిమా సనా షేక్..గత కొంతకాలంగా మూర్ఛ వ్యాధితో బాధపడుతున్నారు. ఈ విషయాన్ని నటి తాజాగా సోషల్ మీడియాలో వెల్లడించింది. తాను చాలా కాలంగా మూర్ఛ వ్యాధితో బాధపడుతున్నట్లు బాలీవుడ్‌ నటి ఫాతిమా సనా షేక్ స్వయంగా తెలిపారు. మెడికేషన్‌ సహాయంతో ఇప్పుడు తన పరిస్థితి అదుపులో ఉందని స్పష్టం చేసింది దంగల్‌ నటి. నేషనల్‌ ఎపిలెప్సీ అవేర్‌నెస్‌ నెలలో భాగంగా ఇన్‌స్టాగ్రామ్‌స్టోరీ ద్వారా అడిగిన ప్రశ్నలకు ఫాతిమా సనా సమాధానంగా తన ఆరోగ్య పరిస్థితిని వివరించారు. ‘దంగల్’ సినిమాతో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టిన నటి ఫాతిమా సనా షేక్‌కు మూర్ఛ వ్యాధి వచ్చింది. ఆమె మందులు, వ్యాయామం ద్వారా ఈ వ్యాధిని ఎదుర్కొంటున్నానని చెప్పారు.

దంగల్‌ షూటింగ్‌లో మొదటిసారి మూర్ఛ వ్యాధి నిర్ధారణ అయింది. ఒకసారి శిక్షణలో ఉన్నప్పుడు ఆమెకు మూర్ఛ వచ్చింది. తాను అపస్మారక స్థితిలో ఆస్పత్రిలో చేరినట్టుగా తెలిపారు. ఐదేళ్లుగా తాను వ్యాధిని అంతగా పట్టించుకోలేదని చెప్పారు. కానీ, ఇప్పుడు మరింత జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి నెలకొందని ఫాతిమా సనా అన్నారు. అయితే, అంతా మామూలుగానే ఉంటుంది. కానీ, కాస్త నిరసం, అలసట ఎక్కువగా ఉంటుందని చెప్పారు. చాలా కష్టమైన రోజులు కూడా గడిపినట్టుగా చెప్పారు. ఇది తన రోజువారి కార్యకలాపాలపై తీవ్రప్రభావం చూపిందన్నారు. ప్రతిష్టాత్మక, ప్రముఖులతో కలిసి పనిచేయడం తన అదృష్టం అన్నారు ఫాతిమా. నా కోరికలు, ఆకాంక్షలను ప్రభావితం చేయలేదు. నటనలో అత్యుత్తమ ప్రతిభ కనబరచడంలో నేను రాజీ పడాల్సిన అవసరం లేదన్నారు. ఇది మరింత కష్టపడి పనిచేయడానికి తనను ప్రేరేపించిందని ఫాతిమా ధీమా వ్యక్తం చేశారు.

సినిమా దర్శకులకు కూడా ఈ వ్యాధి గురించిన విషయం దాచిపెట్టలేదని చెప్పారు. ప్రతి ప్రాజెక్ట్‌కు సంతకం చేసే ముందు, నిర్మాతలకు తన అనారోగ్య సమస్య గురించి ముందుగానే తెలియజేస్తానని ఫాతిమా సనా పేర్కొన్నారు. ఇదిలా ఉండగా, ఓ అభిమాని అడిగిన ప్రశకు ఆమె స్పందిస్తూ.. మూర్ఛరోగుల వద్ద బూట్ల వాసన వస్తుందనేది కేవలం ఒక అపోహన మాత్రమేనని స్పష్టం చేశారు. మూర్ఛ మానసికంగా ఎక్కువ ఒత్తిడికి లోనప్పుడు ఎక్కుసార్లు వస్తుందని చెప్పారు.

ఇవి కూడా చదవండి

అయితే, మూర్ఛవ్యాధికి మందులు 70 నుండి 80 శాతం వరకు సహాయపడతాయంటున్నారు డాక్టర్లు(Dr Aditya S Chowti). మందుల ద్వారా వైద్యం చేయలేని వారికి శస్త్ర చికిత్సలే మార్గంగా చెబుతున్నారు. అయితే, శస్త్రచికిత్స అనేది చాలా ప్రత్యేకమైన మూర్ఛ వ్యాధిలో మాత్రమే సాధ్యమన్నారు. ఇక్కడ మనం మూల కారణాన్ని కనుగొనవలసి ఉంటుందని చెప్పారు. ప్రత్యేక వీడియో EG, ప్రత్యేక MRI వంటి టెస్టులు ఉంటాయి. వాటి ద్వారానే మూర్ఛకు సరైన కారణాలను కనిపెట్టగలమన్నారు.

డాక్టర్ చౌతీ మాట్లాడుతూ, “కొందరు ఈ రకమైన శస్త్రచికిత్సను చివరి ప్రయత్నంగా భావించినప్పటికీ, ఇది కాలక్రమేణా ఔషధాలకు ఆచరణీయమైన ప్రత్యామ్నాయంగా మారిందన్నారు డాక్టర్‌ చౌతీ. ముఖ్యంగా మూర్ఛ వ్యాధిని నియంత్రించడంలో విఫలమైనప్పుడు, ఔషధాల దుష్ప్రభావాలు రోగికి ప్రతికూల ప్రభావం చూపిస్తుందన్నారు. కొన్ని రకాల మూర్ఛ వ్యాధికి బహిరంగ ఆపరేషన్ ప్రమాదకరం అయినప్పుడు, MRI-గైడెడ్ స్టీరియోటాక్టిక్ లేజర్ అబ్లేషన్ వంటి మినిమల్లీ ఇన్వాసివ్ టెక్నిక్‌లు ఉపయోగకరమైన చికిత్సగా వారు వెల్లడించారు.

కాగా, ప్రముఖ బాలీవుడ్‌ నటుడు అమీర్‌ఖాన్‌ నటించిన ‘దంగల్‌’ సినిమాలో ఫాతిమా నటించారు. ఈ సినిమాలో ఆమె నటనకు మంచి గుర్తింపు లభించిన సంగతి తెలిసిందే.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి