ఈ ఫుడ్స్ నుంచి పిల్లలను దూరం పెట్టండి.. 

TV9 Telugu

06 January 2025

పిల్లలకి ఇచ్చే ఆహారం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. పిల్లల ఆరోగ్యవంతమైన ఎదుగుల కోసం ప్రతి పేరెంట్ ఎన్నో విధాలుగా ఆలోచించాలి.

పిల్లల మానసిక, శారీరక ఎదుగుదలలో ఆహారం కీ రోల్ పోషిస్తుంది. అయితే, కొన్ని ఫుడ్స్ పిల్లలకి అస్సలు మంచిది కాదు. వీటిని తీసుకోవడం వల్ల పిల్లల్లో జ్ఞాపకశక్తి మందగించే ప్రమాదం ఉంది.

రంగురంగుల ఫుడ్స్ జిలేబీలు, రంగుల స్వీట్స్ లో ఆర్టిఫీషియల్ కలర్స్ ఉంటాయి. దీని వల్ల పిల్లల్లో ఆందోళన, తలనొప్పి, హైపర్ యాక్టివిటీ సమస్యలు వస్తాయి.

ట్రాన్స్ ఫ్యాట్స్ ఉండే ఆహారం మెదడు ఆరోగ్యంపై నెగెటివ్ ఎఫెక్ట్‌ని చూపిస్తాయి. ఫ్రై చేసిన ఫుడ్స్, ప్యాకేజ్డ్ స్నాక్స్‌లో ట్రాన్స్‌ఫ్యాట్స్‌ ఎక్కువ.

ట్రాన్స్‌ఫ్యాట్స్‌ పిల్లల మెదడులో వాపుని పెంచుతాయి. అదనంగా సెరటోనిన్ హార్మోన్‌ ఉత్పత్తిని తగ్గిస్తుంది. దీని ప్రభావం డిప్రెషన్, మెమరీ లాస్‌కి దారి తీస్తుంది.

చాక్లెట్స్‌ ఇతర కెఫిన్ డ్రింక్స్ తీసుకుంటే వణుకు, భయం, నిద్రలేమి బాధిస్తాయి. ఇవన్నీ పిల్లల మానసిక అభివృద్ధిని ప్రభావితం చేస్తాయి.

స్వీట్స్ పిల్లల బ్రెయిన్ హెల్త్‌కి మంచిది కాదు. స్వీట్స్, ఐస్‌క్రీమ్స్, కేక్స్, బేబీ ఫుడ్స్‌లో చక్కెర చాలా ఉంటుంది. ఇది హైపర్ యాక్టివిటీకి కారణమవుతుంది. పిల్లల ఆకలిని ప్రభావితం చేస్తుంది.

స్వీట్స్ పిల్లల బ్రెయిన్ హెల్త్‌కి మంచిది కాదు. స్వీట్స్, ఐస్‌క్రీమ్స్, కేక్స్, బేబీ ఫుడ్స్‌లో చక్కెర చాలా ఉంటుంది. ఇది హైపర్ యాక్టివిటీకి కారణమవుతుంది. పిల్లల ఆకలిని ప్రభావితం చేస్తుంది.