Parenting Tips: అర్థరాత్రి సడన్ గా నిద్రలో మీ పిల్లలు ఏడుస్తున్నారా? కారణాలు ఇవేనా తెలుసుకోండి!

చిన్న పిల్లలు ఉన్న ఇంట్లో నిద్రలు ఉండవు. మూడు సంవత్సరాల లోపు పిల్లలు ఉంటే ఇక అంతే సంగతులు. ఇళ్లంతా గందర గోళం చేస్తూంటారు. వారికి చెప్పినా ఏమీ అర్థం కాదు. వారి ఆటలు వారివి. ఇలా పగలంతా బాగానే ఉన్న పిల్లలు.. రాత్రుళ్లు మాత్రం సరిగ్గా పడుకోరు. రాత్రుళ్లు చాలా మంది పిల్లలు సడన్ గా నిద్రలో నుంచి లేచి ఏడుస్తూంటారు. వాళ్లకు ఏమో మాటలు సరిగ్గా రావు. కారణం చెప్పలేరు. మనకు కూడా అర్థం కాదు.. కడుపులో నొప్పి, గ్యాస్, చెవిపోటు, దోమలు కుట్టడం..

Parenting Tips: అర్థరాత్రి సడన్ గా నిద్రలో మీ పిల్లలు ఏడుస్తున్నారా? కారణాలు ఇవేనా తెలుసుకోండి!
Child Sleep
Follow us

|

Updated on: Sep 21, 2023 | 3:13 PM

చిన్న పిల్లలు ఉన్న ఇంట్లో నిద్రలు ఉండవు. మూడు సంవత్సరాల లోపు పిల్లలు ఉంటే ఇక అంతే సంగతులు. ఇళ్లంతా గందర గోళం చేస్తూంటారు. వారికి చెప్పినా ఏమీ అర్థం కాదు. వారి ఆటలు వారివి. ఇలా పగలంతా బాగానే ఉన్న పిల్లలు.. రాత్రుళ్లు మాత్రం సరిగ్గా పడుకోరు. రాత్రుళ్లు చాలా మంది పిల్లలు సడన్ గా నిద్రలో నుంచి లేచి ఏడుస్తూంటారు. వాళ్లకు ఏమో మాటలు సరిగ్గా రావు. కారణం చెప్పలేరు. మనకు కూడా అర్థం కాదు.. కడుపులో నొప్పి, గ్యాస్, చెవిపోటు, దోమలు కుట్టడం, ఆకలి.. ఇలా దేని గురించో తెలీదు. దీంతో పేరెంట్స్ కూడా ఏం జరిగిందో అని గాబరా పడుతూంటారు. అర్థరాత్రుళ్లు గాఢ నిద్రలో ఉండగా పిల్లలు ఏడిస్తే.. ఏం చేయాలో కూడా అర్థం కాదు. అయితే పలు అధ్యయనాల ప్రకారం.. 30 శాతం మంది పిల్లలు నిద్ర లేమి సమస్యలతో.. రాత్రుళ్లు ఏడుస్తూంటారని తేలింది. పిల్లల్లో నిద్రలేమి సమస్యకు కారణాలు ఏంటో తెలుసుకుందాం.

పగటి పూట ఎక్కువగా నిద్రపోవడం:

నిద్ర లేమి సమస్యలతో బాధ పడే పిల్లలు.. సాధారణంగా రాత్రి కంటే పగలే ఎక్కువగా నిద్ర పోతారు. అలాగే మరికొంత మంది అర్థరాత్రి దాటాక నిద్ర అవుతూ ఉంటారు. ఇంకొందరు నిద్రలో సడన్ గా లేచి ఏడుస్తూంటారు. అయితే పగలు కూడా పదే పదే నిద్ర పోవడం కూడా మంచి అలవాటు కాదని అంటున్నారు.

ఇవి కూడా చదవండి

పీడ కలలు:

పెద్దల మాదిరిగానే చిన్న పిల్లలకు కూడా పీడ కలలు వస్తూంటాయి. కానీ ఆ విషయం మనకు తెలీదు. దీంతో అర్థరాత్రుళ్లు నిద్రలోనుంచి లేచి ఏడుస్తూంటారు. పిల్లలకు వచ్చే పీడ కలలు కూడా వారి నిద్రను ప్రభావితం చేస్తూంటాయి. దీంతో వారు రాత్రుళ్లు పడుకోవడానికి ఇబ్బంది పడుతూంటారు. ఇది కాస్త వారికి అనారోగ్య సమస్యలను తెచ్చి పెడతాయి.

గురక:

కొంత మంది పిల్లలు నిద్రలో గురక పెడుతూంటారు. గురక ఎందుకు వస్తుందంటే.. శ్వాస కోశ ఇన్ ఫెక్షన్స్ వల్ల కానీ, టాన్సిల్స్, ముక్కుల కఫం ఉండటం వల్ల కానీ పిల్లలకు గురక వస్తుంది. వీటి వల్ల కూడా పిల్లలు సరిగ్గా నిద్ర పోకపోవచ్చు.

కండరాల ఒత్తిడి:

కండరాల ఒత్తిడి, శ్వాస ఆడకపోవడం, చెమట పట్టడం వంటి సమస్యల కారణంగా కూడా కొంత మంది పిల్లలు సరిగ్గా నిద్రపోరు. దీంతో అర్థరాత్రులు సడన్ గా నిద్ర లేచి కేకలు వేయడం లేదా ఏడుస్తూంటారు.

ఇలా పిల్లలు నిద్రపోలేకపోవడానికి అనేక కారణాలు ఉంటాయి. అప్పుడప్పుడు పర్వాలేదు కానీ.. ఇలా కంటిన్యూ పిల్లులు నిద్రలో ఏడుస్తూ ఉంటే వెంటనే వైద్యుల్ని సంప్రదించడం మేలు.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

గమనిక: ఇది నిపుణుల నుంచి సేకరించిన సమాచారం. దీన్ని ఫాలో అయ్యే ముందు ఒకసారి వైద్యుల్ని సంప్రదించడం మేలు.