Weight Loss Tips: వర్క్ ఫ్రం హోం వల్ల బరువు పెరుగుతున్నారా..? అయితే ఈ విషయాలు మీరు తెలుసుకోవల్సిందే.. లేదంటే అంతే సంగతులు
Weight Loss Tips: కరోనా పుణ్యమా అని ఉద్యోగులందరికి వర్క్ ఫ్రం హోమ్ అలవాటైంది. ఇంట్లో ఉండే సరికి ఏదిపడితే అది తినేసి అధికంగా
Weight Loss Tips: కరోనా పుణ్యమా అని ఉద్యోగులందరికి వర్క్ ఫ్రం హోమ్ అలవాటైంది. ఇంట్లో ఉండే సరికి ఏదిపడితే అది తినేసి అధికంగా బరువు పెరుగుతున్నారు. ఆ తర్వాత అనర్థాలను కొని తెచ్చుకుంటున్నారు. పెరిగిన బరువు తగ్గించుకోవడానికి జిమ్‌ల చుట్టూ తిరుగుతున్నారు. ఇది నేటి ఉద్యోగుల పరిస్థితి. అయితే ఈ సమస్యకు వైద్య నిపుణులు చక్కటి పరిష్కార మార్గం చూపిస్తున్నారు. ఇవి పాటిస్తే చాలు అధిక బరువు నుంచి తప్పించుకోవచ్చు. అవేంటో ఇప్పుడు చూద్దాం.
శారీరక శ్రమ లేకపోతే బరువు పెరగడంతో పాటు జీవనశైలికి సంబంధించిన వ్యాధులైన బీపీ, షుగరు, హై కొలెస్ట్రాల్ సమస్యల బారిన పడే అవకాశం లేకపోలేదు. ఇంటి నుంచి పని చేసేప్పుడు ఆహారం విషయంలో కొన్ని నియమాలు పాటించాలి. ఓ సమయం నిర్ధారించుకుని కేవలం అప్పుడు మాత్రమే ఆహారం తీసుకోండి. ఊసుపోక, బోర్ కొట్టి తినే అలవాటు మానుకోవాలి. ఆఫీసు పని కానీ, టీవీలు, ఫోనులు చూస్తూ తింటే ఎక్కువగా భోంచేసే ప్రమాదం ఉంది.
అలాగే పండ్లు, గింజలు లాంటి ఆరోగ్యకరమైన స్నాక్స్ తప్ప బిస్కెట్స్, వేయించిన చిరుతిళ్ళు, స్వీట్స్‌ను అందుబాటులో పెట్టుకోకూడదు. పిల్లలకు కూడా పాలు, పండ్లు, మొలకెత్తిన ఉడికించిన గింజలతో చేసిన చాట్, ఆమ్లెట్, సూప్స్ స్నాక్స్‌గా ఇవ్వాలి తప్ప జంక్ ఫుడ్స్ వద్దు. శారీరక శ్రమ తక్కువగా ఉన్నప్పుడు క్యాలోరీలు కూడా తగ్గించకపోతే నెమ్మదిగా బరువు పెరుగుతారు. వర్క్ ఫ్రమ్ హోం చేసేప్పుడు ఆఫీసు ప్రయాణాలు తగ్గుతాయి. కాబట్టి రోజూ కనీసం 30 నిమిషాలైనా వ్యాయామం తప్పనిసరిగా చేయాలి. ఇలా చేసి మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి.