- Telugu News Photo Gallery Experts suggest that those suffering from insomnia should follow some simple tips
Sleeping Tips: అర్ధరాత్రి దాటినా నిద్రపట్టడం లేదా.. ఈ సింపుల్ టిప్స్ పాటించి చూడండి..
లైఫ్ స్టైల్ మారిపోయింది. తినే ఆహారం నుంచి పడుకునే సమయం వరకు అన్నింట్లో విపరీతమైన మార్పులు వచ్చేశాయి. అర్ధరాత్రి దాటినా నిద్రపోయే పరిస్థితులు నేడు లేవు. దీంతో నిద్రలేమి కారణంగా అనేక ఆరోగ్య సమస్యలకు గురవుతున్నారు. అయితే.. రాత్రి పూట త్వరగా, చక్కగా నిద్ర పట్టాలంటే ఏం చేయాలో నిపుణులు చెబుతున్నారు. అవేంటంటే.. ..
Updated on: Feb 26, 2023 | 1:19 PM

ఒత్తిడి, అనారోగ్యకరమైన జీవనశైలి కారణంగా చాలా మంది రాత్రంతా నిద్ర లేకుండా గడుపుతారు. ఉద్యోగస్తులకైతే మరీ కష్టం రాత్రిళ్లు నిద్ర లేకపోవడం ఉదయాన్నే ఆఫీసులో నిద్ర రావడం లాంటి సమస్యలు వస్తుంటాయి. పైగా నిద్రలేమి అనేక వ్యాధుల ప్రమాదాన్ని పెంచుతుంది.

నిద్రలేమికి ఆయుర్వేదంలో కొన్ని రకాల చిట్కాలు చాలా బాగా పనిచేస్తాయి. రాత్రుళ్లు నిద్ర సరిగా పట్టకపోతే, ఏం చేయాలో తెలుసుకుందాం. సాధారణ నిద్రకు మేల్కొనే సమయం చాలా ముఖ్యం. రోజూ నిర్ణీత సమయానికి పడుకోకపోతే నిద్రలేమి సమస్య పెరుగుతుంది. అలాంటప్పుడు మంచి నిద్ర పొందడానికి కుంకుమపువ్వు సహాయపడుతుంది.

నిద్రలేమి సమస్యకు మరో ఇంటి చిట్కా కూడా చక్కగా పనిచేస్తుంది. మీరు రాత్రిపూట సరిగా నిద్రపట్టక అవస్థలుపడుతున్నట్టయితే, జాజికాయ మంచి నిద్రను పొందేందుకు సహాయపడుతుంది. కాబట్టి మీరు పడుకునే ముందు గోరువెచ్చని పాలలో జాజికాయ పొడిని కలుపుకుని తాగవచ్చు. ఇలా చేయడం వల్ల మీకు మంచి నిద్ర పడుతుంది.

పాలలో ట్రిప్టోఫాన్ ఉంటుంది. రాత్రి నిద్రను మెరుగుపరచడంలో ఇది చాలా సహాయపడుతుంది. అందుకే రాత్రి నిద్ర రాకపోతే పడుకునే ముందు ఒక గ్లాస్ పాలు తాగండి. నిద్రలేమితో బాధపడుతుంటే తలకు, పాదాలకు నూనె రాసుకుని సరిగ్గా మసాజ్ చేయడం వల్ల చాలా ఉపశమనం పొందవచ్చు.

రాత్రి పడుకునే ముందు అరికాళ్లకు ఆముదం లేదా నువ్వుల నూనె, లేదా కొబ్బరి నూనెతో మర్దన చేయాలి. నిద్ర పోవడానికి రెండు గంటల ముందు నుంచి మొబైల్ ఫోన్ చూడటం మానేయాలి. ఇలా చేయడం వల్ల ప్రశాంతమైన, మంచి నిద్రను పొందుతారు



