AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మహిళకు జిమ్‌ ట్రైనర్‌ వేధింపులు.. మాట వినకపోతే కూతురిని కిడ్నాప్‌ చేస్తానంటూ బెదిరింపులు.. చివరకు..

నిందితులు చాలాసార్లు కాల్‌ చేశారని బాధిత మహిళ ఫిర్యాదులో పేర్కొంది. ఒకసారి తానే వారి కాల్‌కు ఆన్సర్‌ ఇవ్వగా నిందితుడు తనను కలవమని అడిగాడు. అయితే, అందుకు నిరాకరించిన మహిళ..

మహిళకు జిమ్‌ ట్రైనర్‌ వేధింపులు.. మాట వినకపోతే కూతురిని కిడ్నాప్‌ చేస్తానంటూ బెదిరింపులు.. చివరకు..
Harassment
Jyothi Gadda
|

Updated on: Nov 14, 2022 | 7:25 PM

Share

ఓ మహిళపై లైంగిక వేధింపులకు పాల్పడిన జిమ్ ట్రైనర్‌ను పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఈ ఘటన ముంబైలోని కొలాబాలో చోటు చేసుకుంది. నివేదికల ప్రకారం.. 29 ఏళ్ల జిమ్‌ శిక్షకుడిపై ఒక మహిళ ఫిర్యాదు చేయడంతో వేధింపులు, బెదిరింపు ఆరోపణలపై పోలీసులు అతన్ని అరెస్ట్‌ చేశారు. ఫిర్యాదు చేసిన మహిళకు ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు.అయితే, జిమ్‌ట్రైనర్‌ వైభవ్‌ కస్బేకర్‌ తనను వేధింపులకు గురిచేస్తున్నట్టుగా ఆరోపిస్తూ.. ఆమె పోలీసులను ఆశ్రయించింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు వైభవ్‌ని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

బాధితులు తెలిపిన వివరాల ప్రకారం..బాధిత మహిళ తన కుటుంబంతో కలబాలో ఉంటున్నారు. స్థానికంగా వడా-పావ్‌ స్టాల్‌ నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ఈ క్రమంలోనే నిందితుడు వైభవ్‌ కస్బేకర్‌ మొదటిసారి జూన్‌ 2021లో తమ స్టాల్‌ను సందర్శిచినట్టుగా పోలీసులకు చెప్పింది. ఆర్డర్లు ఇవ్వడానికి అతను తన మొబైల్‌ నంబర్‌ను అడిగాడని ఆమె పేర్కొంది. అయితే, తాను తన భర్త నెంబర్‌ ఇచ్చానని చెప్పింది. నిందితులు చాలాసార్లు కాల్‌ చేశారని బాధిత మహిళ ఫిర్యాదులో పేర్కొంది. ఒకసారి తానే వారి కాల్‌కు ఆన్సర్‌ ఇవ్వగా నిందితుడు తనను కలవమని అడిగాడు. అయితే, అందుకు నిరాకరించిన మహిళ.. పోలీసులకు ఫిర్యాదు చేస్తానని హెచ్చరించినట్టుగా చెప్పింది.

అయితే, ఈ క్రమంలోనే నవంబర్‌ 12శనివారం రోజున నిందితుడు సరారీ తమ ఇంటికే వచ్చాడని చెప్పింది. తనను ఎలాగైనా కలవాలని, తన మాట వినకపోతే, తన కుమార్తెను కిడ్నాప్‌ చేస్తానని బెదిరించినట్టుగా బాధితులు ఫిర్యాదులో పేర్కొంది. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

ఇవి కూడా చదవండి

మరిన్నిక్రైం న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us
ముంబైపై ఘన విజయం.. ప్లేఆఫ్ రేస్‌లోకి కేకేఆర్ ఎంట్రీ..!
ముంబైపై ఘన విజయం.. ప్లేఆఫ్ రేస్‌లోకి కేకేఆర్ ఎంట్రీ..!
భానుడి భగభగలు..! ఎండల్లో ఎలాంటి డ్రింక్స్ తాగాలి? వేటికి దూరంగా..
భానుడి భగభగలు..! ఎండల్లో ఎలాంటి డ్రింక్స్ తాగాలి? వేటికి దూరంగా..
సోషల్ మీడియా స్టార్ కుర్చీతాత హఠాన్మరణం.. ఏం జరిగిందంటే?
సోషల్ మీడియా స్టార్ కుర్చీతాత హఠాన్మరణం.. ఏం జరిగిందంటే?
2026లో కెరీర్ గ్రోత్ కోసం హైదరాబాద్ టాప్ 10 కంపెనీలు ఇవే..
2026లో కెరీర్ గ్రోత్ కోసం హైదరాబాద్ టాప్ 10 కంపెనీలు ఇవే..
పిడుగురాళ్లలో 47.6, నిర్మల్‌లో 46.5 డిగ్రీలు.. సూరీడుతో జాగ్రత్త
పిడుగురాళ్లలో 47.6, నిర్మల్‌లో 46.5 డిగ్రీలు.. సూరీడుతో జాగ్రత్త
ఊరు పెరిగింది.. జనాభా పెరిగింది.. ట్రాఫికర్ మాత్రం షేమ్‌టుసేమ్
ఊరు పెరిగింది.. జనాభా పెరిగింది.. ట్రాఫికర్ మాత్రం షేమ్‌టుసేమ్
ఒకే FDలో మొత్తం డబ్బు పెట్టేస్తున్నారా? తప్పు చేస్తున్నట్లే!
ఒకే FDలో మొత్తం డబ్బు పెట్టేస్తున్నారా? తప్పు చేస్తున్నట్లే!
పెరుగు బాగా పులిసిపోయిందా? పారేయకండి.. ఈ 4 వంటకాలతో పాటు మీ ఇళ్లు
పెరుగు బాగా పులిసిపోయిందా? పారేయకండి.. ఈ 4 వంటకాలతో పాటు మీ ఇళ్లు
సమ్మర్‌ స్పెషల్ హెల్తీ బ్రేక్‌ఫాస్ట్‌..ఈ గులాబీ రంగు ఇడ్లీలు ట్రై
సమ్మర్‌ స్పెషల్ హెల్తీ బ్రేక్‌ఫాస్ట్‌..ఈ గులాబీ రంగు ఇడ్లీలు ట్రై
రోజుకు 2 అరటిపండ్లు తింటే ఏం జరుగుతుంది..? పెద్ద కథే ఇది..
రోజుకు 2 అరటిపండ్లు తింటే ఏం జరుగుతుంది..? పెద్ద కథే ఇది..