High Cholesterol Symptoms: మీ కాలు, చేతుల వేళ్లల్లో ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా? అయితే మీరు అధిక కొలెస్ట్రాల్‌ సమస్యతో బాధపడుతున్నట్టే..!

అధిక కొలెస్ట్రాల్ సాధారణంగా సైలెంట్ కిల్లర్‌గా పిలుస్తారు. ఎందుకంటే ఇది చాలా అరుదుగా హెచ్చరిక సంకేతాలను పంపిస్తుంది. క్రమేపి శరీరానికి చాలా నష్టం చేకూరుస్తుంది. అయితే చాలా అరుదుగా కనిపించే లక్షణాల్లో చేతి వేళ్లు, కాలి వేళ్లు తరచూ గమినిస్తూ ఉంటే అధిక కొలెస్ట్రాల్ లక్షణాలను తెలుసుకోవచ్చు.

High Cholesterol Symptoms: మీ కాలు, చేతుల వేళ్లల్లో ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా? అయితే మీరు అధిక కొలెస్ట్రాల్‌ సమస్యతో బాధపడుతున్నట్టే..!
Cholesterol Control Tips
Follow us
Srinu

|

Updated on: Feb 26, 2023 | 4:30 PM

సాధారణంగా మన శరీరం బాగా పని చేయాలంటే ఓ రకమైన కొలెస్ట్రాల్ కచ్చితంగా అవసరం. అయితే రక్తంలో అధిక కొలెస్ట్రాల్ ఉండడం ఆరోగ్యానికి హానికరం. ఆహారంలో కొవ్వు పదార్థాలను ఎక్కువగా చేర్చుకోవడం, వ్యాయామం చేయకపోవడం, పొగ, ఆల్కహాల్, అధిక బరువు వంటి కారణాల వల్ల శరీరంలో కొలెస్ట్రాల్ పేరుకుపోతుంది. అధిక కొలెస్ట్రాల్ సాధారణంగా సైలెంట్ కిల్లర్‌గా పిలుస్తారు. ఎందుకంటే ఇది చాలా అరుదుగా హెచ్చరిక సంకేతాలను పంపిస్తుంది. క్రమేపి శరీరానికి చాలా నష్టం చేకూరుస్తుంది. అయితే చాలా అరుదుగా కనిపించే లక్షణాల్లో చేతి వేళ్లు, కాలి వేళ్లు తరచూ గమినిస్తూ ఉంటే అధిక కొలెస్ట్రాల్ లక్షణాలను తెలుసుకోవచ్చు. వినడానికి కొంచెం కొత్తగా అది నిజం. కాళ్లు, చేతుల వేళ్లల్లో అధిక కొలెస్ట్రాల్ లక్షణాలు కనిపిస్తాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. కాళ్లు, చేతి వేళ్లల్లో గమనించాల్సిన లక్షణాలు ఏంటో ఓ సారి తెలుసుకుందాం.

అధిక కొలెస్ట్రాల్ సూచనలు

  • అధిక కొలెస్ట్రాల్ స్థాయిల వల్ల ఫలకాలు ఏర్పడడం, కాళ్ళలో రక్త ప్రవాహానికి అంతరాయం కలిగించడం వల్ల కాళ్లల్లో నొప్పి మొదలవుతుంది. నడకలో నొప్పి మరింత  తీవ్రమవుతుంది.
  • అరచేతులు, మోచేతులు, పిరుదులపై పసుపు రంగు నిక్షేపాలు పెరగడం గమనించవచ్చు.
  • అధిక కొలెస్ట్రాల్‌తో బాధపడుతున్న వ్యక్తి చర్మంపై పసుపు రంగులో నిక్షేపాలను చూడవచ్చు, ప్రధానంగా కంటి, అరచేతి, దిగువ కాళ్ళ వెనుక ఈ లక్షణాలను గమనించవచ్చు.
  • కొలెస్ట్రాల్ స్థాయిలు పెరిగినప్పుడు ఎగువ కనురెప్పపై పసుపు, నారింజ రంగులో పెరుగుదల లేదా నిక్షేపాలు కూడా కనిపిస్తాయి. అంతేకాకుండా, కొందరిలో కాళ్లు, పాదాలు చల్లపడిపోవడం వంటి లక్షణాలు ఉంటాయి.
  • కాళ్లు, పాదాలలో శారీరక మార్పులు ఉంటాయి, ఫలితంగా గోళ్లు, చర్మం తెలుపు లేదా పసుపు రంగు వస్తుంది. అధిక కొలెస్ట్రాల్ స్థాయిల నేపథ్యంలో గోళ్లు మరింత నెమ్మదిగా పెరుగుతాయని నిపుణులు చెబుతున్నారు. 

అధిక కొలెస్ట్రాల్ నివారణ మార్గాలు

అధిక కొలెస్ట్రాల్ గుండె జబ్బులు, గుండెపోటు ప్రమాదాన్ని పెంచుతుంది. మందులు కొలెస్ట్రాల్‌ను నిర్వహించగలిగినప్పటికీ, కొన్ని జీవనశైలి మార్పులు చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో మీకు సహాయపడతాయి.  ఆరోగ్యకరమైన ఆహారాలు తినడం, ధూమపానం లేదా మద్యపానం మానేయడం, క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం, ఆరోగ్యకరమైన శరీర బరువును నిర్వహించడం వంటివి చేస్తే అధిక కొలెస్ట్రాల్ సమస్య నుంచి బయటపడవచ్చు. జీవనశైలిలో చేర్చాల్సిన కొన్ని మార్పుల వల్ల మీ కొలెస్ట్రాల్ స్థాయిలను అదుపులో ఉంచుకోవడానికి ప్రతిరోజూ ఓ గంట సమయం పడుతుంది. అలాగే ప్రతిరోజూ అధిక కొలెస్ట్రాల్ లక్షణాలను గమనిస్తూ ఉండడం ముఖ్యం. 

(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణుల సలహాలు, సూచనల మేరకు అందించడం జరుగుతుంది. ఏవైనా సందేహాలుంటే నిపుణులను సంప్రదించండి.)

ఇవి కూడా చదవండి

మరిన్ని హెల్త్ ఆర్టికల్స్ చదవండి..