ఆ దేశాల ప్రయాణాల్లో నిషేధిత వస్తువులు ఇవే..

TV9 Telugu

05 January 2025

యూఏఈ, ఖతర్‌, ఒమాన్‌, దుబాయ్‌ లాంటి తదితర గల్ఫ్‌ దేశాలకు వెళ్లేవారు నిషేధిత వస్తువులు గురించి తప్పక తెలుసుకోవాలి.

భారతీయ రుచులను ఆస్వాదించాలనే కోరికతో పచ్చళ్లు, నెయ్యి వంటి వాటిని తీసుకెళ్లడంపై విమాన ప్రయాణాల్లో నిషేధం.

విమానయానంలో వెంట తీసుకెళ్లకూడని నిషేధిత వస్తువులపై అవగాహన లేకపోవడంతో ప్రయాణికుల బ్యాగేజీలను తిరస్కరిస్తున్నారు.

సంక్రాంతి పండుగ వస్తుండటంతో నిషేధిత వస్తువులపై ప్రయాణికులకు అవగాహన కల్పిస్తున్నారు ఎయిర్ పోర్ట్ అధికారులు.

ఎండు కొబ్బరి, పెయింట్‌, కర్పూరం, నెయ్యి, పచ్చళ్లు, నూనెతో తయారు చేసిన తినుబండారాలు తీసుకెళ్లకూడదని తెలిపారు.

బాణసంచా, ఈ-సిగరెట్లు, లైటర్స్‌, పవర్‌ బ్యాంక్స్‌, స్ప్రే బాటిల్స్‌ వంటి వాటిని కూడా తీసుకెళ్లరాదని చెప్తున్నారు.

వీటి గురించి దృష్టిలో ఉంచుకొనే గల్ఫ్‌ దేశాలకు వెళ్లేవారు ముందుగానే జాగ్రత్త పాడడం మంచిది. లేదంటే లగేజ్ విషయంలో ఇబ్బంది పడతారు.

ఇంటి దగ్గర నుంచి ఇలాంటి వస్తువులు పట్టుకొనివెళ్ళకుండా జాగ్రత్త పడండి. అప్పుడు మీ ప్రయాణం సాఫీగా సాగుతుంది.