Mineral Water Making: మినరల్ వాటర్ ని కొంటున్నారా.. ఇకపై అవసరం లేదు ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోవచ్చు!!
మధ్య తరగతి, ధనవంతులు అనే తేడా లేకుండా ఇప్పుడు అందరూ మినరల్ వాటరే తాగుతున్నారు. డైరెక్ట్ గా నల్లా నుంచి వచ్చే నీళ్లు కలుషితంగా ఉంటున్నాయని, అవి తాగితే జబ్బులు వస్తాయని.. చాలా మంది బయట నుంచి మినరల్ వాటర్ ని కొని తెచ్చుకుంటారు. ప్రయాణాలు చేసినప్పుడు కూడా మినరల్ వాటర్ కే ప్రిఫరెన్స్ ఇస్తున్నారు. మినరల్ వాటర్ తాగడం మంచిదే. కానీ వాటిని బయటకు వెళ్లి కొనాల్సి వస్తుంది. అదేదో మీరే ఇంట్లోని మినరల్ వాటర్ ని తయారు చేసుకుని..
మధ్య తరగతి, ధనవంతులు అనే తేడా లేకుండా ఇప్పుడు అందరూ మినరల్ వాటరే తాగుతున్నారు. డైరెక్ట్ గా నల్లా నుంచి వచ్చే నీళ్లు కలుషితంగా ఉంటున్నాయని, అవి తాగితే జబ్బులు వస్తాయని.. చాలా మంది బయట నుంచి మినరల్ వాటర్ ని కొని తెచ్చుకుంటారు. ప్రయాణాలు చేసినప్పుడు కూడా మినరల్ వాటర్ కే ప్రిఫరెన్స్ ఇస్తున్నారు. మినరల్ వాటర్ తాగడం మంచిదే. కానీ వాటిని బయటకు వెళ్లి కొనాల్సి వస్తుంది. అదేదో మీరే ఇంట్లోని మినరల్ వాటర్ ని తయారు చేసుకుని తాగవచ్చు. అదెలాగో ఇప్పుడు చూద్దాం.
మినరల్ వాటర్ కి కావాల్సిన పదార్థాలు:
ఒక లీటర్ మినరల్ వాటర్, ఎప్సమ్ సాల్ట్, పొటాషియం బైకార్బోనేట్, బేకింగ్ సోడా, సోడా సిఫోన్.
మినరల్ వాటర్ తయారీ విధానం:
మినరల్ వాటర్ తయారీకి ముందు శుభ్రంగా క్లీన్ చేసిన గాజు లేదా ప్లాస్టిక్ కంటైనర్స్ ని తీసుకోండి. ఇందులో ఫిల్టర్ చేసిన నీటిని ఒక లీటర్ వేయాలి. ఆ తర్వాత తగిన మోతాదులో నీటిని నింపండి. ఇప్పుడు అందులో 1/8 టీ స్పూన్ ఎప్సమ్ సాల్ట్, 1/8 టీ స్పూన్ పొటాషియం బైకార్బోనేట్, 1/8 టీ స్పూన్ బేకింగ్ సోడా, చిటికెడు సోడా సిఫోన్ వేసి బాగా కలుపుకోవాలి. అంతే మినరల్ వాటర్ సిద్ధం. ఇంట్లోనే ఈజీగా ఇలా తయారు చేసుకోవచ్చు. బయట మినరల్ వాటర్ టేస్ట్ ఉన్నట్టే ఇవి కూడా ఉంటాయి.
ప్రయోజనాలు:
– నీటిని తాగడం వల్ల శరీంలోని ఎలక్ట్రోలైట్ స్థాయిల్ని మెరుగు పడతాయి. – బాడీని హైడ్రేట్ చేస్తుంది. – గుండెని ఆరోగ్యంగా ఉంటుంది. – విరోచనాలు, అజీర్ణం, ఉబ్బరం, గుండెల్లో మంట వంటి సమస్యలను తగ్గిస్తాయి.
కాగా ఇప్పుడంటే మినరల్ వాటర్ వచ్చాయి కానీ.. పూర్వం వాటర్ ని రాగి పాత్రల్లో ఉంచుకుని తాగేవారు. రాగి పాత్రల్లో నీటిని తాగడం వల్ల హెల్దీగా ఉండేవాళ్లు. రాగిలో ఉండే ఆరోగ్యకరమైన పోషకాలు నీటిలోని మలినాలను, విష పదార్థాలు నశింపచేసేవి. అలాగే కాచి చల్లార్సిన నీటిని తాగేవారు. వాతావరణం మారినప్పుడల్లా నీటిని వేడుచేసుకుని.. చల్లారాక తాగేవారు. ఇలా చేయడం వల్ల నీటిలో ఉండే కలుషితాలు, బ్యాక్టీరియా నశించిపోతాయి.
మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
గమనిక: ఇది నిపుణుల నుంచి సేకరించిన సమాచారం. దీన్ని ఫాలో అయ్యే ముందు ఒకసారి వైద్యుల్ని సంప్రదించడం మేలు.