Yoga: ఈ ఆసనాలు చేస్తే.. దెబ్బకు పొట్టలో కొవ్వు సులభంగా కరిగిపోతుంది..
మనం చేసే వృత్తి మనలో ఎన్నో ఆరోగ్య సమస్యలకు కారణమవుతాయి. సాధారణంగా ఎక్కువుగా కుర్చీలో కూర్చుని.. డెస్క్ వద్ద పనిచేయడం వల్ల పొట్టలో కొవ్వు పెరిగిపోతుంది. దీనిని తగ్గించుకోవడానికి ఎన్నో అవస్థలు..
Health News: మనం చేసే వృత్తి మనలో ఎన్నో ఆరోగ్య సమస్యలకు కారణమవుతాయి. సాధారణంగా ఎక్కువుగా కుర్చీలో కూర్చుని.. డెస్క్ వద్ద పనిచేయడం వల్ల పొట్టలో కొవ్వు పెరిగిపోతుంది. దీనిని తగ్గించుకోవడానికి ఎన్నో అవస్థలు పడతాం. వ్యాయామం, ఆసనాలు చేయడం ద్వారా పొట్టలో కొవ్వు తగ్గించుకోవచ్చని తెలిసినా.. అవి చేయడానికి మన శరీరం సహకరించదు. కాని కొంతకష్టమైనా.. కొన్ని ఆసనాలు చేస్తే సులభంగా పొట్టలో కొవ్వును కరిగించుకోవచ్చు అంటున్నారు యోగా నిపుణులు. ఎంతో సులభమైన ఆసనాలతో తక్కువ టైంలో ఎక్కువ రిజల్ట్స్ పొందే ఆసనాలు ఏంటో తెలుసుకుందాం..
నౌకాసనం: నేలపై లేదా చాపపై కూర్చని చేతులను నిటారుగా ఉంచి బాగా ఊపిరి పీల్చుకోవాలి. అప్పుడు నెమ్మదిగా కాలును 45 డిగ్రీల వరకు పైకి లేపాలి. మిగిలిన శరీరాన్ని నిటారుగా ఉంచుతూ కూర్చోవాలి. చేతులను నిటారుగానే ఉంచాలి. దీనినే బోటింగ్ అని కూడా అంటారు. తర్వాత శ్వాస వదులుతూ కాళ్లను నెమ్మదిగా కిందకి దించాలి. దీని వల్ల పొట్ట దగ్గర ఉండే కొవ్వు వేగంగా తగ్గుతుంది. మొదట్లో ఈఆసనం వేయడం కష్టం అనిపించినా.. ఒకటి రెండు రోజులు సాధనం చేస్తే తర్వాత ఈజీగా ఈఆసనం వెయ్యొచ్చు.
భుజంగాసనం: చాపపై బోర్లా పడుకోవాలి. తర్వాత చేతులపై బరువు ఆన్చి శరీరం పై భాగాన్ని ఎత్తాలి. కాళ్లు నిటారుగా ఉంచి.. కాలి వేళ్లు చాపను తాకేలా ఉంచాలి. పైభాగాన్ని పైకి ఎత్తేటప్పుడు గాలి పీల్చుకోవాలి. ఆతర్వాత క్రమం తప్పకుండా శ్వాస తీసుకోవాలి. ఇలా ఓ 30 నిమిషాల పాటు చేసి యథాస్థితికి రావొచ్చు.
కుంభాసనం: చాప మీద బోర్లా పడుకోవాలి. అరికాళ్లు, మోచేతులపై బరువు ఆన్చి శరీరాన్ని పైకి లేపాలి. వీలైనంత ఎక్కువ సేపు ఈప్లాంక్ స్థితిలో ఉండవచ్చు. ఇది పొట్ట దగ్గర కొవ్వు తగ్గించడంలో ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది.
ఉస్త్రాసనం: ముందుగా మోకరిల్లి, ఎడమ మడమను ఎడమ చేతితో పట్టుకోవడానికి ప్రయత్నించాల.తలను నెమ్మదిగా వెనక్కి వంచి.. పొట్ట సాగేలా చూసుకోవాలి. తర్వాత కుడి చేతితో కుడి మడమను పట్టకోవాలి. వీలైనంత సేపు ఈ ఆసనం చేయ్యొచ్చు.
ధనురాసనం: చాప మీద బోర్లా పడుకోవాలి. అప్పుడు కాళ్లను వెనక నుంచి పైకి లేపడానికి ప్రయత్నించాలి. ముందు శరీర భాగాన్ని లేపుతూ.. చేతులతో కాళ్లను పట్టుకుని బరువు మొత్తం పొట్టపై పడేలా చేయాలి. ఈఆసనం పొట్టవద్ద కొవ్వును కరిగించడానికి దోహదపడుతుంది.
మరిన్ని హెల్త్ వార్తల కోసం చూడండి..