భారత్‌లోకి హెచ్ఎంపీవీ వైరస్..పిల్లల్లో ఈ లక్షణాలు ఉంటే జాగ్రత్త!
TV9 Telugu
ఏదైతే జరగకూడదు అనుకున్నారో, చివరకు అదే జరిగింది. చైనాను వణికిస్తున్న ప్రాణాంతకమైన హెచ్ఎంపీవీ వైరస్ భారత్‌లోకి ప్రవేశించింది.
కర్ణాటక రాష్ట్ర రాజధాని బెంగళూరులో ఓ చిన్నారికి ఈ వైరస్ సోకినట్లు వైద్యులు అనుమానిస్తున్నారు. ప్రస్తుతం ఎనిమిది నెలల పసికందు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు సమాచారం.
దీంతో దేశ ప్రజలు, ముఖ్యంగా కర్ణాటక పొరుగునే ఉన్న తెలుగు రాష్ట్రాలు భయాందోళనకు గురి అవుతున్నాయి. ప్రజలందరూ తగు జాగ్రత్తలు తీసుకోవాలని రాష్ట్రప్రభుత్వాలు సూచనలు జారీ చేస్తున్నాయి.
అయితే ఇప్పటి వరకు మాత్రం కర్ణాటక ప్రభుత్వం హెచ్‌ఎంపీవీ వైరస్ కేసు నమోదైనట్లు అధికారికంగా ప్రకటించలేదు.
కాగా, అసలు ఈ వైరస్ లక్షణాలు ఎలా ఉంటాయి. ముఖ్యంగా పిల్లల్లో ఎలాంటి లక్షణాలు ఉంటే తప్పనిసరిగా వైద్యులను సంప్రదించాలో ఇప్పుడు తెలుసుకుందాం.
ఈ వైరస్ బారిన పడిన పిల్లలకు ఎక్కువగా జ్వరం, దగ్గు, ముక్కు దిబ్బడ, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వంటి లక్షణాలు కనిపిస్తాయంట.
అలాగే ఈ హెచ్ఎంపీవీ వైరస్ బారిన పడిన పిల్లల్లు న్యూమోనియా, బ్రాంకైటిస్ వంటి ఇన్ఫెక్షన్ బారిన పడే ఛాన్స్ ఉందని, అందుకే తల్లిదండ్రులు పిల్లల పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి.
బయటకు వెళ్లేటప్పుడు మాస్క్ యూస్ చేయడం, శానిటైజర్ వాడటం లాంటివి తప్పకుండా చేయాలి. అంతే కాకుండా అవసరమైతే తప్ప పిల్లలను బయటకు తీసుకరాకూడదు.