Copper Water Bottle: రాగి వాటర్ బాటిల్ ఇలా క్లీన్ చేస్తే బ్యాక్టీరియా దరి చేరదు!
సాధారణంగా అందరూ ఎక్కువగా ఉపయోగించే లోహాల్లో రాగి, ఇత్తడి కూడా పాత్రలు ఉంటాయి. ఇది వరకు వీటి వినియోగం తగ్గినా.. మళ్లీ ఇప్పుడు ఆరోగ్యం మీద శ్రద్ధతో వీటి వినియోగం పెరిగింది. అయితే ఇప్పుడు ఎక్కువగా అందరూ రాగి వాటర్ బాటిల్స్‌ను ఉపయోగిస్తున్నారు. రాగిలో నిల్వ చేసిన వాటర్ తాగడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. అందుకే వీటి కొనుగోలు, వినియోగం రెండూ పెరిగాయి. ఎక్కడికి వెళ్లినా రాగి వాటర్ బాటిల్‌ను తీసుకెల్తున్నారు. రాగి పాత్రలో నిల్వ చేసిన నీటిని తాగడం వల్ల..

సాధారణంగా అందరూ ఎక్కువగా ఉపయోగించే లోహాల్లో రాగి, ఇత్తడి కూడా పాత్రలు ఉంటాయి. ఇది వరకు వీటి వినియోగం తగ్గినా.. మళ్లీ ఇప్పుడు ఆరోగ్యం మీద శ్రద్ధతో వీటి వినియోగం పెరిగింది. అయితే ఇప్పుడు ఎక్కువగా అందరూ రాగి వాటర్ బాటిల్స్‌ను ఉపయోగిస్తున్నారు. రాగిలో నిల్వ చేసిన వాటర్ తాగడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. అందుకే వీటి కొనుగోలు, వినియోగం రెండూ పెరిగాయి. ఎక్కడికి వెళ్లినా రాగి వాటర్ బాటిల్‌ను తీసుకెల్తున్నారు. రాగి పాత్రలో నిల్వ చేసిన నీటిని తాగడం వల్ల శరీరానికి చాలా మంచిది పోషకాహార నిపుణులు కూడా చెబుతున్నారు.
రోగ నిరోధక శక్తి పెరుగుతుంది..
రాగి బాటిల్స్‌లోని నీటిని తాగడం వల్ల శరీరంలో రోగ నిరోధక శక్తి కూడా పెరుగుతుంది. నీటిని రాగి పాత్రలో నిల్వ చేయడం వల్ల బ్యాక్టీరియా, వైరన్, మలినాలు, క్రిములు వంటివి ఏమైనా ఉంటే నశిస్తాయి. నీరు స్వచ్ఛంగా తయారవుతుంది. ఇలాంటి నీరు తాగితే.. ఆరోగ్యానికి చాలా మంచిది. శరీరంలో ఇమ్యూనిటీ లెవల్స్, ఎనర్జీ లెవల్స్ పెరిగి ఇతర అనారోగ్య సమస్యలు దరి చేరకుండా ఉంటాయి.
రాగి పాత్రలపై నలుపు పోగొట్టడం చాలా కష్టం..
ఇక్కడి వరకూ బాగానే ఉన్నా.. రాగి పాత్రలను వినియోగిస్తే.. అవి నల్లగా మారిపోతాయి. అలాగే బాటిల్స్ ను ఎక్కువగా వాడటం వల్ల అడుగున పాచి పేరుకుపోతూ ఉంటాయి. సాధారణ బాటిల్స్‌ను సులభంగా క్లీన్ చేసుకోవచ్చు కానీ.. రాగి బాటిల్స్ పై ఉండే నలుపు పోగొట్టడం మాత్రం కష్టంతో కూడుకున్న పనే అని చెప్పొచ్చు. వాడటానికి సులభంగా ఉన్నా.. వీటిని శుభ్రం చేయాలంటే కాస్త సమయం వెచ్చించాల్సిందే. ఇలా నలుపుగా ఉన్న రాగి వాటర్ బాటిల్స్‌ను కొన్ని చిట్కాలు పాటించి క్లీన్ చేసుకోవచ్చు. బాటిల్స్ ను తళతళమని మెరిపించవచ్చు.
వెనిగర్, ఉప్పుతో మెరిపించవచ్చు..
రాగి బాటిల్స్‌ను శుభ్రం చేసుకోవాలంటే వెనిగర్, ఉప్పు కావాలి. వెనిగర్‌లో కాస్త ఉప్పు వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని బాటిల్ లోపల, బయట వేసి పది నిమిషాల పాటు అలానే ఉంచి శుభ్రం చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల రాగి బాటిల్స్ శుభ్ర పడటమే కాకుండా.. తెల్లగా మెరుస్తాయి. అలాగే నిమ్మ రసాన్ని ఉపయోగించడం వల్ల కూడా రాగా బాటిల్స్ చాలా బాగా శుభ్ర పడతాయి.
మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
గమనిక: ఇది నిపుణులు, అధ్యయనాల నుంచి సేకరించిన సమాచారం. అవగాహన కోసం మాత్రమే ఈ కథనం. ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్నా వైద్యులను సంప్రదించడం మేలు.








